పెబ్బేరు (మహబూబ్‌నగర్) : మహిళ కడుపులో ఉన్న కవలలను గుర్తించకుండా కాన్పు చేసిన వైద్యులు.. పురిట్లోనే ఒక శిశువు కన్నుమూయడానికి కారణమయ్యారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలకేంద్రంలో మంగళవారం సంచలనం రేకెత్తించింది. బాధితుల కథనం మేరకు.. మండలంలోని చెలిమిల్ల గ్రామానికి చెందిన తాటికొండ శంకరమ్మ మంగళవారం తెల్లవారుజామున పెబ్బేరులోని ఓ నర్సింగ్‌హోంలో కాన్పు కోసం వచ్చింది. ఆస్పత్రి వైద్యులు శంకరమ్మకు కాన్పు చేయగా మగ శిశువుకు జన్మనిచ్చింది.
అయితే తల్లి కడుపులో కవలపిల్లలు ఉన్న విషయాన్ని అక్కడి వైద్యులు గుర్తించలేదు. కాన్పు అయ్యాక సుమారు నాలుగు గంటల పాటు ఆమెను ఆస్పత్రిలోనే ఉంచారు. ఆ తర్వాత తల్లికి రక్తం తక్కువగా ఉందని కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి పంపించేశారు. శంకరమ్మను అక్కడికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరో మగశిశువుకు జన్మనిచ్చింది. కర్నూలుకు వెళ్లేలోగా ఆ శిశువు కన్నుమూశాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ చనిపోయాడని తల్లిదండ్రులు, వారి కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
కడుపులో ఉన్న కవలలను గుర్తించలేదు
Published Tue, Jun 9 2015 7:20 PM | Last Updated on Thu, Apr 4 2019 4:44 PM
Advertisement
Advertisement