కామారెడ్డి: మహిళా, శిశు సంక్షేమ శాఖ ద్వారా క్షేత్రస్థాయిలో ఎన్నో విధులు నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు మరోమారు పో రుబాట పట్టారు. ఎన్నికల సమయంలో అంగన్‌వాడీ కార ్యకర్తలకు తగిన న్యాయం చేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలుపుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో 2,708 అంగన్‌వాడీ కేంద్రాలుండగా వాటిలో దాదాపు ఐదు వేల మంది కార్యకర్తలు, ఆయా లు పని చేస్తున్నారు. ఎన్నో యేళ్లుగా నామమాత్రపు వేతనాలతో పనిచేస్తున్న అంగన్‌వాడీలు గత తెలంగాణ రాష్ట్రం
ఫిబ్రవరి నెలలో సమ్మెకు దిగారు. ఎన్నో రకాల ఉద్యమాలు నిర్వహించారు.
అప్పుడే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడం తో అంగన్‌వాడీలు సమ్మెను విరమించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, ఎన్నికల ప్రక్రి య పూర్తయి ప్రభుత్వం నెలరోజుల పాలన కూడా పూర్తవడంతో అంగన్‌వాడీలు తిరిగి ఆందోళనబాట పట్టారు. ఇటీవల ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఆందోళన చేసినవారు, సో మవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించారు.
ఈ నెల పదిన అం గన్‌వాడీలతో చర్చిస్తామని జిల్లా అధికారులు పేర్కొన్నప్పటికీ, చాలా సమస్యలు రాష్ట్రస్థాయిలో పరిష్కారం కావలసి ఉన్నాయని కార్యకర్తలు అంటున్నారు. ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీలు రెండు మూడు గంటలు పనిచేసి రోజుకు రూ. వందకు తగ్గకుండా సంపాదిస్తుంటే, రోజంతా పనిచే సే తమకు కనీస వేతనాలు దక్కడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన డిమాండ్లు
కార్యకర్తలకు కనీసం నెలకు రూ. 15,000, ఆయాలకు రూ. 10,000 వేతనం ఇవ్వాలి.
ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించాలి.
ఉద్యోగ విరమణ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులలాగే అన్ని ప్రయోజనాలు అమలు చేయాలి. పింఛన్ ఇవ్వాలి.
సెక్టార్, ప్రాజెక్టు పరిధిలో హాజ రయ్యే సమావేశాలు, ఇతర సమావేశాలకు హాజరైతే టీఏ, డీఏలు చెల్లించాలి.
చాలా అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె ఇళ్లల్లోనే నడుస్తున్నాయి. పెరుగుతున్న ధరలక నుగుణంగా అద్దెలు పెంచాలి. లేదా సొంత భవనాలు నిర్మించి ఇవ్వాలి.
అమృతహస్తం బిల్లులు ఖాతాలలో జమ చేయాలి.
అంగన్‌వాడీల పోరుబాట
Published Wed, Jul 9 2014 3:01 AM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM
Advertisement
Advertisement