భిక్షమయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలి | Activists Of Congress Asking Votes For Winning Party | Sakshi
Sakshi News home page

భిక్షమయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలి

Published Wed, Nov 14 2018 12:52 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Activists  Of Congress  Asking Votes For Winning Party  - Sakshi

పటాకులు కాలుస్తున్న కాంగ్రెస్‌ నాయకులు , ప్రచారం నిర్వహిస్తున్న నాయకులు

సాక్షి,యాదగిరిగుట్ట : కాంగ్రెస్‌ పార్టీ ఆలేరు అసెంబ్లీ అభ్యర్థి బూడిద భిక్షమయ్యగౌడ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని డీసీసీ వైస్‌ ప్రసిడెంట్‌ కలకుంట్ల బాల్‌నర్సయ్యగౌడ్, ప్రధాన కార్యదర్శి సుడుగు శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు బీర్ల అయిలయ్య పిలుపునిచ్చారు. భిక్షమయ్యగౌడ్‌కు ఆలేరు టిక్కెట్‌ ఇవ్వడంపై మంగళవారం స్థానికంగా ఆ పార్టీ నాయకులు పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల నేతగా ఉన్న భిక్షమయ్యకు కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్‌ ఇవ్వడం హర్షనీయమన్నారు. భిక్షమయ్యను అధిక మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్‌గౌడ్, మాజీ ధర్మకర్త పెలిమెల్లి శ్రీధర్‌గౌడ్, గుండ్లపల్లి కరణ్‌గౌడ్, చీర శ్రీశైలం, పెలిమెల్లి చిన్న వెంకట్‌గౌడ్, గుండు నర్సింహగౌడ్, బొజ్జ సాంబేష్, గడ్డం చంద్రంగౌడ్, శేఖర్, బత్తిని ఆనంద్‌గౌడ్, రాంపల్లి రజినికాంత్‌గౌడ్‌ తదితరులున్నారు.  
భిక్షమయ్యగౌడ్‌కు టికెట్‌పై హర్షం
ఆత్మకూరు(ఎం) : కాంగ్రెస్‌ అభ్యర్థిగా బూడిద భిక్షమయ్యగౌడ్‌కు టికెట్‌ రావడంపై కాంగ్రెస్‌ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని మెయిన్‌ రోడ్డు వద్ద  పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గంగపురం మల్లేశం, నాయకులు యాస లక్ష్మారెడ్డి, కొడిత్యాల నరేందర్‌ గుప్తా, సింగిల్‌ విండో చైర్మన్‌ జిల్లాల శేఖర్‌రెడ్డి, ఎంపీటీసీ దిగోజు నర్సింహాచారి, పాల సంఘం చైర్మన్‌ జెన్నాయికోడె నగేష్, కందడి అనంతరెడ్డి, ముద్దసాని సిద్దులు, కట్టెకోల హన్మంతుగౌడ్, పరకాల అంజయ్య, బొబ్బల అంజిరెడ్డి, లోడి శ్రీను, చామకూర నారాయణ, చెరుకు శ్రీనువాస్‌గౌడ్, ఎలగందుల మహేష్, కొసన కిష్టయ్య, ఉగ్గె నరేష్‌ ఉన్నారు.  
కాంగ్రెస్‌ పార్టీ గెలుపు ఖాయం:
బొమ్మలరామారం : ఆలేరులో కాంగ్రెస్‌ పార్టీదే గెలుపు ఖాయమని ఆ పార్టీ నాయకుడు మహదేవుని రాజు అన్నారు. మహాకూటమి అభ్యర్థిగా భిక్షమయ్యగౌడ్‌కు టికెట్‌ ఖరారు కావడంతో హర్షం వ్యక్తం చేస్తూ.. మంగళవారం మండలంలో చీకటిమామిడి గ్రామంలో పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో యావపూర్‌ రాజునాయక్, కట్టా మాణిక్యంగౌడ్, శంకర్, జూపల్లి శ్రీకాంత్‌ పాల్గొన్నారు. 
కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే ఆలేరు అభివృద్ధి
తుర్కపల్లి : కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తేనే ఆలేరు అభివృద్ధి సాధ్యమని ఎంపీపీ బబ్బూరి రవీంద్రనాథ్‌గౌడ్‌ అన్నారు. మంగళవారం మండలంలోని దేవోజినాయక్‌ తండాలో గడప గడపకు కాంగ్రెస్‌ కార్యక్రమంలో భాగంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాలకు నిత్యం అండదండగా ఉండి అభివృద్ధి చేసే నాయకుడు భిక్షమయ్యగౌడ్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గడ్డమీది సత్యనారాయణ, ఎంపీటీసీ యేశబోయిన రాజయ్య, నాయకులు చాడ కరుణాకర్‌రెడ్డి, కానుగంటి శ్రీనివాస్, బోరెడ్డి హన్మంత్‌రెడ్డి, బోరెడ్డి మహిపాల్‌రెడ్డి, ఎరుకల వెంకటేశ్‌గౌడ్, ఐనాల మహేందర్‌రెడ్డి, వంగ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
రాయిపల్లిలో ప్రచారం:
ఆత్మకూరు(ఎం) : కాంగ్రెస్‌ అభ్యర్థి భిక్షమయ్యగౌడ్‌ను గెలిపించాలని పలువురు ఆ పార్టీ నాయకులు కోరారు. గడపగడపకు కాంగ్రెస్‌ కార్యక్రమంలో భాగంగా మంగళవారం వారు మండలంలోని రాయిపల్లిలో ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న మేనిపెస్టోను ప్రజలకు కరపత్రాల ద్వారా వివరించారు.  కార్యక్రమంలో జెడ్పీటీసీ గంగపురం మల్లేశం, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యాస లక్ష్మారెడ్డి, మండల అధ్యక్షుడు కొడిత్యాల నరేందర్‌ గుప్తా, సింగిల్‌ విండో చైర్మన్‌ జిల్లాల శేఖర్‌రెడ్డి, ఎంపీటీసీ బూడిద రాములుగౌడ్, పాల సంఘం చైర్మన్‌ జెన్నాయికోడె నగేష్, కందడి అనంతరెడ్డి పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement