
బ్యాంకును మోసగించిన వారిపై కేసు
ఇల్లందు (ఖమ్మం జిల్లా) : ఖమ్మం జిల్లా ఇల్లందులో నకిలీ పట్టాదార్ పాసు పుస్తకాలు సృష్టించి బ్యాంకులో రూ.5లక్షల 36 వేలు రుణం పొందిన ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఇల్లందు తహశీల్దార్ ప్రకాశ్‌రావు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు రికార్డులు తనిఖీ చేయగా బ్యాంకుకు సమర్పించిన పట్టాదార్ పాస్ పుస్తకాలు నకిలీవని తేలిందన్నారు. ఫలితంగా నకిలీ పట్టాదార్ పాస్‌పుస్తకాలు సృష్టించిన ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.