పెద్దపల్లి : కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో గుర్తు తెలియని మహిళ సజీవ దహనం కేసు మిస్టరీ వీడింది. మృతురాలిని ఖమ్మం జిల్లా కారేపల్లికి చెందిన సుజాత (24)గా గుర్తించారు. సీఐ ప్రకాశ్‌రెడ్డి శనివారం కేసు దర్యాప్తు వివరాలను వెల్లడించారు. సుజాత కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే మనస్పర్థలు రావడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. కాపురానికి వెళ్లాలని తల్లీ, సోదరుడు ఆమెకు నచ్చజెప్పారు.
ససేమిరా అనడంతో సుజాతను ఆమె సోదరుడు బాలాజీ బైక్‌పై కొన్ని రోజుల క్రితం కరీంనగర్ జిల్లా పెద్దపల్లి వంతెన దగ్గరకు తీసుకెళ్లాడు. ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించడంతో సుజాత సజీవ దహనమైంది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలాజీని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో జరిగిన దారుణాన్ని అతడు బయటపెట్టాడు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు సీఐ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు.
కాపురానికి వెళ్లలేదని కాటికి పంపాడు
Published Sat, Sep 19 2015 5:35 PM | Last Updated on Tue, Nov 6 2018 4:10 PM
Advertisement
Advertisement