రంగారెడ్డి జిల్లా మల్కాజ్గిరికి చెందిన ఓ మహిళ రోడ్డు దాటుతూ ఉన్నట్టుండి కుప్పకూలి పడిపోయి మృతి చెందింది.
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా మల్కాజ్గిరికి చెందిన ఓ మహిళ రోడ్డు దాటుతూ ఉన్నట్టుండి కుప్పకూలి పడిపోయి మృతి చెందింది. ఈ సంఘటన మంగళవారం ఉదయం విజయవాడ బస్‌స్టేషన్ సమీపంలోని పోలీస్ కంట్రోల్ రూం వద్ద జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
మృతురాలి వద్ద లభించిన ఆధారాలతో ఆమె రంగారెడ్డి జిల్లా మల్కాజ్గిరికి చెందిన హేమాద్రి కల్యాణి (51)గా పోలీసులు గుర్తించారు.