ఖమ్మం: ఖమ్మం జిల్లా రిజిస్టార్ ఆఫీస్‌లో సీనియర్ ఆసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గణపతిరావు వాలిడిటి సర్టిఫికెట్ కోసం అర్జీ పెట్టుకున్న హైకోర్టు అడ్వకే ట్ సీతారాంరెడ్డిని రూ. 3 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో సీతారాంరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అదికారులు అడ్వకేట్ నుంచి గణపతిరావు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఆయనను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.