హైదరాబాద్: కార్పొరేట్ టీవీ మీడియా అరాచకాలకు నిరసనగా ఈ నెల 19న కేబుల్ ప్రసారాలు నిలిపివేయనున్నట్టు తెలంగాణ ఎంఎస్ఓలు, ఆపరేటర్ల జేఏసీ ప్రకటించింది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రసారాలు ఆపేస్తామని తెలిపింది. పాల్వంచ ఎంఎస్ఓ మల్లెల నాగేశ్వరరావు హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేయాలని కోరుతూ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలుస్తామని చెప్పారు.
తమ డిమాండ్లు, సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఎంఎస్ఓలు, ఆపరేటర్లు జేఏసీగా ఏర్పడ్డారు. జేఏసీ కన్వీనర్లుగా సుభాష్ రెడ్డి, నర్సింగరావు, పమ్మి సురేశ్ లను ఎన్నుకున్నారు.
19న కేబుల్ టీవీ ప్రసారాలు నిలిపివేత
Published Thu, Dec 17 2015 8:14 PM | Last Updated on Sun, Sep 3 2017 2:09 PM
Advertisement
Advertisement