ములుగు, న్యూస్‌లైన్ : బిల్డింగ్ సబ్ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఏసీబీ అధికారులకు చిక్కిన సంఘటన ములుగు ఫారెస్ట్ కార్యాలయం శనివారం చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ సాయిబాబా కథనం ప్రకారం.. ములుగు ఫారెస్ట్ కార్యాలయంలో బీట్ ఆఫీసర్ల కో సం భవనాలు మంజూరయ్యాయి.
ఈ భవన నిర్మాణ పనులను హన్మకొండకు చెందిన కాంట్రాక్టర్ రాజయ్య చేపట్టారు. నిబంధనల ప్రకారం బిల్డింగ్ కి 14 పిల్లర్లు నిర్మించాల్సి ఉండగా సదరు కాంట్రాక్టర్ 13 పిల్లర్లు మా త్రమే నిర్మిస్తున్నాడని, ఇం దుకు సంబంధించిన బిల్లు పై సంతకం చేయాలంటే తనకు రూ.50 వేలు లంచంగా ఇవ్వాలని రేంజ్ అఫీసర్ వేణుగోపాల్ డిమాండ్ చేశాడు. దీంతో సదరు కాంట్రాక్టర్ రూ.20 వేలు సమర్పించాడు. అయినా అతడు ఊరుకోకుండా మిగతా రూ.30 వే ల కోసం వేధించడంతో ఈ నెల 19వ తేదీన ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
ఈ క్రమంలోనే రాజయ్య నుంచి ఎఫ్‌ఆర్‌ఓ వేణుగోపాల్ తన కార్యాలయంలో రూ.12 వేలు తీసుకుంటుండగా అక్కడే పొంచి ఉన్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాం డెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయం లో ఇప్పటి వరకు పట్టుకున్న వాహనాలను, వాటికి అధికారులు తీసుకున్న లావాదేవీలను పరిశీలించారు. డీఎస్పీ వెంట సీఐలు పి. సాంబయ్య, రాఘవేందర్‌రావు, రియాజ్ ఉన్నారు.
ఏసీబీకి చిక్కిన ఎఫ్‌ఆర్‌ఓ
Published Sun, Mar 23 2014 5:38 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement