ఉట్నూర్(ఖానాపూర్): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం హీరాపూర్ సమీపంలో జైనూర్ మండలం పానపటా ర్‌కు చెందిన ఆదివాసీ గిరిజనులు సుదర్శన్, ఆమృత్‌రావ్‌లపై ఆదివారం ఐదుగురు వ్యక్తు లు దాడి చేశారు. దీంతో సుదర్శన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరికీ ఉట్నూర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. సడికే సుదర్శన్, సిడాం అమృత్‌రావులకు ప్రేం, వినోద్, శ్రీను, సుధాకర్, ప్రభాత్ అనే వ్యక్తులతో వాగ్వాదం చోటు చేసుకుంది. అమృత్‌రావు, సుదర్శన్‌లు జైనూర్ వైపు వెళ్తుండగా, వారిని వెంబడించి హీరాపూర్ సమీపంలో దాడికి పాల్పడ్డారు. సుదర్శన్ ఫిర్యాదుతో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఉట్నూర్ డీఎస్పీ గణపత్ జాదవ్ తెలిపారు. ఈ దాడికి నిరసనగా సోమవారం ఆదివాసీలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. డీఎస్పీకి, ఐటీడీఏ ఏపీవో జనరల్ కుమ్ర నాగోరావుకు వినతిపత్రం ఇచ్చారు. ఘటనపై తగిన చర్యలు తీసుకుంటామని ఎస్సై సాయన్న, సీఐ సతీశ్‌లు హామీనివ్వడంతో ఆందోళన విరమించారు. ఈ దాడికి నిరసనగా మంగళ వారం ఆదివాసీ సంఘాలు ఉమ్మడి జిల్లా బంద్‌కు పిలుపు నిచ్చాయి.
‘భద్రాద్రి’లో భారీ ధర్నా
కొత్తగూడెం అర్బన్: లంబాడీలను ఎస్టీ జాబి తా నుంచి తొలగించాలన్న డిమాండ్‌తో ఆదివాసీ నిరుద్యోగ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో కలెక్టరేట్‌ను ముట్టడించింది. ఆదివాసీలు, మహిళలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతుకు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు నాగేశ్వరరావు, సిద్దం కిశోర్, ఆదివాసీ నిరుద్యోగ ఐక్యాచరణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తిప్పాపురం, గోరుకొండ ప్రభుత్వ పాథమిక పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న లంబాడా తెగకు చెందిన నలుగురు ఉపాధ్యాయులను సోమవారం ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. దీనిపై టీచర్లు ఎంఈఓ జుంకీలాల్‌కు ఫిర్యాదు చేశారు.
వార్డు సభ్యుల మూకుమ్మడి రాజీనామా
ఆదిలాబాద్ రూరల్: లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్న డిమాండ్‌తో ఆదిలాబాద్ రూరల్ మండలం చించుఘాట్‌కి చెందిన వార్డు సభ్యులంతా మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఉప సర్పంచ్ పేందోర్ సునీతా, వార్డు సభ్యు లు ఆత్రం కవిత, ఆత్రం పూర్ణ బాయి, పెందోర్ కైలాస్, మర్సుకోల లక్ష్మీబాయి, ఆత్రం గంగారాం, ఆడా ముత్యా లు, మర్సుకోల సురేశ్, నైతం లింగన్న, ఉయిక జంగుబాయిలు రాజీనామా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment