కరీంనగర్ అగ్రికల్చర్ : అన్నదాతకు దెబ్బమీద దెబ్బలా అకాల వర్షాలు తీరని నష్టం కలిగిస్తున్నాయి. పంట చేతికందే సమయంలో నోటికాడి బుక్కను లాగేసుకోవడంతో రైతులు బోరుమని విలపిస్తున్నా రు. బుధవారం జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పంటలను మళ్లీ దెబ్బతీశాయి.వరి, మామిడి, మొక్కజొన్న, సజ్జ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. హుజూరాబాద్, హుస్నాబాద్ వ్యవసాయ డివిజన్లలో పంట నష్టం ఎక్కువగా ఉంది. మొత్తం 10,107 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నా యి. బుధవారం జిల్లావ్యాప్తంగా 6.7 మిల్లీమీట ర్ల సగటు వర్షపాతం నమోదు కాగా కోహెడలో అత్యధికంగా 3.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గంభీరావుపేటలో 3, సిరిసిల్లలో 2.2, ఇల్లంతకుంటలో 2.2, హుస్నాబాద్‌లో 2. 9, బెజ్జంకిలో 1.9, చిగురుమామిడిలో 1.5, భీ మదేవరపల్లిలో 3.7, సైదాపూర్‌లో 2.1, ఎల్కతుర్తిలో 3, పెగడపల్లిలో 1.5 సెంమీ వర్షం కురిసింది.
గురువారం కురిసిన అకాల వర్షాలతో 33 శాతంపైగా పరిగణలోకి తీసుకున్న ఆహార పంటల్లో 6 మండలాల్లో 1,358 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ జేడీ నర్సింహారావు తెలిపారు. కోహెడలో 350 హెక్టార్లు, భీమదేవరపల్లిలో 120, చిగురుమామిడిలో 328, ఇల్లంతకుంటలో 500, కొడిమ్యాలలో 40, ఎల్కతుర్తిలో 20 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.
పంటలవారీగా నివేదిక తయారు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఉద్యాన పంటల్లో 15 మండలాల్లో 2,685 హెక్టార్లలో మామిడి పంటలు దెబ్బతిన్నాయని ఆ శాఖ అధికారి శ్యాం తెలిపారు. గంభీరావుపేట, సిరిసిల్ల, బోయినిపల్లి, ఇల్లంతకుంట, చిగురుమామిడి, హుస్నాబాద్, కోహెడ, బెజ్జంకి, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్, కేశవపట్నం, జమ్మికుంట, తిమ్మాపూర్, మానకొండూర్ మండలాల్లో మామిడి దెబ్బతిన్నట్లు గుర్తించారు.
అకాల గుబులు
కోతల సమయంలో అకాల వర్షాలు అన్నదాత కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే కోతలకు సన్నద్ధమైన రైతాంగం ఆ ప్రక్రియను వాయిదా వేసుకుంటుండగా పలుచోట్ల ఆగమాగం కోతల్లో నిమగ్నమయ్యారు. 15 రోజుల వ్యవధిలో కురిసిన వడగళ్లు, అకాల వర్షాలతో ఇప్పటివరకు 72,782 ఎకరాల్లో పంటలు దిబ్బతిన్నాయని సంబంధిత అధికారులు ప్రాథమిక అంచనా రూపొందించారు.
10,503 హెక్టార్లలో ఉద్యాన పంటలు, 18,610 హెక్టార్లలో ఆహార పంటలు దెబ్బతిన్నాయని గుర్తించారు. ప్రధానంగా మామిడి 10,264 హెక్టార్లు, అరటి 141, బొప్పాయి 73, కూరగాయలు 25 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. వరి 8,456, మొక్కజొన్న 1,150, సజ్జ 1,620, నువ్వులు 5,903 , పెసర్లు 122 హెక్టార్లలో దెబ్బతిన్నాయని గుర్తించారు. ప్రాథమిక అంచనాల మేరకు రీ సర్వే జరుగుతుండగానే అకాల వర్షం మరోసారి పంటలకు నష్టం చేకూర్చింది.
దెబ్బమీద దెబ్బ
Published Fri, Apr 24 2015 1:43 AM | Last Updated on Sun, Sep 3 2017 12:45 AM
Advertisement