సాక్షి, హైదరాబాద్: ఈ నెల 24వ తేదీన హైదరాబాద్‌లోని గోల్కొండ ఆర్టిలరీ సెంటర్‌లో సైనిక నియామక ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆర్మీ పీఆర్వో మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోల్జర్స్ స్పోర్ట్స్‌మన్, సోల్జర్ మ్యూజీషియన్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు నేరుగా ఈ నియామక ప్రక్రియలోని పరీక్షలకు హాజరుకావచ్చని పేర్కొన్నారు.
స్పోర్ట్స్‌మన్ కేటగిరీ కోసం అభ్యర్థులు 23 జనవరి 1994 - 23 జూలై 1997 మధ్య జన్మించి ఉండాలని, మ్యూజీషియన్ పోస్టుల కోసం 23 జనవరి 1992- 23 జూలై 1997 మధ్య జన్మించినవారు అర్హులని తెలిపారు. కనీసం 45 శాతం మార్కులతో పదో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. మాజీ సైనికుద్యోగుల పిల్లలు కూడా అర్హులేనని, వీరికి ఈ నెల 19 నుంచి 29 వరకు ఉద్యోగ నియామకాలు జరుగుతాయని తెలిపారు.
24న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
Published Wed, Jan 14 2015 8:00 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement