కేసీఆర్ తీరు అనుమానాస్పదం
హైదరాబాద్: పోలవరం ఆర్డినెన్స్ విషయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు తీరుపై సందేహాలున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను తెలంగాణాలోనే కొనసాగేలా చూడడంలో కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదనిపిస్తోందని చెప్పారు.
1956 నాటి తెలంగాణ కావాలని కేసీఆర్ పదేపదే మాట్లాడటం వల్లే కేంద్ర ప్రభుత్వం భద్రాచలం డివిజన్‌ను ఆంధ్రప్రదేశ్లో కలుపుతోందని మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రధానికి కేసీఆర్ ఇచ్చిన వినతి పత్రంలోనూ, అసెంబ్లీలో గవర్నర్ చేసిన ప్రసంగంలోను పోలవరం ప్రస్తావన లేదని, ప్రభుత్వానికి ఆసక్తి లేదనడానికి ఇదే నిదర్శనమని భట్టి విక్రమార్క ఆరోపించారు.