
మక్కకు మహర్దశ!
సాగునీటి లభ్యత అంతంతమాత్రంగా ఉన్న సిద్దిపేట ప్రాంత రైతులంతా మక్కసాగుకే మొగ్గుచూపుతారు. అయినప్పటికీ ప్రకృతి ప్రకోపానికి ప్రతిసారీ అన్నదాతలంతా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆటుపోట్లను తట్టుకుని నిలిచే మక్క రకాన్ని కనుక్కుంటే తమకష్టాలన్నీ తీరుతాయని రైతులంతా ఆశపడ్డారు.
వారి ఆశలను నిజం చేస్తూ టీఆర్‌ఎస్ సర్కార్ సిద్దిపేటలో మొక్కజొన్న పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు సిద్ధమైంది. అందులో భాగంగా సిద్దిపేట సమీపంలోని తోర్నాల వద్ద ఏర్పాటు చేయనున్న పరిశోధనా కేంద్రానికి గురువారం శంకుస్థాపన చేసేందుకు వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావుతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు తరలిరానున్నారు.
సిద్దిపేట జోన్: మక్కకు మహర్దశ పట్టనుంది. వాటిపై అధ్యయనం చేసేందుకు పాలకులు శ్రీకారం చుడుతున్నారు. సీడ్ ఆఫ్ బౌల్‌గా తె లంగాణను మార్చనున్నామన్న హామీని నెరవేర్చేం దుకు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకోసం మెతుకు సీమలో ముచ్చటగా తెలంగాణ వ్యాప్తంగా మూడో పరి శోధన కేంద్రానికి వ్యవసాయ శాఖ అంకురార్పణ చేసిం ది. గురువారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా తోర్నాల శివారులో మొక్కజొన్న పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన చేయనున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. పూర్తిగా వ్యవసాయ ఆధారిత జిల్లాగా మారిన మెదక్ జిల్లాలో భూ పరిస్థితులు విభిన్నంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సిద్దిపేట డివిజన్‌లోని 13 మండలాలతో పాటు మెదక్, సంగారెడ్డిలోని కొన్ని మం డలాల రైతులు మక్క పంటను సాగు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ రికార్డుల ప్రకారం జిల్లాలో 1.02 లక్షల హెక్టార్ల మక్క సాధారణ విస్తీర్ణం ఉండగా గత ఖరీఫ్‌లో 1.25 లక్షల హెక్టార్లకు పెరిగింది.
సుమారు 90 వేల మంది మక్కరైతులు జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న పంట సాగు చేస్తున్నట్లు సమాచారం. మేలుర కం వంగడాల ఆవిష్కరణకు సమీపంలోని హైదరాబాద్ జిల్లా రాజేంద్రనగర్ పరిశోధన కేంద్రంపై ఆధారపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న క్రమంలో మెదక్ జిల్లాలో పరిశోధన కేంద్రాల ఏర్పాటుపై గత నెలలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించింది. అందులో భాగంగానే సిద్దిపేట మండలం తోర్నాల శివారులో మక్క పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా చర్యలు చేపట్టి స్థలాన్ని సేకరించింది. గురువారం పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన చేయనుంది. ఇది పూర్తయితే మెదక్ జిల్లాలోని 25 మండలాలతో పాటు కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల రైతులకు లబ్ధిచేకూరనుంది. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా హైబ్రీడ్, స్వీట్ కాన్, పాప్‌కాన్‌లతో పాటు కొత్త వంగడాల రూపకల్పన జరుగనుంది.
నేడు మంత్రిచే శంకుస్థాపన
సిద్దిపేట మండలం తోర్నాల శివారులో రూ. 2 కోట్లతో నిర్మించనున్న మొక్కజొన్న పరిశోధన కేంద్రానికి గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.
సుమారు 28 ఎకరాల స్థలంలో అత్యాధునిక వసతులతో కూడిన పరిశోధన కేంద్ర నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ శరత్‌తో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి భూమి పూజ చేయనున్నారు.