‘తంగెడి పువ్వులు తెచ్చేవాడిని’ | bathukamma festivals at nizmabad | Sakshi
Sakshi News home page

‘తంగెడి పువ్వులు తెచ్చేవాడిని’

Published Tue, Sep 30 2014 3:10 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

‘తంగెడి పువ్వులు తెచ్చేవాడిని’ - Sakshi

‘తంగెడి పువ్వులు తెచ్చేవాడిని’

-జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి
నిజామాబాద్ కల్చరల్, ప్రగతినగర్ : తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు పూర్వ వైభవం లభించడం ఆనందంగా ఉందని జిల్లా ఎస్పీ చం ద్రశేఖర్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ మైదానంలో సోమవారం రాత్రి జరిగిన ‘బంగా రు బతుకమ్మ’ సంబురాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన చిన్నతనంలో బతుకమ్మ పండుగ ఎంతో వైభవంగా జరిగేదన్నారు. బతుకమ్మ కోసం తంగడి పువ్వును తెంపుకు వచ్చేవాడినని గుర్తుచేశారు.
 
ఘనంగా నిర్వహిస్తున్నాం : కలెక్టర్
జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలు ప్రతిబించే పండుగైన బతుకమ్మను మహిళలు ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారన్నారు. ఈ పం డుగను వైభ వంగా నిర్వహించేందుకు అధికారి కంగా తమవంతు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement