attempted rape
-
జైనూరులో ఉద్రిక్తత
సాక్షి, ఆసిఫాబాద్/సాక్షి, హైదరాబాద్: గత ఆదివారం ఓ మహిళపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం చేయడంతో పాటు హత్యకు ప్రయతి్నంచిన ఘటన మంగళవారం వెలుగులోకి రావడం, బాధిత వర్గం పెద్దయెత్తున ఆందోళనకు దిగడంతో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులు బుధవారం ఉదయం నిందితుడి ఇళ్లు, ఆటోను తగలబెట్టడంతో మొదలైన విధ్వంసం సాయంత్రం వరకూ కొనసాగింది. పట్టణంలో బంద్‌కు పిలుపునిచ్చిన బాధిత వర్గం మరో వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది. వారికి చెందిన రెండు ప్రార్థనా మందిరాల్లో ఫర్నిచర్ కొందరు ధ్వంసం చేశారు. నాయకులపై దాడి చేయడమే కాకుండా వారి ఇళ్లపై రాళ్ల వర్షం కురిపించారు. ఇళ్లల్లోకి చొరబడి సామాగ్రి పగులగొట్టారు. కార్లు, మాక్సీ క్యాబ్‌లు, బైక్‌లను ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. 100కు పైగా దుకాణాలను తగులబెట్టారు. నిందితుడికి చెందిన వర్గం జైనూరు వదిలి మైదాన ప్రాంతానికి తరలి పోవాలని డిమాండ్ చేశారు. వేలాది మంది బాధిత వర్గం వారు పట్టణంలోకి చేరుకుని ఒక్కసారిగా విధ్వంసానికి పాల్పడడం, ఇంకోవైపు మరోవర్గం కూడా కొన్నిచోట్ల దాడులకు దిగడంతో వారిని నిలువరించడం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. కాగా జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు నేతృత్వంలో బాధిత వర్గాన్ని శాంతింప జేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇరువర్గాల వారు సంయమనం పాటించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఒక ప్రకటనలో కోరారు. బాధితురాలికి మంత్రి సీతక్క పరామర్శ గాంధీ ఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జైనూరు బాధితురాలిని మంత్రి సీతక్క పరామర్శించారు. మరింత మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. స్థానిక యువత సంయమనం పాటించాలని కోరారు. కాగా కాలేయ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్న ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం షాపెల్లి గ్రామానికి చెందిన ముద్రబోయిన రఘును కూడా మంత్రి పరామర్శించారు.1,000 మంది పోలీసులు, ఆర్ఏఎఫ్తో బందోబస్తు: డీజీపీజైనూరులో జిల్లా యంత్రాంగం కర్ఫ్యూ, 144 సెక్షన్ విధించిందని డీజీపీ జితేందర్ తెలిపారు. మహిళపై అత్యాచారయత్నం, హత్యాయత్నం ఘటనతో జైనూరులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినట్లు బుధవారం ఒక ప్రకటనలో ఆయన వెల్లడించారు. దాడులు, ప్రతిదాడులతో పరిస్థితి చేయి దాటుతుండడంతో ఆదిలాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, జగిత్యాల, తెలంగాణ స్పెషల్ పోలీసు ప్లాటూన్స్ కలిసి మొత్తం 1,000 మంది పోలీసులను, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను రంగంలోకి దింపినట్లు తెలిపారు. జైనూరులో పరిస్థితిని తనతో పాటు అదనపు డీజీ (శాంతిభద్రతలు), నార్త్ జోన్ ఐజీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్నెట్పై నిషేధం విధించామన్నారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు డీజీపీ వెల్లడించారు. -
ఆఫ్ ద ఫీల్డ్...
రేప్ ప్రయత్నం... బాక్సర్ అరెస్ట్ ఒలింపిక్ క్రీడా గ్రామంలో వారం రోజుల లోపే మరో బాక్సర్ అత్యాచార ఆరోపణలతో అరెస్టయ్యాడు. ప్రారంభోత్సవానికి రెండు రోజుల ముందు మొరాకో బాక్సర్ హసన్ పోలీసులకు చిక్కగా... ఈ సారి నమీబియా ఆటగాడు జొనాస్ జూనియాస్ (22) వంతు. క్రీడా గ్రామంలో ఒక మహిళను బలవంతంగా ముద్దు పెట్టుకున్న అతను... సెక్స్‌కు అంగీకరిస్తే డబ్బు ఇస్తానని కూడా ఆశ పెట్టాడు. జొనాస్‌ను ఇప్పటికే అరెస్ట్ చేసి జైల్లో పెట్టామని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ధారించారు. గురువారం అతను తన తొలి మ్యాచ్ బరిలోకి దిగాల్సి ఉంది. 2014 గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో రజతం సాధించిన బాక్సర్ జొనాస్, రియో ఒలింపిక్స్‌లో ఆ దేశపు పతాకధారి కావడం విశేషం. ఆనందంలో విషాదం.. ఒలింపిక్స్‌లో పతకం సాధించడమంటే ఆషామాషీ కాదు.. అలాంటి ఘనతను తన మనవడు సాధించేసరికి ఆ 84 ఏళ్ల బామ్మ ఆనందం తట్టుకోలేకపోయింది. అయితే ఆ అంతులేని ఆనందమే చివరికి ఆమె ప్రాణాలు కోల్పోయేలా చేసింది. థాయ్‌లాండ్‌కు చెందిన 20 ఏళ్ల వెయిట్‌లిఫ్టర్ సిన్ఫెట్ కృయతోంగ్ 56 కేజీ విభాగంలో కాంస్యం సాధించాడు. ఈ పోటీలను టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించిన సుబిన్ ఖోంగ్తాప్ ఆనందం పట్టలేక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ఆమె గుండెనొప్పితో కన్నుమూసింది. దీంతో ఆ ఊరి ప్రజలు ఒక్కసారిగా విషాదంలో మునిగారు. ఈ పోటీకి ముందు మీడియాతో మాట్లాడిన బామ్మ తన మనవడు దేశానికి పతకం అందిస్తే సంతోషిస్తానని చెప్పింది. ‘నన్ను కావాలనే ఓడించారు’ ‘ఐబా నేను గెలవాలని కోరుకోలేదు. అందుకే నన్ను కావాలని ఓడించింది. నా ఒలింపిక్ ఆశలను చిదిమేసింది. ఐబా అంతా అవినీతిమయం’ ఇదీ హోండురస్‌కు చెందిన 19 ఏళ్ల టీనేజ్ బాక్సర్ టియోఫిమో లోపెజ్ ఆక్రోషం. ఆదివారం జరిగిన లైట్‌వెయిట్ 60కేజీ ప్రిలిమినరీ బాక్సింగ్ మ్యాచ్‌లో తను 27-30 తేడాతో ఫ్రాన్స్ ఆటగాడి చేతిలో ఓడాడు. నిజానికి తను అమెరికాలోనే పుట్టి పెరగడమే కాకుండా అక్కడి నుంచే ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ తనకు యూఎస్ఏ జట్టులో చోటు దక్కలేదు. దీంతో తమ సొంత దేశమైన హోండురస్ తరఫున బరిలోకి దిగాడు. తనను కావాలనే ఓడించారని లోపెజ్ ఐబాపై విరుచుకుపడ్డాడు. -
అత్యాచార యత్నం కేసులో టీచర్ అరెస్ట్
వేలూరు: పాఠశాల విద్యార్థినిని కిడ్నాప్ చేసి అత్యాచార ప్రయత్నం చేసిన టీచర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వేలూరు జిల్లా నాట్రంబల్లి తాలుకా నాయన్చెరువు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో అదే గ్రామానికి చెందిన బాలిక పదో తరగతి చదువుతోంది. సోమవారం పదో తరగతి పరీక్షలు ముగియడంతో పరీక్షలకు వెళ్లిన విద్యార్థిని ఇంటికి రాలేదు. అయితే బాలిక తల్లి దండ్రులు గాలించడంతో ఆతూర్ కుప్పం ప్రాంతంలోని అదే పాఠశాల టీచర్ సుధాకర్ ఇంటి సమీపంలో విద్యార్థిని ఉన్నట్లు గుర్తించారు. అనంతరం విద్యార్థిని వద్ద విచారించగా టీచర్ సుధాకర్ కిడ్నాప్ చేసి అత్యాచారయత్నం చేసినట్లు తల్లిదండ్రులకు తెలిపింది. టీచర్ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లారు. మంగళవారం ఉదయం పాఠశాలకు వచ్చిన టీచర్ సుధాకర్‌ను పట్టుకొని గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అనంతరం డీఎస్పీ సుందరం విద్యార్థిని వద్ద జరిపిన విచారణలో టీచర్ విద్యార్థిని కిడ్నాప్ చేసినట్లు తెలిసింది. వెంటనే విద్యాశాఖ సీఈవో భూపతికి సమాచారం అందజేశారు. విచారణ జరిపిన విద్యాశాఖ అధికారులు టీచర్ సుధాకర్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా విషయం తెలుసుకున్న గ్రామస్తులు పాఠశాలను ముట్టడించి ధర్నా నిర్వహించారు. అనంతరం పోలీసులు చర్చలు జరిపి గ్రామస్తుల చేత ధర్నా విరమింపజేశారు. -
పాలమూరు మహిళపై హత్యాచారం
విద్యానగర్(గుంటూరు జిల్లా): గుర్తు తెలియని మహిళను రెండు రోజుల క్రితం గుంటూరు జిల్లా నల్లపాడు రైల్వేస్టేషన్ పరిధిలో ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి కిరాతకంగా అత్యాచారం చేసి అనంతరం హత్యచేసిన విషయం తెలిసిందే. పోలీసులు దర్యాప్తు చేసి ఎట్టకేలకు మృతురాలి ఆచూకీని సోమవార ం తెలుసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్ జిల్లా ఖానాపూర్ గ్రామానికి చెందిన షేక్‌నూరి(35) భర్త సలీం మృతిచెందడంతో కూలీనాలి చేసుకుని జీవించేది. ఈ క్రమంలో ఈనెల 12న నూరి తన మూగ చెవిటి వికలాంగురాలైన పదేళ్ల కుమార్తెను తీసుకుని మహబూబ్‌నగర్‌నుంచి గుంటూరుకు వెళుతుండగా మార్గమధ్యంలో నల్లపాడు రైల్వేస్టేషన్లో తడబాటుపడి రైలు దిగారు. అనంతరం నూర్ స్టేషన్నుంచి బయటకు రాగా ఆమె కుమార్తె తల్లి కనిపించకపోవడంతో తనతోపాటు తీసుకొచ్చిన రెండు బట్టల బ్యాగులు తీసుకుని రెలైక్కి గుంటూరుకు చేరుకుంది. గుంటూరు రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న చిన్నారిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని ఆమె బ్యాగులను పరిశీలించగా అందులో బంధువుల ఫోన్ నంబర్లు ఉండటంతో పోలీసులు వారికి ఫోన్ చేసి ఆ చిన్నారిని బంధువులకు అప్పగించారు. చిన్నారితో బంధువులు మాట్లాడి విషయాన్ని తెలుసుకుని తనతోపాటుగా వచ్చిన నూర్ ఎక్కడని ప్రశ్నించగా మార్గంలో జరిగిన సంఘటన వివరించింది. దీంతో పత్రికల్లో వచ్చిన వార్తలను గమనించి మృతురాలు నూర్‌గా బంధువులు గుర్తించారు. -
మరిది వేధింపులపై హెచ్ఆర్సీని ఆశ్రయించిన వివాహిత
భర్త మద్యం మత్తులో కుటుంబాన్ని పట్టించుకోకపోవడాన్ని అలుసుగా తీసుకున్న మరిది, ఆడపడుచు కుమారుడు తనను లైంగికంగా వేధిస్తున్నారని రంగారెడ్డి జిల్లా పరిగి పట్టణానికి చెందిన వివాహిత అస్రా బేగం గురువారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. వేధింపులపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, తక్షణమే తనను వేధిస్తున్న వారిపై చర్యలకు అదేశించాలని ఆమె విజ్ఞప్తి చేసింది. బాధితురాలి కథనం ప్రకారం.. పదేళ్ల్ల క్రితం అస్రాబేగంను గాజుల బస్తీ నివాసి మహ్మద్ ఖదీర్‌ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండేళ్ల వరకు కాపురం సజావుగానే సాగింది. ఎనిమిదేళ్ల క్రితం మద్యానికి బానిసైన భర్త అస్రాను వేధించసాగాడు. అయినా ఓర్చుకుంది. స్థానికంగా గాజుల షాపు నిర్వహిస్తూ పిల్లలను సాకుతోంది. అస్రాను భర్త పట్టించుకోకపోవడాన్ని అలుసుగా తీసుకుని, మరిది అసద్, ఆడపడుచు కుమారుడు అబ్బు అసభ్యంగా ప్రవర్తించసాగారు. తమతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని వేధిస్తున్నారు. ఇటీవల వాళ్లిద్దరు తన ఇంటికి వచ్చి లైంగిక దాడికి యత్నించినట్లు తెలిపింది. ఈవిషయమై అసద్, అబ్బును తన తమ్ముళ్లు నిలదీయగా వారిపై దాడి చేసినట్లు తెలిపింది. భర్త కూడా లైగింక వేధింపులను తప్పుపట్టకుండా తనపైనే అసత్య ప్రచారం చేస్తూ ఇంటికి రాకుండా తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడని వాపోయింది. అత్త రాజకీయ నాయకురాలవడంతో ఆమె పలుకుబడితో పోలీసులు కేసును పట్టించుకోవడం లేదని కన్నీటిపర్యంతమైంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భర్త, అత్త, కుటుంబీకులు ఏ క్షణమైనా పిల్లలతో ఒంటరిగా ఉంటున్న తనపై దాడి చేసే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. తనను వేధిస్తున్న మరిది, ఆడపడుచు కుమారుడిపై చర్య తీసుకొని తనకు రక్షణ కల్పించాలని వివాహిత మానవ హ క్కుల కమిషన్‌ను వేడుకుంది. నివేదిక అందించాలని ఎస్పీకి ఆదేశం అస్రాబేగంను వేధిస్తున్న విషయమై సమగ్ర విచారణ జరిపి జనవరి 20 తేదిలోపు నివేదిక సమర్పించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ రంగారెడ్డి జిల్లా ఎస్పీని అదేశించారు. బాధితురాలి కుటుంబానికి రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
సోదరిపై అత్యాచారానికి యత్నించిన అన్న అరెస్టు
భోగాపురం, న్యూస్‌లైన్: అన్నంటే రక్షణకు మారుపేరు. కష్టసుఖాల్లో తోడుగా, రక్షణగా ఉంటాడనేందుకు గుర్తుగా ప్రతి సోదరి తన తోడబుట్టినవాడికి రాఖీ కడుతుంది. అటువంటి అన్నే కీచకుడిగా మారాడు. ఉన్మాదయ్యాడు. బావలేని సమయంలో ఇంట్లో ప్రవేశించి చెల్లెలిపై అఘాయిత్యానికి యత్నించాడు. వివరాలు ఇలా ఉన్నాయి. భోగాపురం మండలం గుడివాడకు చెందిన అప్పలరెడ్డి సైన్యంలో పనిచేశాడు. అతనికి మేనమామ కుమార్తెతో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే సెలవుపై ఇంటికి వచ్చినప్పుడు భార్యను వేధిస్తుండేవాడు. దీంతో ఆమె ఫిర్యాదు మేరకు విధుల నుంచి అతన్ని సస్పెండ్ చేయడంతో గుడివాడ చేరుకున్నాడు. విపరీతంగా తాగుతూ నిత్యం వేధిస్తుండడంతో భార్య ఆ ఊరిలోనే ఉన్న తన పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే అప్పల రెడ్డి చెల్లెలు వదినకు అండగా ఉండేది. దీంతో చెల్లెలు, బావపై కూడా అప్పలరెడ్డి కోపం పెంచుకున్నాడు. బావ కేబుల్ కనెక్షన్లు నిర్వహిస్తుంటాడు. బావ,చెల్లెలి మీద కోపంతో నిత్యం ఆ వైర్లను కత్తిరించేవాడు, తన పిల్లలు కనిపిస్తే వారి పట్ల క్రూరంగా ప్రవరించేవాడు. నిత్యం తాగుతూ ఉన్మాదిగా ప్రవర్తించేవాడు. ఊరిలో వారితో గొడవలు పడేవాడు. కుటుంబ కలహాల కారణంగా భార్య తరఫువారు పలుమార్లు పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులు తీవ్రంగా హెచ్చరించడంతో మరింత కోపం పెంచుకున్నాడు. ఇటీవల జరిగిన గొడవలో చెల్లెలి పట్ల అమానుషంగా మాట్లాడాడు. ఏ అన్నా తన సోదరితో అనని విధంగా మాట్లాడాడు. అయితే గ్రామస్తులు కలుగజేసుకోవడంతో అక్కడితో ఆ గొడవ సద్దుమణిగింది. కోపం, ఉన్మాదం కారణంగా చెల్లెలిని శారీరకంగా లొంగదీసుకునేందుకు చాలాసార్లు యత్నించాడు. అయితే ఆమె తన అన్నసంగతిని బయటవారికి చెప్పుకోలేక మనస్తాపానికి గురయ్యేది. ఈనెల 17న రాత్రి ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి తలుపు తట్టాడు. ఆమె తలుపు తీసేసరికి ఇంట్లో చొరబడి అత్యాచారం చేయబోయాడు. దీంతో ఆమె కేకలు వేస్తూ బయటకు పరుగులుతీసింది. ఈ మేరకు బాధితురాలు అన్నపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ కృష్ణ కేసు నమోదుచేసి నిందితుడిని అరెస్టుచేసి శనివారం కోర్టుకు తరలించారు.