నగరంలోని ఇబ్రహీం బాగ్ దగ్గర ఉన్న జేకే ఫంక్షన్ హాల్ పక్కన ఉన్న ఖాళీస్థలంలో ఓ చెట్టుకు గుర్తుతెలియని వ్యక్తి ఉరి వేసుకున్న స్థితిలో స్థానికులకు శనివారం కనిపించాడు.
హైదరాబాద్ సిటీ: నగరంలోని ఇబ్రహీం బాగ్ దగ్గర ఉన్న జేకే ఫంక్షన్ హాల్ పక్కన ఉన్న ఖాళీస్థలంలో ఓ చెట్టుకు గుర్తుతెలియని వ్యక్తి ఉరి వేసుకున్న స్థితిలో స్థానికులకు శనివారం కనిపించాడు. స్థానికులు సమాచారాన్ని గోల్కొండ పోలీసులకు తెలపడంతో.. వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
చనిపోయిన వ్యక్తి వయసు సమారు 45 ఉండవచ్చు. ఎవరైనా హత్య చేసి చెట్టుకు వేలాడదీశారా లేక తనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.