‘భక్త రామదాస’పై ఏపీ తిరకాసు!
⇒ ప్రాజెక్టు ప్రారంభించి ఆయకట్టుకు నీళ్లిచ్చాక కొత్త ప్రాజెక్టంటూ బోర్డుకు ఫిర్యాదు
⇒ ఎలాంటి అనుమతుల్లేకుండా చేపట్టారని, దాని నిర్వహణను అడ్డుకోవాలంటూ గగ్గోలు
⇒ ఏపీ ఫిర్యాదుతో వెంటనే కదిలిన కృష్ణా బోర్డు
⇒ డీపీఆర్ ఇవ్వాలని రాష్ట్రానికి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాలను విని యోగిస్తూ రాష్ట్రం చేపట్టిన భక్తరామదాస పథ కంపై ఆంధ్రప్రదేశ్ పేచీ పెడుతోంది. 2 నెలల కిందటే ప్రాజెక్టును ఆరంభించి, ఆయకట్టుకు నీళ్లిస్తున్న తరుణంలో ఇప్పుడు ప్రాజెక్టు అనుమ తుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. కృష్ణా, గోదావ రి నదీ జలాల విషయంలో ఏపీ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులపై నిలదీస్తున్న తెలంగాణకు కౌంటర్ ఇచ్చే క్రమంలో మాత్రమే హడావుడిగా ఈ అంశా న్ని లేవనెత్తి ఆ రాష్ట్రం, కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్వహణను అడ్డుకోవాలని విన్నవించింది. దీనిపై వెంటనే స్పందించిన బోర్డు సైతం తెలంగాణ నుంచి వివరణ కోరింది.
కౌంటర్ ఇచ్చేందుకే..
గోదావరి నదిపై పురుషోత్తపట్నం, కృష్ణాపై శివభాష్యం సాగర్, మున్నేరు బ్యారేజీల నిర్మాణాలకు తెలంగాణ అభ్యంతరాలు లేవనెత్తిన విషయం తెలిసిందే. దీనిపై బోర్డులకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో తెలంగాణకు కౌంటర్ ఇచ్చేందుకు ఏపీ భక్త రామదాస అంశాన్ని లేవనెత్తింది. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారా ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో సాగు నీటి పరిధిలోకి రాని ప్రాంతాలకు సాగు నీటిని అందించేందుకు భక్త రామదాస ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. పాలేరు రిజర్వా యర్ నుంచి 5.5 టీఎంసీల నీటిని ఎత్తిపోసి, దీని ద్వారా 58,958 ఎకరాలకు నీరందించాలని నిర్ణయించారు.
పనులను పూర్తిచేసి ఈ ఏడాది జనవరిలో జాతికి అంకితం చేశారు. ఈ సమయంలో ఇది కొత్త ప్రాజెక్టని, ఎలాంటి అనుమతులు లేవంటూ బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. ‘విభజన చట్టం సెక్షన్ 84(3) ప్రకారం కొత్త ప్రాజెక్టు చేపడితే దానికి సంబం« దిత బోర్డులు, కేంద్ర జల సంఘం నుంచి అను మతులు కచ్చితంగా తీసుకో వాలి. ఇక సెక్షన్ 85(డి) ప్రకారం నదీ జలాల వినియోగానికి సంబంధించి ఆయా ట్రిబ్యునళ్లు కేటాయించిన నీటి వాటాకు మించి వాడకం లేద ని తేలాకే కొత్త ప్రాజెక్టుల అంశాన్ని పరిగణ నలోకి తీసుకోవాలి. ప్రస్తుతం కృష్ణా జలాల పునఃకేటాయింపులకు సంబంధించి వివాదం ఇంకా ట్రిబ్యునల్ పరిధిలో ఉంది.
వీటన్నింటినీ పక్కన పెట్టి తెలంగాణ సీడబ్ల్యూసీ, బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపడుతోంది’అని ఏపీ ప్రభుత్వం బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఇక పాలేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారానే వాటర్ గ్రిడ్ కోసం 3.65 టీఎంసీలు తీసుకుంటోందని బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. ఇప్పటికే సాగర్ ఎడమ కాల్వ కింద ఏపీ ప్రాంతంలోని ఆయకట్టుకు నీరందడం లేదని, తెలంగాణ ఇలా వినియోగం చేస్తూ పోతే తమకు తీవ్ర నష్టమని తెలిపింది.
నివేదిక ఇవ్వాలన్న బోర్డు..
ఏపీ ఫిర్యాదుపై కృష్ణా బోర్డు వెంటనే స్పందిం చింది. భక్త రామదాస ప్రాజెక్టుకు సంబంధిం చిన ప్రాజెక్టు సమగ్ర నివేదికను తమకు వీలైనంత త్వ రగా సమర్పించాలని సూచిస్తూ బోర్డు సభ్య కా ర్యదర్శి సమీర్ చటర్జీ నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌కి గురువారం లేఖ రాశారు.