‘స్వగృహ’కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | Apply online for 'Self-promotion' | Sakshi
Sakshi News home page

‘స్వగృహ’కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

Published Fri, Aug 4 2017 12:12 AM | Last Updated on Mon, Sep 11 2017 11:11 PM

Apply online for 'Self-promotion'

సాక్షి, హైదరాబాద్‌: రాజీవ్‌ స్వగృహ ఇళ్లను ప్రభుత్వం నిర్ధారించిన రాయితీ ధరలకు కొనుగోలు చేసుకోవాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్‌ బండ్లగూడలో గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్న ఇళ్లకు చదరపు అడుగుకు రూ.1,900, కొంత అసంపూర్తిగా ఉన్న వాటికి రూ.1,700,  పోచారం వెంచర్‌లో రూ.1,700, రూ.1,500లుగా ధర నిర్ణయించినట్టు వెల్లడించారు. బండ్లగూడలో 2,245 ఇళ్లకుగాను 316 ఇళ్లు, పోచారంలో 1,474 ఇళ్లకుగాను 969 ఇళ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. స్వగృహ అప్పుల్లో తెలంగాణ వాటా రూ.వేయి కోట్లకుపైగా ఉండేదని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక రూ.820 కోట్లు తీర్చిందని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement