పాలమూరు మహిళపై హత్యాచారం | attempted rape on Woman Palamuru | Sakshi
Sakshi News home page

పాలమూరు మహిళపై హత్యాచారం

Published Tue, Feb 17 2015 3:28 AM | Last Updated on Sat, Sep 2 2017 9:26 PM

attempted rape on Woman Palamuru

 విద్యానగర్(గుంటూరు జిల్లా):  గుర్తు తెలియని మహిళను రెండు రోజుల క్రితం గుంటూరు జిల్లా నల్లపాడు రైల్వేస్టేషన్ పరిధిలో ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి కిరాతకంగా అత్యాచారం చేసి అనంతరం హత్యచేసిన విషయం తెలిసిందే. పోలీసులు దర్యాప్తు చేసి ఎట్టకేలకు మృతురాలి ఆచూకీని సోమవార ం తెలుసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్ జిల్లా ఖానాపూర్ గ్రామానికి చెందిన  షేక్‌నూరి(35) భర్త సలీం మృతిచెందడంతో కూలీనాలి చేసుకుని జీవించేది. ఈ క్రమంలో ఈనెల 12న నూరి తన మూగ చెవిటి వికలాంగురాలైన  పదేళ్ల కుమార్తెను తీసుకుని మహబూబ్‌నగర్‌నుంచి గుంటూరుకు వెళుతుండగా మార్గమధ్యంలో నల్లపాడు రైల్వేస్టేషన్‌లో తడబాటుపడి రైలు దిగారు.
 
 అనంతరం నూర్ స్టేషన్‌నుంచి బయటకు రాగా ఆమె కుమార్తె తల్లి కనిపించకపోవడంతో తనతోపాటు తీసుకొచ్చిన రెండు బట్టల బ్యాగులు తీసుకుని రెలైక్కి గుంటూరుకు చేరుకుంది. గుంటూరు రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న చిన్నారిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని ఆమె బ్యాగులను పరిశీలించగా అందులో బంధువుల ఫోన్ నంబర్లు ఉండటంతో పోలీసులు వారికి ఫోన్ చేసి ఆ చిన్నారిని బంధువులకు అప్పగించారు. చిన్నారితో బంధువులు మాట్లాడి విషయాన్ని తెలుసుకుని తనతోపాటుగా వచ్చిన నూర్ ఎక్కడని ప్రశ్నించగా మార్గంలో జరిగిన సంఘటన వివరించింది. దీంతో పత్రికల్లో వచ్చిన వార్తలను గమనించి మృతురాలు నూర్‌గా బంధువులు గుర్తించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement