సాక్షి, హైదరాబాద్: మక్కా మసీదు పేలుళ్ల కేసులో నిందితులు భరత్ మోహన్‌లాల్ రితేశ్వర్ అలియాస్ భరత్ భాయ్, స్వామి అశిమానందలకు నాంపల్లి కోర్టు గురువారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల చొప్పున 2 పూచీకత్తు బాండ్లు సమర్పించడంతోపాటు హైదరాబాద్ వదిలి వెళ్లరాదని షరతు విధించింది. 2007 మే 18న మక్కా మసీదులో జరిగిన పేలుళ్లలో 9 మంది చనిపోగా, 70 మంది గాయపడ్డారు.
ఈ పేలుళ్ల సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు చనిపోయారు. ఈ కేసులో నిందితులుగా దేవేందర్ గుప్తా, లోకేశ్ శర్మ, స్వామి అశిమానంద, భరత్ భాయ్, రాజేందర్ చౌదరి, సందీప్ వీ డాంగే, రామచందర్ కల్సంగ్రా, సునీల్ జ్యోషిలు ఉన్నారు. ఇందులో అశిమానంద, భరత్ భాయ్‌లు కొన్ని నెలలుగా చర్లపల్లి జైలులో ఉండగా, లోకేశ్ శర్మ, రాజేందర్ చౌదరిలు అంబాలా జైలులో ఉన్నారు.
అజ్మీర్‌లో జరిగిన పేలుళ్ల కేసులో దేవందర్ గుప్తాకు అక్కడి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఇదే కేసులో మరో నిందితుడు సునీల్ జ్యోషిని 2007లో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేయగా, మరో ఇద్దరు నిందితులు సందీప్ వీ డాంగే, రామచందర్ కల్సంగ్రాలు పరారీలో ఉన్నారు.
మక్కా పేలుళ్ల నిందితులకు బెయిల్
Published Fri, Mar 24 2017 12:17 AM | Last Updated on Fri, Oct 19 2018 7:52 PM
Advertisement