ఆ ఇద్దరూ లంచం తీసుకుంటూ దొరికిపోయారు! | Badangpet commissioner in ACB net | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరూ లంచం తీసుకుంటూ దొరికిపోయారు!

Published Wed, May 13 2015 3:06 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ఆ ఇద్దరూ లంచం తీసుకుంటూ దొరికిపోయారు! - Sakshi

ఆ ఇద్దరూ లంచం తీసుకుంటూ దొరికిపోయారు!

హైదరాబాద్: లంచం తీసుకుంటూ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు దొరికిపోయారు. సరూర్ నగర్ మండలం బడంగ్పేట నగర పంచాయతీపై  ఏసీబీ అధికారులు ఈరోజు దాడి చేశారు. కమిషనర్ త్రిలేశ్వరరావు, సీనియర్ అసిస్టెంట్ నరేష్ ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.72వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఓ సీసీ రోడ్డు నిర్మాణానికి సంబంధించి రూ.23,57,752 బిల్లు మంజూరు కోసం ఎన్.శ్రీనివాసరెడ్డి అనే కాంట్రాక్టర్ నుంచి కమిషనర్, సీనియర్ అసిస్టెంట్ ఇద్దరూ కలిపి 3 శాతం కమిషన్, సుమారు రూ.72వేలు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఇందుకోసం నెలరోజులుగా కాంట్రాక్టర్‌ను కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నట్టు సమాచారం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement