జహీరాబాద్ (మెదక్) : రైతు నుంచి లంచం తీసుకుంటూ ఓ వీఆర్వో అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) అధికారులకు దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా జహీరాబాద్ మండలం ఈదులపల్లికి చెందిన బుచ్చయ్య.. కుటుంబసభ్యులకు చెందిన భూమి పట్టా మార్పిడి కోసం వీఆర్వో సంగయ్యను సంప్రదించాడు.
అయితే రూ.3, 500లు ఇస్తేనే పని అవుతుందని వీఆర్వో మెలికపెట్టారు. దీంతో బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు జహీరాబాద్‌లోని మండల కార్యాలయం వద్ద మంగళవారం మధ్యాహ్నం బుచ్చయ్య రూ.3, 500లు అందజేస్తుండగా పట్టుకున్నారు. సంగయ్యను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఏసీబీకి పట్టుబడిన వీఆర్వో
Published Tue, Sep 1 2015 6:27 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement