
మక్తల్: గొర్రెల కాపరిగా పని చేయాలని తల్లి పంపిస్తే... తాను పనికి వెళ్లను, చదువుకుంటానంటూ ఆ బాలుడు పోలీసులను ఆశ్రయించాడు. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలం రుద్రసముద్రం గ్రామానికి చెందిన వెంకటేశ్, కమలమ్మ దంపతులకు నవీన్‌కుమార్(10) సంతానం.
నవీన్ తండ్రి వెంకటేశ్ గతేడాది మృతి చెందగా.. తల్లి రాయిచూర్‌లో గొర్రెలు కాసే పనికి కుమారుడిని కుదిర్చింది. అక్కడకు వెళ్లాలని ఒత్తిడి చేయగా.. తాను చదువుకుంటానంటూ నవీన్ శనివారం మక్తల్ పోలీసులను అ«శ్రయించారు. దీంతో మక్తల్ సీఐ వెంకట్, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు జిల్లా కేంద్రంలోని చైల్డ్ హోంలో చేర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment