మహబూబ్‌నగర్ వైద్యవిభాగం: జిల్లాలో ప్రభుత్వాసుపత్రులకు వచ్చే పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ టీకే శ్రీదేవి వైద్యాధికారులకు సూచించారు. శుక్రవారం ఆమె జిల్లా ఆస్పత్రిలో వైద్యఆరోగ్య సేవలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తల్లీపిల్లల సంరక్షణ చేపట్టాలని కోరారు. ప్రజారోగ్యంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులు రోగులకు అందుబాటులో ఉండాలని సూచించారు. జిల్లాలోని అన్ని ఏరియాఆస్పత్రుల్లో ఆపరేషన్లు నిర్వహించాలని, అందుకోసం అవసరమైన వైద్యనిపుణులను ఎంపికచేసి విధులు కేటాయించి నట్లు ఆమె తెలిపారు. వైద్యులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, సేవాభావం అలవర్చుకోవాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులను ప్రోత్సహించకూడదని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని వైద్యసేవలు అందిస్తామనే భరోసా కల్పించాలని హితబోధచేశారు.
పల్లెవికాసం కార్యక్రమంలో ప్రత్యేకాధికారులు అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి ఆరోగ్యసమస్యలకు తగిన చికిత్సలు చేయాలన్నారు. అంగన్‌వాడీకేంద్రాల్లో పౌష్టికాహారం సక్రమంగా అందే విధంగా ఆరోగ్యకార్యకర్తలు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పించేందుకు నిధులు కేటాయిస్తామన్నారు. ప్రభుత్వ ఏరియాఆస్పత్రుల్లో పూర్తిస్థాయి ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. వైద్యాధికారులు తమ పరిధిలోని ఆస్పత్రులను తనిఖీలు చేపట్టి సేవలు సక్రమంగా అందేవిధంగా చూడాలన్నారు. ఔట్‌సోర్సింగ్ పద్ధతిన పనిచే స్తున్న సిబ్బందిని కొనసాగించాలని సూచించారు. మిషన్ ఇంధ్రధనుష్‌లో ఏడు రకాల టీకాలను ప్రతి చిన్నారికి విధిగా వేయించాలన్నారు. ఈ ఏడాది 130 పాఠశాలల్లో 36,103మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి వారిలో 1430మందికి దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించామన్నారు.
1194 మంది విద్యార్థులకు కంటిఅద్దాలు అందించినట్లు కలెక్టర్ టీకే శ్రీదేవి వివరించారు. 18ప్రాథమిక పాఠశాలల్లో ఈ మార్చి నాటికి 3043 మంది చిన్నారులకు నేత్రపరీక్షలు నిర్వహించి.. 56మందికి కంటిఅద్దాలు అందించామన్నారు. కలెక్టర్ ప్రత్యేక నవజాత శిశుచికిత్స కేంద్రం, క్యాలీఫర్, ఆర్థోపెడిక్ విభాగాలను పరిశీలించారు. సమావేశంలో ఇన్‌చార్జి డీసీహెచ్‌ఎస్ డాక్టర్ శ్యాముల్, ఏరియా ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు.
పేదలకు మెరుగైన వైద్యసేవలు
Published Sat, Apr 25 2015 1:45 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement