హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ముస్లిం ప్రజలకు రిజర్వేషన్ ఫలాలు అందించేందుకు సిద్ధమవుతుండటంతో ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ముస్లింలు, ఎస్టీలకు సంబంధించిన కీలక రిజర్వేషన్ బిల్లును ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ చర్యను వ్యతిరేకిస్తూ బీజేపీ శ్రేణులు విధ్వంసాలకు దిగుతున్నారు. అఫ్జల్‌గంజ్ బస్టాప్ వద్ద బీజేవైఎం కార్యకర్తలు రెండు ఆర్టీసీ బస్సులపై విరుచుకుపడ్డారు. బైకులపై వచ్చిన కార్యకర్తలు వాటి అద్దాలను ధ్వంసం చేశారు. మరోవైపు రాణిగంజ్‌లోనూ రెండు బస్సుల టైర్ల గాలిని బీజేపీ కార్యకర్తలు తీసేశారు. ముస్లింలకు రిజర్వేషన్ నిర్ణయానికి వ్యతిరేకంగా అసెంబస్లీ గేటు వద్ద ఆందోళన చేసేందుకు ప్రయత్నించిన బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
మరోవైపు అవాంఛనీయ ఘటనలు జరగకుండా పలువురు బీజేపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. బీజేపీ నేతల ముందస్తు అరెస్టులను ఆ పార్టీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి ఖండించారు. ఇది ప్రభుత్వ పిరికి చర్య అని విమర్శించారు. కాగా, అంబేద్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్రగా వచ్చి బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశాలలో పాల్గొననున్నారు.
ముస్లిం రిజర్వేషన్ ప్రకంపనలు: బస్సుల అద్దాలు ధ్వంసం!
Published Sun, Apr 16 2017 9:53 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement