pedapalli
-
ప్రతిపక్షాల విష ప్రచారాన్ని తిప్పికొడతాం: సీఎం రేవంత్
సాక్షి, పెద్దపల్లి జిల్లా: ఉద్యోగాల కోసం మొదలైన పోరాటం.. ఉద్యమంగా మారి తెలంగాణ తెచ్చుకునేలా చేసిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన పెద్దపల్లిలో యువ వికాస సభలో మాట్లాడుతూ.. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి నినాదంతో ఈ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఇప్పటివరకు 56 వేల మందికి నియామక పత్రాలు అందజేశామని తెలిపారు. మీ అందరి అభిమానంతోనే ముఖ్యమంత్రి అయ్యానని.. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ అంటూ రేవంత్ పేర్కొన్నారు.పదేళ్లు మోసం చేసినోళ్లే ఇప్పుడు..‘‘పదేళ్లు మోసం చేసినోళ్లే ఇప్పుడు అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. పదినెలల పాలనపై వాళ్లు చేసిన విష ప్రచారం అంతా ఇంతా కాదు. తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకోసం?. ఒక కుటుంబాన్ని అందలం ఎక్కించేందుకే తెలంగాణ తెచ్చుకున్నామా?. కేసీఆర్ కుటుంబంలో అందరికి పదవులు వచ్చాయి. కవిత ఓడిపోతే మూడు నెలల్లో ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు...ఉదయం లేస్తే ప్రభుత్వంపై పడి ఏడుస్తున్నారు. శాపనార్థాలు పెడుతున్నారు. శాసనసభకు వచ్చి కేసీఆర్ సలహాలు ఇవ్వొచ్చుకదా?. పదేళ్లలో నిరుద్యోగులకు ఎందుకు ఉద్యోగ పత్రాలు ఇవ్వలేదు? పరీక్షలు వాయిదా వేయాలంటూఐ కృత్రిమ ఉద్యమం సృష్టించారు. ధర్నా చౌక్ ఎత్తేసి నిర్బంధం విధించారు. గతంలో ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేసే పరిస్థితి ఉండేదా?’’ అంటూ రేవంత్‌ప ప్రశ్నించారు.కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు రేవంత్ సవాల్‘‘కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు సవాల్ విసురుతున్నా.. 25 ఏళ్లలో మోదీ గుజరాత్లో మొదటి ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చారా... ? చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం. 25లక్షల మంది రైతులకు రూ.21వేల కోట్లు రుణమాఫీ కోసం విడుదల చేసిన చరిత్ర మాది. గుజరాత్ రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేశారా ఎవరు చర్చకు వస్తారో రండి. ఒక్కరోజులోనే ఎవరూ అద్భుతాలు సృష్టించరు.. ప్రజలు మాకు ఐదేళ్లు అవకాశం ఇచ్చారు...పది నెలలు కూడా ఓపిక పట్టకుండా దిగిపో దిగిపో అంటున్నారు.. వాళ్ల దుఃఖం దేనికో అర్థం కావడంలేదు. పదేళ్లు సీఎంగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవంతో కేసీఆర్ ముందుకు వచ్చి సూచనలు ఇవ్వాలి. కులగణనలో కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్ ఎందుకు పాల్గొనడంలేదు?. మీరు బీసీ వ్యతిరేకులా.. బీసీలకు దక్కాల్సిన వాటా ఇవ్వడం ఇష్టం లేదా? బీసీ సంఘాలు ఆలోచన చేయండి. కులగణనలో పాల్గొనని వారిని సామాజిక బహిష్కరణ చేయండి’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. -
కృంగి‘పోతున్న’ పండుటాకులు: చట్టం ఉందిగా అండగా!
కనిపెంచిన బిడ్డల్ని,కంటికి రెప్పలా కాపాడి, ఎన్నో కష్టాలకోర్చి వారిని పెంచి ప్రయోజకుల్ని చేస్తారు తల్లిదండ్రులు. కానీ రెక్కలు వచ్చిన బిడ్డలు కన్నతండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు. మరికొందరు ఆస్తుల కోసం వేధింపులకు పాల్పడుతున్నారు. హృదయాల్ని కదిలించే ఇలాంటి ఉదంతాలపై స్పెషల్ స్టోరీ..వృద్ధాప్యంలో తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొందరు కుమారులు, కూతుళ్లు పట్టించుకోవడం లేదు.. ఆస్తుల కోసం వేధింపులకు గురిచేయడం, తిండి పెట్టకపోవడం, చేయి చేసుకోవడం, చివరకు చంపేందుకూ వెనకాడకపోవడం వంటి ఘటనలు కృంగిపోయేలా చేస్తున్నాయి.. రెక్కలు ముక్కలు చేసుకొని, పిల్లలను పెంచి, ప్రయోజకులను చేస్తే వృద్ధాప్యంలో పట్టెడన్నం పెట్టకుండా మనోవేదనకు గురి చేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు. కొంతమంది ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు.. మరికొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు.. ఇంకొందరు కలెక్టరేట్లలో ప్రజావాణిని, ఠాణాల్లో పోలీసులను ఆశ్రయిస్తున్నారు.. ఇటీవల ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వృద్ధుల మిస్సింగ్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.ఈమె పేరు గుర్రాల అంతమ్మ. మానకొండూరు మండలం కొండపల్కల. 9 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా కొడుకు లక్ష్మారెడ్డి మాయమాటలు చెప్పి, ఏడెకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. 2022లో తన భర్త మల్లారెడ్డి మరణించడంతో కొన్ని రోజుల తర్వాత ఇంటి నుంచి వెళ్లగొట్టాడని అంతమ్మ వాపోయింది. కూతురు వద్ద తలదాచుకుంటున్నానని కన్నీటిపర్యంతమైంది. మిగిలిన భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కుమారుడు ప్రయత్నిస్తున్నాడని తెలిపింది.ఈ చిత్రంలో కనిపిస్తున్నది చొప్పదండికి చెందిన ముత్యాల గోపాల్‌రెడ్డి, ఆయన భార్య. వీరికి ఇద్దరు కుమారులు రవీందర్‌రెడ్డి, సత్యనారాయణ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 20 ఎకరాల వ్యవసాయ భూమితో దర్జాగా బతికేవారు. పిల్లలను చదివించి, ప్రయోజకులను చేశారు. తీరా కుమారులు మాయమాటలు చెప్పి, భూమిని తమ పేరిట పట్టా చేసుకున్నారు. తర్వాత ఇంట్లో నుంచి గెంటేశారని, ఈ వయసులో తమకు ఇదేం దుస్థితి అంటూ ఆ దంపతులు కంటతడి పెడుతున్నారు.జగిత్యాల మున్సిపాలిటీలోని ఓ వార్డుకు చెందిన ఒక వృద్ధుడు కొడుకు పట్టించుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తుండటంతో మానసికంగా కృంగిపోయాడు. ఇంటిని వదిలి వెళ్లిపోయాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని, విచారణ చేపడుతున్నారు.సిరిసిల్లకు చెందిన ఓ వృద్ధుడు కుమారుడు ఆస్తి రాయించుకొని, తర్వాత పట్టించుకోకపోవడంతోపాటు వేధింపులకు గురిచేస్తున్నాడని హెల్ప్ లైన్–14567కు ఫోన్ చేసి, ఫిర్యాదు చేశాడు. అధికారులు తొలుత కౌన్సెలింగ్ ఇచ్చినా అతనిలో మార్పు రాలేదు. దీంతో ఆర్డీవో ఆధ్వర్యంలో మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ తండ్రికి, కుమారుడికి కౌన్సెలింగ్ ఇచ్చారు. చట్టంలోని నిబంధనలు, విధించే శిక్షల గురించి వివరించారు. తర్వాత కుమారుడి ప్రవర్తనలో మార్పు వచ్చింది.సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని గొల్లపల్లిలో ఆస్తి వివాదం కారణంగా కొడుకు సింగరేణి రిటైర్డ్ కార్మికుడైన తన తండ్రి మధునయ్యను తోసేశాడు. అతను కిందపడి, మృతిచెందాడు.చట్టాలున్నాయి.. న్యాయం పొందొచ్చుపండుటాకులకు సొంత బిడ్డల నుంచే వేధింపులు, నిరాదరణ ఎదురవుతుండటంతో కేంద్రం 2007లో తల్లిదండ్రులు, వయోవృద్ధుల రక్షణ, పోషణ చట్టం తీసుకొచ్చింది. దీని ప్రకారం ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2011లో ఒక నియమావళి రూపొందించింది. 2019లో కేంద్రం వృద్ధుల సంక్షేమం మరింత మెరుగ్గా ఉండటానికి చట్టానికి సవరణలు చేసింది. వాటి ప్రకారం ప్రతీ రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటైంది. దానికి ఆర్డీవో లేదా సబ్ కలెక్టర్ స్థాయి అధికారి చైర్మన్‌గా, స్వచ్ఛంద సంస్థల నుంచి ఒకరు లేదా ఇద్దరు సభ్యులుగా ఉంటారు. బాధిత వృద్ధులకు ఉచితంగా వారి బిడ్డల నుంచి రక్షణ, పోషణ కల్పిస్తారు. బాధితులకు ఈ తీర్పు నచ్చకపోతే కలెక్టర్ చైర్మన్‌గా ఏర్పాటయ్యే అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను 60 రోజుల్లో ఆశ్రయించి, అంతిమ న్యాయం పొందొచ్చు. ఆస్తిని తిరిగి పొందే హక్కునిరాదరణకు గురైనప్పుడు తమ బిడ్డలకు రాసిచ్చిన ఆస్తిని వృద్ధులు బేషరతుగా తిరిగి పొందే హక్కును చట్టంలో చేర్చారు. కేవలం గిఫ్ట్ డీడ్ చేసిన ఆస్తి మాత్రమే కాదు రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తిని సైతం తిరిగి పొందొచ్చు. ప్రతీ నెల మెయింటెనెన్స్ రూ.10 వేల వరకు ఇప్పిస్తారు. ఇటీవల పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఓ వృద్ధుడికి కలెక్టర్ ఇలాగే న్యాయం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం కల్పించిన ఇటువంటి చట్టాలపై వృద్ధులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. కుమారులు నిర్లక్ష్యం చేస్తే టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ 14567 నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చు. లేదా నేరుగా ప్రతీ సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజావాణిలో అధికారులకు విన్నవించుకోవచ్చు. కౌన్సెలింగ్ ఇచ్చి, పోషణ కింద ఆర్థికసాయం అందే ఏర్పాటు చేసి, పోలీసుల ద్వారా రక్షణ కల్పిస్తారు.వేధిస్తే కఠిన చర్యలు వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వాలు చట్టాలు చేశాయి. వాటిపై ప్రతీ ఒక్కరు అవగాహన పెంచుకోవాలి. ఎవరి నుంచి ఏ విధమైన వేధింపులను ఎదుర్కొంటున్నా, ఎలాంటి సమాచారం కోసమైనా హెల్ప్‌లైన్ నంబర్లో సంప్రదించవచ్చు. వృద్ధులను వారి సంతానం ప్రేమతో చూడాలి. వేధింపులకు గురిచేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.– శ్రీనివాస్, సీపీ రామగుండం -
శ్రీగంధం, ఎర్రచందనం సాగు లాభాలు
-
అరగంటలో ఫంక్షన్ హాల్‌కు.. క్షణంలో ఘోరం..
సాక్షి,గోదావరిఖని/కోల్‌సిటీ: అరగంటలో తాము వెళ్తున్న ఫంక్షన్ హాల్‌కు చేరుకునేవారు. అంతలోనే మృత్యురూపంలో బూడిద లారీ అతివేగంగా వచ్చి రోడ్డు దాటుతున్న బొగ్గు లారీని ఢీకొట్టి పక్కనే ఉన్న ఆటోపై పడింది. ఈ సంఘటనలో ఆటోలో వెనకవైపు కూర్చున్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఓ చిన్నారి మృత్యువు నుంచి కొద్దిలో బయటపడింది. సంతోషంగా వెళ్తున్న వారి కుటుంబంలో ప్రమాదం తీరని విషాదాన్ని నింపింది. రామగుండం మండలం ముబారక్‌నగర్‌కు చెందిన షేక్‌హుస్సేన్ కుటుంబం మంచిర్యాల జిల్లా ఇందారంలో జరుగుతున్న ఓ శుభకార్యం నిమిత్తం అదే ప్రాంతం ఖాదర్‌కాలనీకి చెందిన రహీంబేగ్ ఆటోను కిరాయి మాట్లాడుకున్నారు. ఆటోలో షేక్ హుస్సేన్‌తోపాటు ఆయన పెద్ద కుమారుడు షేక్ షకీల్, మరో కుమారుడు తాజ్‌బాబా, పెద్ద కుమారుడి భార్య షేక్ రేష్మ, మనుమడు షేక్ షాకీర్, మనుమరాళ్లు షేక్ సాధియా, షేక్ సాదియా ఉమేరా కలిసి రాత్రి సమయంలో బయల్దేరారు. గోదావరిఖని గంగానగర్ వద్ద ఉన్న ఫ్లైఓవర్ వద్దకు చేరగానే.. బొగ్గు లోడ్‌తో ఓ లారీ రోడ్డు దాటుతోంది. ఆ లారీని గమనించిన ఆటోడ్రైవర్ రహీంబేగ్ ఆటోను పక్కకు నిలిపి ఉంచాడు. అదే సమయంలో ఫ్లైఓవర్ పైనుంచి అతివేగంగా వచ్చిన బూడిద లారీ బొగ్గులారీని ఢీకొట్టింది. వేగంగా ఉండడంతో రెండు లారీలూ పడిపోయాయి. బూడిద లారీ ఆగి ఉన్న ఆటోపై పడడంతో అందులో కూర్చున్న షకీల్(28), ఆయన భార్య రేష్మ, కూతురు షాదీ ఉమేరా(రెండు నెలలు) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆటోలో ఇరుక్కున్న వారిని బయటకు తీశారు. అప్పటికే షకీల్, రేష్మ, సాదీ ఉమేరా మృతి చెందారు. ఆటోడ్రైవర్, మృతుడి తండ్రి, సోదరుడు, పెద్దకుమారుడు, పెద్దకూతురు స్వల్వ గాయాలతో బయటపడ్డారు. బూడిద లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. మృతదేహాలను గోదావరిఖనిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో చనిపోయిన షేక్ షకిల్ వెల్డర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. వెనకాల ఉన్నవారిపై పడిన లారీ.. ఆటోలో వెనకభాగంలో కూర్చుని ఉన్నవారిపై బూడిద లారీ పడటంతో వారిలో ముగ్గురు మృతి చెందారు. తండ్రి చేతిలో ఉన్న షేక్‌షాదియా మాత్రం ప్రాణాలతో బయటపడింది. డ్రైవర్ పక్కన కూర్చున్న వారు మాత్రం స్వల్పగాయాలతో బయటపడ్డారు. రెండు లారీలు రోడ్డుపై పడిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. హైవే కావడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గోదావరిఖని వన్‌టౌన్, టూటౌన్, ట్రాఫిక్ పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మేయర్ బంగి అనిల్‌కుమార్ వెంటనే గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. సంఘటన తీరును తెలుసుకుని వారి కుటుంబాన్ని ఓదార్చారు. -
ఒకే చితిపై న్యాయవాద దంపతుల దహనం
-
ఒకే చితిపై న్యాయవాద దంపతుల దహనం
సాక్షి, పెద్దపల్లి : దారుణహత్యకు గురైన న్యాయవాదులు గట్టు వామన్ రావు నాగమణి దంపతుల అంత్యక్రియలు ముగిశాయి. మంథని మండలం గుంజపడుగులో గోదావరి ఒడ్డున శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారాలను కుటుంబ సభ్యులు పూర్తి చేశారు. ఒకే చితిపై దంపతులిద్దరికీ దహన సంస్కారాలు నిర్వహించారు. వామన్ రావు సోదరుడు ఇంద్రశేఖర్ రావు తలకొరివి పెట్టారు. వారి నివాసం నుంచి గోదావరినది వరకు రెండు కిలోమీటర్లు సాగిన అంతిమయాత్రలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులంతా కన్నీటిపర్యంతమయ్యారు. ఈ అంత్యక్రియల్లో మాజీమంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుతో పాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. గట్టు వామన్ రావు నాగమణి దంపతుల మృతదేహాలకు పూలమాలలు వేసి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు నివాళులర్పించారు. మరోవైపు దంపతుల అంత్యక్రియలు పూర్తికావడంతో నిందితులను అరెస్టు చూపే పనిలో పోలీసులు నిమగ్నమైయ్యారు. కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు A-1 వసంతరావు, A-2 కుంట శ్రీనివాస్, A-3 కుమార్ ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారు. వారిని మరికాసేట్లో మీడియా ముందుకు ప్రవేశపెట్టనున్నారు. దోషులను వెంటనే అరెస్ట్ చేసి.. కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. న్యాయవాద దంపతుల హత్య: దాగి ఉన్న నిజాలు -
నీవు లేక నేనుండ లేను.. నీ వద్దకే వస్తా
సాక్షి, పెద్దపల్లి : భార్య మరణాన్ని తట్టుకోలేక ‘నీవు లేని జీవితం నాకొద్దు.. నేను నీ వద్దకే వస్తా’ అంటూ కొన్ని రోజులుగా కలవరించిన భర్త చివరకు ఆమె సమాధి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఆరెపల్లె గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లోమిట రాజు భార్య రమ్య క్యాన్సర్‌తో నాలుగేళ్ల క్రితం మృతిచెందింది. భార్య మృతిని తట్టుకోలేని రాజు తర్వాత మద్యానికి బానిసయ్యాడు. ‘రమ్య నేను నీవద్దకే వస్తానంటూ నిత్యం రోదిస్తుండే వాడు’. రాజు–రమ్య దంపతులకు సిరి(12), వైష్ణవి(9) కూతుర్లు ఉన్నారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం పత్తి చేను వద్దకు వెళ్తున్నానని కూతుళ్లకు చెప్పాడు. వారు కూడా తండ్రి వెనకాలే వెళ్లారు. రాజు భార్య సమాధి వద్దకు చేరుకుని రోదిస్తూ పురుగుల మందు తాగాడు. గమనించిన కూతుళ్లు పరుగున వచ్చి కుటుంబసభ్యులకు తెలిపారు. బంధువులు వెళ్లేసరికే రాజు స్ప్రహకోల్పోయాడు. వెంటనే పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తల్లిదండ్రుల మృతితో చిన్నారులు అనాథలయ్యారు. తండ్రికోసం చిన్నారుల రోదనలు గ్రామస్తులను కంటతడి పెట్టించాయి. కాల్వశ్రీరాంపూర్ ఎస్సై వెంకటేశ్వర్లు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కరోనా : మాజీ మంత్రి కన్నుమూత
సాక్షి, పెద్దపల్లి : మాజీ మంత్రి మాతంగి నర్సయ్య(76) కన్నుమూశారు. ఇటీవల కరోనా వైరస్ బారిపడిన ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. కరోనాతో పాటు ఇతర ఆనారోగ్య సమస్యలు కూడా ఉండటంతో ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించారు. అతని భార్య జోజమ్మ వారం రోజుల క్రితం మృతి చెందారు. దీంతో మాతంగి నర్సయ్య కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మేడరాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. టీడీపీ ప్రభుత్వంలో కొంతకాలం పాటు మంత్రిగా కొనసాగారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
రోడ్డు ప్రమాదం..ట్రాక్టర్ డ్రైవర్ మృతి
-
కేజీ ప్లాస్టిక్‌కు కిలో బియ్యం
సాక్షి, పెద్దపల్లి : ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు కేజీ ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకుని కిలో బియ్యం అందించేందుకు రైస్‌మిల్లర్లు సహకరించాలని కలెక్టర్ శ్రీదేవసేన సూచించారు. పర్యావరణానికి, భూగర్భ జలాల పెంపునకు ఆటంకం కలిగించే సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించామని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ‘మా గృహం స్వచ్ఛ గృహం, ప్లాస్టిక్ నిర్మూలన అంశాలపై జిల్లా రైస్‌మిల్లర్లు, పెట్రోల్ బంక్ డీలర్లతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛత పరిశుభ్రతకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డంపింగ్‌యార్డు, శ్మశానవాటికల నిర్మా ణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామాల్లోని స్వశక్తి మహిళలకు ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ నిర్వహణ బాధ్యతలను అప్పగించడంతోపాటు అవసరమైన శిక్షణ అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమంలో భాగంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. జాతీయస్థాయిలో స్వచ్ఛతలో ఉత్తమ జిల్లాగా కీర్తి గడిచిన పెద్దపల్లిని అదేస్థాయిలో నిలిపేందుకు రైస్‌మిల్లర్లు, పెట్రోల్‌బంక్ డీలర్లు సహకరించాలని కోరారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకుని కేజీ ప్లాస్టిక్‌కు కిలో బియ్యం అందించాలని కలెక్టర్ కోరగా రైస్‌మిల్లర్ల ప్రతినిధులు అందుకు అంగీకరించారు. అనంతరం జాతీయస్థాయిలో జిల్లాకు గుర్తింపు తీసుకవచ్చిన జిల్లా కలెక్టర్‌ను రైస్‌మిల్లర్లు, పెట్రోల్‌బంకుల ప్రతినిధులు సత్కరించారు. కార్యక్రమంలో జేసీ వనజాదేవి, జిల్లా ఫౌరసరఫరాల అధికారి వెంకటేశ్, సివిల్సప్లై జిల్లా మేనేజర్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. -
బస్టాండ్ సమీపంలో వంటవార్పు
-
వైభవంగా జ్యోతులు
పుట్టపర్తి అర్బన్ : మండలంలోని పెడపల్లి పెద్దతాండాలో కొలువైన మారెమ్మ దేవతకు ఆదివారం గ్రామస్తులు జ్యోతులు మోసి బోనాలు సమర్పించారు. స్థానిక బస్టాండు సమీపంలోని మారెమ్మ ఆలయంలో మూడు రోజులుగా పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చివరి రోజైన ఆదివారం మహిళలంతా జ్యోతులు, బోనాలతో తండాలోని వీధుల్లో ఊరేగుతూ అమ్మవారి ఆలయంలో సమర్పించారు. ఇటీవల సాయిలీలాబాయి అనే బాలికకు పూనకం వచ్చి ఆలయానికి పూర్వ వైభవం తీసుకు రావాలని, లేకుంటే తండాకు అరిష్టమని చెప్పడంతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించామని గ్రామస్తులు తెలిపారు. చివరి రోజున జ్యోతులు బోనాలతో పాటు జంతుబలులిచ్చారు. ఈసందర్భంగా ఆలయాన్ని, మారెమ్మ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టారు. కార్యక్రమానికి వేలాది మంది హాజరై పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీరాంనాయక్, లంబాడీ హక్కుల జిల్లా అధ్యక్షుడు మోహన్‌నాయక్, పెద్ద నాయకుడు బాపూజీనాయక్,యర్రా భాస్కర్, దేనే నాయక్, తిప్పానాయక్, అశ్వర్థనాయక్, బాబు తదితరులు పాల్గొన్నారు. -
కాపురానికి వెళ్లలేదని కాటికి పంపాడు
పెద్దపల్లి : కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో గుర్తు తెలియని మహిళ సజీవ దహనం కేసు మిస్టరీ వీడింది. మృతురాలిని ఖమ్మం జిల్లా కారేపల్లికి చెందిన సుజాత (24)గా గుర్తించారు. సీఐ ప్రకాశ్‌రెడ్డి శనివారం కేసు దర్యాప్తు వివరాలను వెల్లడించారు. సుజాత కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే మనస్పర్థలు రావడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. కాపురానికి వెళ్లాలని తల్లీ, సోదరుడు ఆమెకు నచ్చజెప్పారు. ససేమిరా అనడంతో సుజాతను ఆమె సోదరుడు బాలాజీ బైక్‌పై కొన్ని రోజుల క్రితం కరీంనగర్ జిల్లా పెద్దపల్లి వంతెన దగ్గరకు తీసుకెళ్లాడు. ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించడంతో సుజాత సజీవ దహనమైంది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలాజీని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో జరిగిన దారుణాన్ని అతడు బయటపెట్టాడు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు సీఐ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. -
మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందారెడ్డి కన్నుమూత
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందారెడ్డి కన్నుమూశారు. ప్రొస్టేట్ క్యాన్సర్‌తో గత వారం రోజులుగా ఆయన సికింద్రాబాద్ యశోధ అస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నుంచి ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేగా.. గీట్ల ముకుందారెడ్డి కూనారం గ్రామానికి 1970, 1976లో రెండుసార్లు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 1981లో పెద్దపల్లి సమితి అధ్యక్షుడిగా ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు. 1983 నుంచి వరుసగా ఏడుసార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఒకసారి టీఆర్ఎస్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన చరిత్ర ఆయనది. ఇందులో మూడుసార్లు ఆయన గెలిచారు. జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న గీట్ల ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ సైతం దాఖలు చేశారు. అధిష్టానం భాను ప్రసాదరావుకు టికెట్ ఇచ్చింది. ముకుందరెడ్డికే టికెట్ లభిస్తుందనే ధీమాతో ఉన్న సీనియర్లంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటారని ప్రచారం జరిగినప్పటికీ అధిష్టానం బుజ్జగింపులు, హామీలతో పోటీ నుంచి ఆయన తప్పుకున్నారు. అప్పట్లో అందరికీ గీట్ల టార్గెట్ 1983 నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులెందరో వచ్చినా వారందరికీ గీట్ల ముకుందరెడ్డే టార్గెట్. 1983లో గోనె ప్రకాశరావుపై ఓడిపోయిన ఆయన తర్వాత 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించి రికార్డు సృష్టించారు. ఎన్టీఆర్ ప్రభంజనంలో కాంగ్రెస్ టికెట్‌పై గెలుపొందిన గీట్లను స్వయంగా అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఢిల్లీకి రప్పించుకుని అభినందించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు గోనె ప్రకాశరావు, వేముల రమణయ్య, బిరుదు రాజమల్లు, కాల్వ రాంచంద్రారెడ్డి, గుజ్జుల రామకృష్ణారెడ్డి, సి.సత్యనారాయణరెడ్డి, విజయరమణారావు ఇలా అందరికీ ఆయనే ప్రత్యర్థి. 2009లో ఓటమి తర్వాత కొంత కాలంపాటు స్తబ్ధుగా ఉన్నారు. ఈసారి అసెంబ్లీ బరిలో నిలవాలని ఏడాదికాలంగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఊరూరా తిరిగి బూత్‌స్థాయి కమిటీలు నియమించారు. ప్రచార బాధ్యతలు కార్యకర్తలకు అప్పగించారు. -
ఏసిబికి చిక్కిన ఏఇ, జూనియర్ అసిస్టెంట్
హైదరాబాద్: ఏసిబి అధికారులు ఈ రోజు విశాఖలో ఓ జూనియర్ అసిస్టెంట్‌ను, కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో పంచాయతీరాజ్ ఏఇని లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. విశాఖపట్నం జివిఎంసిలో జూనియర్ అసిస్టెంట్ నాగేశ్వర్ రావు ఓ వ్యక్తి నుంచి 5 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా అదుపులోకి తసుకున్నారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి పంచాయతీరాజ్‌లో ఏఇ శ్రీహరి 15 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు.