సాక్షి, హైదరాబాద్: రక్షణ, అంతరిక్ష రంగాల్లో వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పరిశోధనశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కూడా సంసిద్ధం కావాలని రక్షణ మంత్రి శాస్త్రీ య సలహాదారు డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. డీఆర్‌డీవో వంటి పరిశోధనశాలలు రీసెర్చ్‌కు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని, తయా రీ రంగంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కూడా సొంతంగా రీసెర్చ్ పనులు చేపట్టడం ఎంతైనా అవసరమని చెప్పారు.
హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన న్యూక్లియర్ ఫ్యూయెల్ కాంప్లెక్స్ (ఎన్‌ఎఫ్‌సీ) వ్యవస్థాపక దినోత్సవానికి సతీశ్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎన్‌ఎఫ్‌సీ తన 42 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో రికార్డులు సృష్టించిందని, సామర్థ్యం కంటే 50 శా తం ఎక్కువ అణు ఇంధన బండిళ్లను తయారు చేయడం దేశానికి గర్వకారణమన్నారు.
మూడేళ్లలో యాంటీట్యాంక్ మిస్సైల్...
రక్షణరంగంలో స్వావలంబన దిశగా రెండు మూడేళ్లలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి న యాంటీట్యాంక్ మిస్సైల్‌ను జాతికి అంకి తం చేసే అవకాశముందని సతీశ్‌రెడ్డి తెలిపా రు. కేంద్రప్రభుత్వ ఆఫ్‌సెట్ విధానాల కారణం గా రక్షణ రంగంలో దేశీ కంపెనీలకు ఎన్నో అవకాశాలు వస్తున్నాయని, నాణ్యమైన ఉత్పత్తుల తో ఉపయోగించుకోవాలని సూచించారు. సహజ వనరులన్నింటిపై సమగ్ర విధానాన్ని రూపొందించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
1252 టన్నుల అణు ఇంధనం
2014 - 15 సంవత్సరానికిగాను తాము 1252 టన్నుల అణు ఇంధన బండిళ్లను తయారు చేసి ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకున్నామని ఎన్‌ఎఫ్‌సీ సీఎండీ డాక్టర్ ఎన్.సాయిబాబా తెలిపారు. సంస్థ ఉత్పాదక సామర్థ్యం 850 టన్నులు మాత్రమే అయినప్పటికీ ఈ ఘనత సాధించడం విశేషమన్నారు. కార్యక్రమంలో అటామిక్ మినరల్స్ డివిజన్ డెరైక్టర్ పి.ఎస్.పరిహార్, ఈసీఐఎల్ సీఎండీ డాక్టర్ పి.సుధాకర్, ఎన్‌ఎఫ్‌సీ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎస్.గోవర్ధన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
పరిశోధన తీరుతెన్నులు మారాలి
Published Sat, Jun 20 2015 3:55 AM | Last Updated on Sun, Sep 3 2017 4:01 AM
Advertisement