
సాక్షి, హైదరాబాద్: పంట రుణాలను రీషెడ్యూల్ చేయించుకున్న రైతులకు రుణమాఫీ అమలు కాలేదని బీజేపీ శాసన సభాపక్ష నేత జి.కిషన్‌రెడ్డి అన్నారు. తీవ్రమైన కరువు ప్రకటించిన కారణంగా రైతులు రుణాలను రీషెడ్యూల్ చేయించుకున్నారని, అయితే వారికి రుణమాఫీ జరగలేదని వెల్లడించారు. రుణమాఫీ నోటీసులు వచ్చిన వారికి కూడా ఇప్పటికీ రుణమాఫీ జరగలేదని అన్నారు. రైతులు తీసుకున్న రుణాలకు వడ్డీకి చక్రవడ్డీ కలిపి లక్షా యాబై వేలు కూడా దాటిందని చెప్పారు. రైతులందరికీ రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.