భారతీయ టీవీ ఛానెళ్లపై నేపాల్ నిరవధిక నిషేధం
కఠ్మాండు: నేపాల్ కేబుల్ టీవీ ఆపరేటర్లు భారతీయ టీవీ ఛానెళ్లపై నిరవధికంగా నిషేధం విధించారు. దేశంలోకి వస్తువుల దిగుమతులను బంద్ చేసినందుకు నిరసనగా భారతీయ ఛానెళ్లను బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. భారత్-నేపాల్ సరిహద్దుల్లో ట్రక్కుల ద్వారా వస్తువుల రవాణా జరుగుతోంది. నూతన రాజ్యాంగంలో పేర్కొన్న 7 ప్రాంతాల మోడల్ వివక్షకు గురిచేయడమేనంటూ మాదేశీలు తమ నిరసన తెలుపుతున్నారు. నేపాల్లో తాజా పరిణామాల నేపథ్యంలో భారత్పై వ్యతిరేకత అక్కడ తీవ్రమవుతున్నట్లు కనిపిస్తోంది.
కానీ, ఇటువంటి చర్యలు ఇరుదేశాలకు మంచిదికాదని నేపాల్లో భారత రాయబారి రంజిత్ రే పేర్కొన్నారు. కేవలం కొన్ని ప్రాంతాలలో ఉన్న అసహనాన్ని భారత్కి వ్యతిరేకంగా మలుస్తున్నారని, ఈ సమస్యను పరిష్కరించాలంటే తమ వద్ద ఎటువంటి ప్రణాళికలు లేవన్నారు. రాజకీయ సమస్యల కారణంగా విద్వేషాలు పెరుగుతున్నాయని, అవి తగ్గితే పరిస్థితులు మామాలుగా ఉంటాయని తెలుస్తోంది.