కలాం స్ఫూర్తితో అంతరిక్ష విజయాలు | Satish Reddy Comments On Space achievements | Sakshi
Sakshi News home page

కలాం స్ఫూర్తితో అంతరిక్ష విజయాలు

Published Mon, Feb 6 2023 5:21 AM | Last Updated on Mon, Feb 6 2023 8:06 AM

Satish Reddy Comments On Space achievements - Sakshi

మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమంలో ప్రవాస భారతీయులతో డాక్టర్‌ జి.సతీష్‌రెడ్డి

ఆత్మకూరు రూరల్‌: దివంగత రాష్ట్రపతి, అగ్రశ్రేణి క్షిపణి శాస్త్రవేత్త డాక్టర్‌ అబ్దుల్‌ కలాం స్ఫూర్తితో భారత రక్షణ శాఖ అంతరిక్ష విజయాలు సాధిస్తోందని భారత రక్షణ శాఖ శాస్త్ర, సాంకేతిక సలహా­దారు డాక్టర్‌ గుండ్రా సతీష్‌రెడ్డి అన్నారు. గత నెల 30 నుంచి ఈ నెల 4వ తేదీ వరకు అమెరికాలోని డల్లాస్‌లో ప్రవాస భారతీయులు, జేఎన్‌టీయూ నిపుణులు ఏర్పాటు చేసిన ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’ కార్యక్రమంలో సతీష్‌రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఆర్‌డీవోలో తన ప్రస్థానం గురించి వివరించారు. అబ్దుల్‌ కలాం శిష్యుడిగా డీఆర్‌డీవోలో పెద్ద లక్ష్యాలను ఏర్పచు­కుని వాటిని సాధించడం కోసం సహచర శాస్త్ర­వేత్తలతో కలిసి పనిచేసి ఘన విజయాలు సాధించామన్నారు. గత 8 ఏళ్లుగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సాధించిన పరిశోధనల ఫలితంగా భారతదేశ రక్షణ వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతోందన్నారు.

దేశ రక్షణకు అవసరమైన ఆయుధాలు, క్షిపణులు స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకుని అగ్రరా­జ్యాల సరసన చేరామన్నారు. ప్రపంచ శాంతి కోసం తన బలాన్ని, బలగాన్ని భారతదేశం విని­యోగిస్తోందని సతీష్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శాస్త్రవిజ్ఞానం అభివృద్ధికి అంకితభావంతో సతీష్‌రెడ్డి చేసిన పరిశోధనలను పలువురు వక్తలు ప్రశంసించారు.

అనంతరం సతీష్‌రెడ్డిని అమెరికా­లోని తెలుగు అసోసియేషన్లు అయిన టాంటెక్స్, తానా, నాటా, నాట్స్, ఆట సంస్థల ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాటా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి కోర్సిపాటి, ఆయా సంఘాల నాయకులు చిల్లకూరి గోపిరెడ్డి, అజయ్‌ కలువ, ఉప్పలపాటి కృష్ణారెడ్డి, బలరామ్, భీమా, భాస్కర్‌­రెడ్డి, సురేష్, రంగారావు, శ్రీనివాసరాజు, శ్రీనివా­సమూర్తి, పులి సురేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement