- ‘టెంపుల్ ప్రొటెక్షన్ మూవ్‌మెంట్’ కన్వీనర్ సౌందరరాజన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానాలతోపాటు ఏపీలోని ఇతర దేవాలయాల నుంచి దేవాదాయ శాఖకు రావాల్సిన రూ.వెయ్యి కోట్ల బకాయిలను వసూలు చేయాలని ‘టెంపుల్ ప్రొటెక్షన్ మూవ్‌మెంట్’ కన్వీనర్ సౌందరరాజన్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఆయన మంత్రి హరీశ్‌రావును కలసి ఈ అంశాన్ని వివరించారు.
మంత్రి సూచన మేరకు ప్రభుత్వ సలహాదారు రమణాచారిని కలసి వినతిపత్రాన్ని అందజేశారు. దేవాదాయ నిర్వహణ నిధి (ఈఏపీ), సర్వశ్రేయోనిధి (సీజీఎఫ్) తదితరాలు కలిపి ఉమ్మడి రాష్ట్రంలో టీటీడీతోపాటు ఏపీలో దేవాలయాలు రూ.2,500 కోట్లకుపైగా బకాయి పడ్డాయని, జనాభా నిష్పత్తి ప్రకారం తెలంగాణకు అందులో రూ.వెయ్యి కోట్లు రావాల్సి ఉందన్నారు.