మోర్తాడ్, న్యూస్‌లైన్: ఎన్నికల వేళ మద్యం భారీగా విక్రయించి సొమ్ము చేసుకోవాలనుకుంటున్న మద్యం వ్యాపారుల ఆటలు సాగడం లేదు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు తోడు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న చేపట్టిన చర్యలు మద్యం వ్యాపారులకు ప్రతి బంధకంగా మారాయి.
జిల్లాలోని మద్యం దుకాణాలకు మాక్లూర్‌లోని ఐఎంఎల్ డిపో నుంచి మద్యం సరఫరా చేస్తారు. అయితే మద్యం విక్రయాల్లో పురోగతి ఉన్నా ఎన్నికల కమిషన్ ఆదేశంతో గత సంవత్సరం వ్యాపారులు తీసుకున్న మద్యంలో 10 శాతాన్ని తగ్గించి ఇప్పుడు కొత్త కోటాను అధికారులు నిర్ణయించారు.
గత రికార్డులను పరిశీలించి
మద్యం దుకాణాలలో నిలువ ఎంత ఉన్నా తక్కువ పరిమాణంలోనే విక్రయించాలని కలెక్టర్ నిబంధన విధించారు. గతంలోని అమ్మకాల రికార్డులను పరిశీలించి అంత మేరకే మద్యం విక్రయించాలని ఆదేశించారు. ఎవరైనా మద్యం దుకాణం యజమాని కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల కంటే ఒక్క సీసా ఎక్కువ అమ్మినా ఆ దుకాణాన్ని సీజ్ చేయాలని తనిఖీ బృందాలకు ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లాలో 10 ఎక్సైజ్ సర్కిళ్లు ఉన్నాయి. వీటి పరిధిలో 123 మద్యం దుకాణా లు ఉన్నాయి. ఐఎంఎల్ డిపో నుంచి మద్యం వ్యాపారులు ఎంత మద్యంను కొనుగోలు చేసినా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారమే వ్యాపారులు మద్యంను విక్రయించాల్సి ఉంది. మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాలలోని మద్యం దుకాణాలలో సాధారణంగా రోజుకు 15 నుంచి 20 కాటన్‌ల విస్కీ, 45 నుంచి 60 కాటన్‌ల బీరు అమ్ముడవుతుంది. పట్టణాలలో అయితే రెండింతల మద్యం ఎక్కువగా అమ్ముడవుతుంది. కాగా, 12 కాటన్‌ల విస్కీ, 40 కాటన్‌ల బీరు మాత్రమే విక్రయించాలని జిల్లా అధికార యం త్రాంగం నిబంధన విధించింది.
మందుబాబుల పరేషాన్
వేసవితాపం పెరగడంతో బీరుకు డిమాండ్ ఉంది. ఎన్నికల సీజన్ కావడంతో విస్కీ అమ్మకాలు ఊపందుకున్నాయి. మందుబాబులు దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. అయితే తక్కువ పరిమాణంలోనే మద్యంను విక్రయించాలని కలెక్టర్ ఆదేశించడంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకే వ్యాపారులు షాపులను తెరిచి ఉంచుతున్నారు. రోజువారీ కోటా మద్యం విక్రయించిన తరువాత వినియోగదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో దుకాణాలకు తాళాలు వేస్తున్నారు.
మద్యం అమ్మ కాలపై ఎస్‌ఎస్‌టీ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఫ్ల యింగ్ స్క్వాడ్, వీడియో సర్విలెన్స్ తదితర బృందాలు రోజూ నిఘా ఉంచుతున్నాయి. మద్యం దుకాణాలలోని అమ్మకాలు, నిలువ ఉన్న మద్యం వివరాలను పరిశీలిస్తున్నాయి. మద్యం దుకాణాలను సీజ్ చేసే అవకాశం ఉండటంతో వ్యాపారులు రోజువారీ కోటా అమ్మకాలు పూర్తి కాగానే దుకాణాలు మూసేస్తున్నారు. ఎన్నికలలో మద్యం ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు కలెక్టర్ తీసుకుం టున్న చర్యలపై ప్రజాస్వామ్యవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మద్యం ప్రవాహానికి బ్రేక్
Published Mon, Apr 7 2014 2:55 AM | Last Updated on Thu, Jul 11 2019 8:43 PM
Advertisement
Advertisement