సమీక్షలతో సరి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘పారిశుద్ధ్యలోపంపై యుద్ధ ప్రకటిద్దాం..పిచ్చిమొక్క లు పీకేసి, మురుగు తొలిగింపు కోసం నాలుగైదు రోజుల్లో కార్యాచరణ రూపొందిద్దాం..పచ్చతోరణం కింద మండలానికి లక్ష చొప్పున మొక్కలు నాటుదాం.. ఇక ఆస్పత్రుల్లో వై ద్యం అందక మరణించడానికి వీల్లేదు.
ముఖ్యంగా అన్ని ఆ స్పత్రుల్లో వార్‌మోడ్‌లో(యుద్ధ ప్రాతిపదికన) పాముకాటు కు మందులు అందుబాటులో ఉంచాలి. నకిలీ ఎరువులు, న కిలీ విత్తనాలు అనే మాటే వినపడొద్దు. అలాంటి వారి మీ ద కఠిన చర్యలు తీసుకోండి’ ఈ నెల 4న గజ్వేల్ పట్టణంలో జ రిగిన నియోజకవర్గ అభివృద్ధి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా అధికారులకు చేసిన సూచనలివి.
నాణేనికి ఒక వైపు...
రోజులు గడిచి పోతున్నాయి... అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. గజ్వేల్ చుట్టే చక్కర్లు కొట్టి వస్తున్నారు. ఒక్కరు... ఇద్దరు అధికారులు కాదు.. అటెండర్ నుంచి కలెక్టర్ వరకు, కానిస్టేబుల్ నుంచి ఎస్పీ దాకా 60 శాఖల అధిపతులది అదే పని. పొద్దున లేస్తే సారొళ్లంతా చెరువులో చేపలు ఎదురెక్కినట్టే గజ్వేల్ నియోజకవర్గం మండలాల్లో తిరుగుతూ కనిపించారు. ప్రజా సేవ చేస్తామంటూ పోటీ పడ్డారు. దీంతో జిల్లా జనమంతా అదృష్టమంటే గజ్వేల్ నియోజకవర్గం ప్రజలదే అనుకున్నారు. అభివృద్ధి ‘వార్ మోడ్’లో జరిగిపోతోందని భావించారు.
నాణేనికి రెండవ వైపు....
అధికారులు ఇంత వరకు సమీక్షలు, సమావేశాలతోనే కాలయాపన చేశారు. కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినా గజ్వేల్ పట్టణంలో కనీసం పిచ్చిమొక్కలను కూడా తొలగించలేదు. గజ్వేల్ పట్టణం హైదరాబాద్‌కు దగ్గర్లో ఉంటుంది కాబట్టి అధికారులు సమీక్షల పేరుతో ఇటు వైపునకు టూర్లు వేసుకుంటున్నారు. పనిలో పనిగా కిందిస్థాయి సిబ్బంది మీద చిందులు వేసి తాపీగా ఇళ్లకు వెళ్తున్నారు.
అంతా హడావుడి
అధికారులంతా గజ్వేల్ చుట్టే చక్కర్లు కొడుతున్నా... చేసిందేమీ లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అభివృద్ధి పనులు కూడా ముందుకు సాగడం లేదని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకు ‘సాక్షి’ విలేకరుల బృందం బుధవారం గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాల్లో మూడేసి గ్రామాల చొప్పున పర్యటించింది. ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యత ఇచ్చిన పారిశుద్ధ్య నిర్వాహణ తీరుపై పరిశీలన చేయగా, అధికారుల్లో చిత్తశుద్ధి కనిపించలేదు. ఈనెల 12 నుంచి 19 వరకు గ్రామాల్లో చేపట్టిన పారిశుద్ధ్య వారోత్సవాలు కూడా మొక్కుబడిగానే ముగిసినట్లు తేలింది. ‘సాక్షి’ పరిశీలనలో తేలిన మరిన్ని వాస్తవాలు ఇలా ఉన్నాయి
పారిశుద్ధ్యం పాత పాటే....
గజ్వేల్ నగర పంచాయతీలో పారిశుద్ధ్యలోపం తాండవిస్తోంది. పట్టణంలోని 20 వార్డుల్లోనూ పారిశుద్ధ్య లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ప్రదానంగా బీడీ కాలనీ, రాజిరెడ్డిపల్లి, లక్ష్మీప్రసన్ననగర్ కాలనీలు, ప్రజ్ఞాపూర్, క్యాసారం గ్రామాల్లో ఇళ్ల మధ్యన మురుగు నిలిచిపోయింది.
తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామంలోని బుడగ జంగాల కాలనీ దుర్గంధంతో అల్లాడుతోంది. ఈ కాలనీలో మురుగు తీసే వారే కరువయ్యారు. అదేవిధంగా గ్రామ ప్రధాన రహదారి ఇరుపక్కల ఉన్న డ్రైనేజీల్లో మురుగు నిండిపోయింది. ఇక్కడ పిచ్చిమొక్కల తొలగింపు కూడా జరగలేదు.
కొండపాక మండలం ఖమ్మంపల్లి గ్రామంలో మోరీలు తీయలేదు. ఫలితంగా దుర్గంధం వెదజల్లుతోంది. మినీ ట్యాంకులను సైతం శుభ్రం చేయడంలేదు.
వర్గల్ మండలం నాచారం, మజీద్‌పల్లి గ్రామాల్లో మురుగు తొలగింపు సక్రమంగా సాగలేదు. ఫలితంగా మోరీలు మురుగుతో కూరుకుపోయాయి.
ములుగు మండలం అడవిమజీద్ గ్రామంలో పిచ్చిమొక్కల తొలగింపు కార్యక్రమం జరగలేదు. గ్రామంలోని వీధుల్లో పిచ్చిమొక్కలు దర్శనమిచ్చాయి.
జగదేవ్‌పూర్ మండలం వర్దరాజ్‌పూర్, చాట్లపల్లి, చేబర్తి, రాయవరం, పీటీ వెంకటాపూర్, ఇటిక్యాల గ్రామాల్లో స్పెషల్‌డ్రైవ్ కార్యక్రమం సక్రమంగా సాగలేదు.
పాటు కాటుకు మందే లేదు
వైద్యం అందక ఏ ఒక్కరు కూడా మరణించాడానికి వీలులేదని ముఖ్యమంత్రి ఆదేశించిన సరిగ్గా వారంరోజులకే నియోజకవర్గంలోని వర్గల్ మండలం జబ్బాపూర్ గ్రామంలో తొమ్మిదేళ్ల బాలుడు గొలుసు అనిల్ పాముకాటుతో మరణించారు. ఇంట్లో నిద్రిస్తున్న బాలున్ని రాత్రివేళలో పాము కరిచింది. వర్గల్ ఆస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యులు నగరంలోని గాంధీ ఆస్పత్రికి పంపించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మరణించారు. నియోజకవర్గంలోని ఆస్పత్రుల్లో వాస్తవ పరిస్థితిని చూస్తే ఏ ఒక్క చోట కూడా పాముకాటు మందు సరిగ్గా అందుబాటులో లేదు. జగదేవ్‌పూర్‌లో కేవలం ఒక డోస్, తీగుల్ పీహెచ్‌సీలో రెండు డోసులు, వర్గల్, ములుగు, సింగన్న గూడలో కేవలం రెండే రెండు డోసుల పాముకాటు మందు ఉంది. అయితే ఉన్న మందును సైతం బాధితులకు అందించేందుకు వైద్యులు అందుబాటులో లేరు. నియోజవర్గంలో 22 ఏఎన్‌ఎం పోస్టులు, మహిళా ఆరోగ్య సహాయకురాలు పోస్టులు 20, ఆరోగ్య సహాయకురాలు పోస్టులు 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
గజ్వేల్ ఆస్పత్రిని ఏరియా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేస్తూ రెండున్నర ఏళ్ల కిందటే జీవో విడుదలైంది. కానీ ఇప్పటి వరకు దాని అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం ఇప్పుడైనా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్తే ప్రజలకు ప్రభుత్వం వైద్యం అందుబాటులోకి వస్తుంది. ఈనెల 6న ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్ పద్మ నియోజకవర్గంలో తనిఖీలు చేసినా, సామాన్యులకు ఏ మాత్రం ప్రయోజనం లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, మందులు అందుబాటులో లేకపోవడంతో రోగులు అప్పులు చేసి ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు.
బీటీ విత్తనాల అక్రమ దందా ఇక్కడే
బీటీ పత్తి విత్తనాల అక్రమ దందాకు గజ్వేల్ అడ్డాగా మారింది. ఇక్కడి నకిలీ విత్తనాలు ముఠాలు పని చేస్తాయి. విషయం ముందే తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బీటీ పత్తి విత్తనాలు, ఎరువుల పంపిణీలో బ్లాక్ మార్కెట్‌ను సహించేదిలేదని ఈనెల 4న గజ్వేల్‌లో నిర్వహించిన సమీక్షలో స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ మేరకు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ శరత్ ఈనెల 13న గజ్వేల్‌లోని సత్య ఫంక్షన్‌హాలులో సమీక్ష నిర్వహించి వ్యాపారులకు హెచ్చరికలు కూడా చేశారు. అంతకు ముందు వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్ హుక్యానాయక్‌తోపాటు పలువురు అధికారులు సైతం తనిఖీలు నిర్వహించి హెచ్చరికలు చేశారు.
అయినా కూడా బీటీ విత్తనాలు అక్రమంగా విక్రయిస్తున్న ముఠా ఈనెల 18న గజ్వేల్‌లో బయట పడింది. రూ.500కు మాత్రమే విక్రయించాల్సిన హైబ్రీడ్ బీటీ విత్తన ప్యాకెట్‌ను బీజీ-2గా చలామణి చేస్తూ రూ. 1000కి, 125 గ్రాముల కందుల మిశ్రమంతో ఉన్న బీజీ ప్యాకెట్‌ను రూ. 862కు విక్రయించాల్సి ఉండగా రూ. 930 విక్రయిస్తున్నారు. రైతులు సమాచారం అందించే వరకు అధికారులు ఈ మోసాన్ని పసిగట్టలేకపోయారు. రైతు సమాచారంతో తనిఖీలు చేయగా ఈ వ్యాపారం వెలుగు చూసింది.
రైతు ఆత్మహత్యలూ ఎక్కువే
ముఖ్యమంత్రి బ్యాంకర్లతో సమావేశమైన తర్వాత జిల్లాలో దాదాపు 9 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీటిలో గజ్వేల్ నియోజకవర్గంలోనే ముగ్గురు రైతులు అప్పుల బాధతో బలవన్మరణం చెందారు. ఈనెల 14 గజ్వేల్ నగర పంచాయితీ పరిధిలోని ముట్రాజ్‌పల్లిలో చీర్ల యాదయ్య, ఈనెల 17న జగదేవ్‌పూర్ మండలం రాయవరం గ్రామంలో బీనమైన ముత్యాలు అనే రైతులు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. గజ్వేల్ మండలంలోని కొడకండ్ల గ్రామంలో ఫిరంగి ఎల్లయ్య అప్పుల బాధతో ఉరి వేసుకొని చనిపోయారు.
నియోజవర్గంలో పరుగులు తీస్తున్న అధికారులు ఏ ఒక్కరైతుకు ధైర్యం ఇవ్వలేకపోవడంతోనే ఈ దారుణాలన్నీ జరిగాయి. సాగు విధానం, సస్యరక్షణ పద్ధతులపై కూడా అధికారులు రైతులకు సూచనలి సలహాలివ్వడం లేదు. ‘‘ముఖ్యమంత్రి చెప్పారు కదా.. అని కారులో కూర్చొని కాలు కిందపెట్టకుండా తిరిగితే ప్రయోజనం ఏమీ ఉండదని, అధికారులు చిత్తశుద్ధితో సేవ చేసినప్పుడే ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందుతాయి’ అని గజ్వేల్‌వాసులు అంటున్నారు.