కరీంనగర్: జిల్లా పరిషత్ స్థాయూ సంఘ సమావేశాలు తూతూమంత్రంగా సాగారుు. కీలకమైన సమావేశాలకు అందులో సభ్యులుగా ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో పాటు పలువురు జెడ్పీటీసీలు గైర్హాజరయ్యూరు. వ్యవసాయం, విద్య, వైద్యంతో పాటు ప్రభుత్వ పథకాలపై అమలులో అధికారుల తీరుపై సభ్యులు మండిపడ్డారు.
వ్యవసాయంపై మూడవ స్థాయూ సంఘ సమావేశం బుధవారం ఉదయం 10.30 గంటలకు జరగాల్సి ఉండగా గంట ఆలస్యంగా మొదలైంది. స్థాయూ సంఘం చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ట్రైయినీ కలెక్టర్ అధ్వైత్‌సింగ్, జెడ్పీ సీఈవో సూరజ్‌కుమార్ పాల్గొన్నారు. సమావేశం ప్రారంభమైన వెంటనే ధర్మారం జెడ్పీటీసీ నారా బ్రహ్మయ్య మాట్లాడుతూ... ఏప్రిల్, మేనెలల్లో ఉండాల్సిన ఎండలు ఫిబ్రవరిలోనే మండుతున్నాయని, ఈ నేపథ్యంలో జిల్లా వ్యవసాయ శాఖ రైతులకు ఎలాంటి సూచనలు ఇవ్వదలచుకుందో స్పష్టం చేయూలన్నారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా జిల్లాకు ట్రాక్టర్లు మంజూరైనా, బ్యాంకులు కాన్సెంట్ ఇవ్వడంలో ఇబ్బందులు పెడుతున్నాయని పేర్కొన్నారు.
బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి సన్న, చిన్నకారు రైతులకు త్వరితగతిన రుణాల మంజూరు చేయూలని డిమాండ్ చేశారు. మల్హర్ జెడ్పీటీసీ గోనె శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న రుణాల మాఫీపై స్పష్టతలేదని, నిబంధనలు ఏమిటో వెల్లడించాలన్నారు. ట్రాక్టర్ల యూనిట్ల సంఖ్యను పెంచడంతో పాటు లోన్‌లో ఉన్న నిబంధనలను సడలించాలని కోరారు. సంఘ చైర్మన్ రాజిరెడ్డి కల్పించుకొని జిల్లాకు 110 ట్రాక్టర్లు మంజూరయ్యాయని, మరిన్ని యూనిట్ల కోసం మంత్రి ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. పంట రుణాలు, ఇన్‌పుట్ సబ్సిడీ వివరాలపై జేడీ ఛత్రునాయక్‌ను వివరణ కోరారు.
ఇప్పటికే పంట రుణాలు, ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీ 90 శాతం పూర్తయిందని, ఆన్‌లైన్‌లో తలెత్తిన చిన్న తప్పిదాల వల్ల పొరపాట్లు జరిగాయని, నెలరోజుల్లో ఎలాంటి సమస్యలు పరిష్కారిస్తామని జేడీఏ పేర్కొన్నారు. మామిడితోటలకు నష్టపరిహారం చెల్లింపులో జాప్యమెందుకని ధర్మారం, చందుర్తి జెడ్పీటీసీలు నారా బ్రహ్మయ్య, అంబటి గంగాధర్ ప్రశ్నించారు. 2011నుంచి ఇంతవరకు జరిగిన నష్టంపై ప్రభుత్వానికి నివేదికలు సమర్పించామని, డబ్బులు రాగానే అందజేస్తామని ఉద్యానవన శాఖ ఏడీ జ్యోతి వెల్లడించారు. సమావేశంలో పశుసంవర్ధకశాఖ, మత్స్యశాఖ, అటవీశాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులు రాంచందర్‌నాయక్, దేవేందర్, జ్యోతి, ప్రభాకర్ పాల్గొన్నారు.
విద్య, వైద్యంపై చర్చ
మధ్యాహ్నం 2గంటలకు ప్రారంభమైన నాల్గవ విద్య, వైద్య సేవల స్థాయూ సంఘ సమావేశం గరంగరంగా కొనసాగింది. జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పి.సుధాకర్‌రెడ్డి, జెడ్పీటీసీలు పొన్నాల లక్ష్మయ్య, చల్ల ప్రగతి, సిద్దం వేణు, జంగిలి సునీత, యాట దివ్య పాల్గొన్నారు. సమావేశం ప్రారంభం కాగానే కోహెడ, ఇబ్రహీంపట్నం జెడ్పీటీసీలు మోడల్ స్కూళ్లలో కనీస వసతులు కరువయ్యాయని, మరుగుదొడ్లు లేక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారని, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకులకు బిల్లుల చెల్లింపులో జాప్యంపై మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి అధికారులకు నివేదించినా ఫలితంలేదని, కోట్ల నిధులు వస్తున్నా ఉపయోగపడడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యం వీడి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జెడ్పీటీసీలు చల్ల ప్రగతి, జె.సునీత, దివ్య మాట్లాడుతూ.. వైద్యాధికారులు స్థానికంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వాసుపత్రుల్లో కనీస వసతులు కరువయ్యాయని, పారదర్శకత, సమయపాలన లేకపోవడం వల్ల ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వశిక్ష అభియాన్ పథకాల అమలు తీరుపై ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, సభ్యులు మాట్లాడుతూ.. కోట్ల నిధులు ఖర్చుచేస్తున్నా ఆశించిన ప్రగతి కనిపించడం లేదని, విద్యా వ్యవస్థను ఒకేగొడుగు కిందికి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇలాగైతే ఎలా? : తుల ఉమ
సమయానికి రారు. నివేదికలు తేరు. సంబంధిత శాఖ అధికారులు కాకుండా అసిస్టెంట్లను పంపుతారు. ఇలాగైతే ఎలా? అంటూ అధికారుల తీరుపై తుల ఉమ అసహనం వ్యక్తం చేశారు. ఎప్పటిలాగే అధికారులు ఆలస్యంగా రావడం, సమగ్ర నివేదికలు తేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటిస్తూ జవాబుదారీతనంతోనే ప్రభుత్వం చేపడుతున్న పథకాలు ప్రజల్లోకి చేరుతాయని, అధికారులు తీరుమార్చుకోవాలని చురకలంటించారు.
కొత్త బిచ్చగాళ్లం.. సహకరించండి : ఎమ్మెల్సీ
మాది ప్రజాప్రభుత్వం. అధికారుల్లారా నిర్లక్ష్యం వద్దు. పూర్తి సమాచారంతో రండి. పనిచేస్తామనే ఆరాటం మాకుంది. మాతో సహకరించండి అంటూ పాతూరి సుధాకర్‌రెడ్డి అధికారుల తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వం కోట్లు ఖర్చుచేస్తుంటే క్షేత్రస్థాయిలోకి వెళ్లకపోవడం బాధాకరమని, ఏం జరుగుతుందో తమకు బోధపడడంలేదని, ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని అధికారులను ప్రశ్నించారు.
ప్రజాప్రతినిధుల డుమ్మా..
ప్రభుత్వ పథకాల అమలు, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు, నిధుల కేటాయింపుపై ప్రతిపాదనలు సమర్పించే స్థాయూ సంఘ సమావేశాలకు కీలకమైన ప్రజాప్రతినిధులు డుమ్మా కొట్టారు. కీలకమైన వ్యవసాయం, విద్య, వైద్యం స్థాయూ సంఘ సమావేశాలకు సభ్యులైన ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు టి.జీవన్‌రెడ్డి, పుట్ట మధు, జెడ్పీటీసీలు జనగామ శరత్‌రావు, డి.ప్రభాకర్, ఎం.ప్రమీల, ఎం.సరోజన, చొప్పరి సదయ్య గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన విద్య, వైద్య స్థాయూ సంఘం సమావేశానికి సభ్యులైన ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, వొడితెల సతీష్‌కుమార్, దాసరి మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్ హాజరుకాలేదు.
స్థాయీ సంఘం..తూతూమంత్రం
Published Thu, Feb 26 2015 1:46 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement