
సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్రూం ఇళ్ల పథకంలో బీసీలకు 50 శాతం కోటా ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు 50 శాతం వాటా ఇవ్వాలన్నారు.
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు దామాషా ప్రకారం ఇస్తుండగా.. బీసీలకూఅదే నిబంధన వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమించి సాధించుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment