షరతులు లేకుండా భృతి ఇప్పించండి
మంత్రికి బీడీ కార్మికుల వినతి
బీర్కూర్ : బీడీ కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా జీవన భృతి ఇప్పించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి బీడీ కార్మికులు విన్నవించారు. మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి హాజరైన మంత్రి ఎదుట కార్మికులు తమ గోడు వెల్లబోసుకున్నారు. తమకు జీవన భృతి ఇచ్చేందుకు ప్రభుత్వం పలు ఆంక్షలు విధిస్తోందని, దీంతో తాము నష్టపోతున్నామని వాపోయూరు.
తమలో కొంత మందికి పీఎఫ్ నంబర్లు లేవని, దీన్ని ఆసరా చేసుకుని తమకు పింఛన్ రాకుండా అధికారులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసరా పింఛన్లు వస్తున్న కుటుంబంలోని బీడీ కార్మికులకు జీవన భృతి అందించడం లేదన్నారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ అర్హులైన బీడీ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉం టుం దని, ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. పీఎఫ్ నంబర్లు లేని వారికి సైతం పింఛన్లు ఇప్పించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆసరా పింఛన్లు వచ్చే కుటుం బీకులకు కూడా భృతి అందేలా సీఎంతో మాట్లాడుతానన్నారు.
ఎంపీడీవో తీరుపై ఆగ్రహం..
ఆసరా పింఛన్ల కోసం ఆరు నెలలుగా తిరుగుతున్నామని, అయినా పెన్షన్లు ఇవ్వడం లేదని బీర్కూర్‌కు చెంది న సాయవ్వ, భూదెవ్వ అనే వృద్దులు మంత్రికి చెప్పగా ఆయన ఎంపీడీవో మల్లికార్జున్‌రెడ్డిని పిలిచి ప్రశ్నిం చారు. తీరు మార్చుకోకపోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ల కోసం ప్రభుత్వం వేల కోట్లు మంజూరు చేస్తున్నా అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, మరోసారి ఇలాంటి ఫిర్యాదులు వస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆయన వెంట ఎంపీపీ మల్లెల మీనాహన్మంతు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్ ఉన్నారు.