బోనాలకు ఘనంగా ఏర్పాట్లు: తలసాని | Bonala arrangement as a grand scale: talasani | Sakshi
Sakshi News home page

బోనాలకు ఘనంగా ఏర్పాట్లు: తలసాని

Published Sun, Jun 19 2016 3:10 AM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM

బోనాలకు ఘనంగా ఏర్పాట్లు: తలసాని - Sakshi

బోనాలకు ఘనంగా ఏర్పాట్లు: తలసాని

సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలను పెద్ద ఎత్తున నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. శనివారం సచివాలయం లో బోనాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. జూలై 10న గోల్కొండ బోనాలు ప్రారంభమవుతాయని, 24, 25 తేదీల్లో సికింద్రాబాద్‌లో ఈ పండుగ ఉంటుందని మంత్రి చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని పండుగలను ఘనంగా నిర్వహిస్తున్నామని, బోనాలకు ఎన్నడూ లేని విధంగా చిన్న, పెద్ద దేవాలయాలకు నిధులు కేటాయిస్తున్నామన్నారు.

రంజాన్, క్రిస్మస్ పండుగలను సైతం ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. మహంకాళి జాతర ఏర్పాట్లపై ఇప్పటికే అధికారులతో సమావేశం నిర్వహించి భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. భక్తులకు ప్రసాదం, మంచినీటి ప్యాకెట్లు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఉత్సవానికి మీడియా సహకరించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement