- కుల సంఘాల జేఏసీ వినూత్న నిరసన
- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం
- సీపీఎం ఆధ్వర్యంలో శవయాత్ర
మంకమ్మతోట : పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ.. పోలవరం ఆర్డినెన్స్ బిల్లుకు పార్లమెంట్‌లో ఆమో దం లభించడంపై జిల్లాలో నిరసనలు పెల్లుబికాయి. వివిధ విద్యార్థి సంఘా లు, కుల సంఘాల నాయకులు కేంద్రం వైఖరికి నిరసనగా ర్యాలీలు, ప్రదర్శన లు చేపట్టారు. తెలంగాణ కుల సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్‌లో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను మురుగుకాలువలో తొక్కి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ జీఎస్.ఆనంద్, మార్వాడి సుదర్శన్, గుర్రాల రవీందర్, మహేందర్, కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.
సీపీఎం ఆధ్వర్యంలో కేంద్ర దిష్టిబొమ్మ దహనం
సీపీఎం జిల్లా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్‌లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనంచేశారు. ముందుగా శవయాత్ర నిర్వహించారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా ప్రధాన కా ర్యదర్శి జి.ముకుందరెడ్డి, నాయకులు ఎ రవెల్లి ముత్యంరావు, జి.భీమాసాహెబ్, శేఖర్, తిరుపతి, నాగరాజు పాల్గొన్నారు.
న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో..
కరీంనగర్ : న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్‌లో కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి జూపాక శ్రీనివాస్, న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రం, ఏపీ సీఎం చంద్రబాబు కుట్ర పన్ని ఆదివాసులకు అన్యాయం చేశారని పేర్కొన్నారు. బిల్లును వెనక్కి తీసుకోవాలని, లేకుంటే ప్రజా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు రత్నం రమేశ్, జందం ప్రసాద్, భాస్కర్, కిషన్,సోన్నారి రామయ్య, సుదర్శన్ పాల్గొన్నారు.
బంద్‌కు టీఆర్‌ఎస్, టీపీఎఫ్ మద్దతు
భద్రాచలం డివిజన్‌లోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ పార్లమెంట్‌లో బిల్లును ఆమోదించడం అప్రజాస్వామిక చర్య అని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి పేర్కొన్నా రు. మోడీ సర్కారు మొండిగా వ్యవహరి స్తోందని తెలిపారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడుకు వత్తాసు పలుకుతూ.. ప్రజాస్వామ్యానికి కళంకం తెస్తోందని ఆరోపించారు. టీ జేఏసీ ఇచ్చిన బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. అలాగే బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతుందని తెలంగాణ ప్రజాఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు ఎం.వీరన్నయాదవ్ తెలిపారు. బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని మద్దతు తెలపాలని కోరారు.
‘పోలవరం’ ఆమోదంపై ఆగ్రహం
Published Sat, Jul 12 2014 2:48 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement
Advertisement