indefinitely
-
సభకు నమస్కారం.. రెండువారాలు రచ్చ రచ్చే!
ఢిల్లీ: వరుసగా ఏడోసారి పార్లమెంట్ సమావేశాలు నిర్ణీత షెడ్యూల్ కంటే ముందుగానే ముగిశాయి.పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయని.. ఉభయసభలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు సోమవారమే ప్రకటించారు స్పీకర్, రాజ్యసభ చైర్మన్లు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. డ్యూ డేట్ కంటే ఐదురోజులు ముందుగానే ఇలా ఉభయ సభలు వాయిదా పడడం ఇదే ఏడోసారి. మిగిలిన ఐదురోజుల్లో రెండు రోజులు సెలవులే ఉన్నాయి. ఒకటి ఆగష్టు 9వ తేదీ మొహర్రం, మరొకటి ఆగస్టు 11 రక్షా బంధన్. ఈ రెండు రోజులు ఎలాగూ సభలు జరగవు. పండుగల కోసం వాళ్ల వాళ్ల నియోజకవర్గాలు, స్వస్థలాలకు ఎంపీలు వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో.. ప్రభుత్వానికి చాలామంది ఎంపీలు విజ్ఞప్తి చేయగా.. ఐదు రోజులు ముందుగానే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. షెడ్యూల్ ప్రకారం.. జులై 18 నుంచి ఆగష్టు 12వ తేదీవరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగాలి. ధరల పెరుగుదల అంశం చర్చగా.. విపక్షాల నిరసనలతో తొలి రెండువారాల పాటు సభాకార్యక్రమాలు అసలు జరగనేలేదు.ఒక వారం పాటుగా మాత్రమే ఉభయ సభాకార్యకలాపాలు సాగాయి. అయితే.. సమయం సంగతి ఏమోగానీ.. చట్టపరమైన ఎజెండా మాత్రం సంతృప్తికరంగా ఉన్నట్లు పార్లమెంట్ వర్గాలు చెప్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో.. లోక్‌సభ పదహారు రోజులు మాత్రమే సమావేశం అయ్యిందని, ఏడు చట్టాలకు ఆమోదం తెలిపినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఇక రాజ్యసభ వాయిదాకు ముందు.. ఉపరాష్ట్రపతి పదవీ విరమణ చేయనున్న వెంకయ్యనాయుడు సైతం రాజ్యసభ కార్యకలాపాల గురించి వివరించారు. సభ 38 గంటలు పని చేసిందని.. 47 గంటలకంటే ఎక్కువ వాయిదాలతోనే వృథా అయ్యిందని ప్రకటించారాయన. ఇక పార్లమెంట్ సమావేశాల పేరిట చేసిన పద్దుల వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. మేజర్ హైలెట్స్ ► ధరల పెంపుపై విపక్షాల నిరసనలు.. నిత్యం నిరసన గళాలతో నినాదాలు ► సభ్యుల సస్పెన్షన్ నేపథ్యంలో.. పార్లమెంట్ ఆవరణలో ఉంటూ నిరసన ► రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. వాటి ఫలితాలు ► రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి అభ్యంతరకర వ్యాఖ్యల నేపథ్యంలో ఉభయ సభల్లో బీజేపీ ఆందోళనతో హోరెత్తించింది. దీంతో ఆయన క్షమాపణలు చెప్పారు. ► పలు కీలక బిల్లులపై ఆమోదం ► టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా తన ఖరీదైన హ్యాండ్ బ్యాగ్‌ను.. ధరల చర్చ జరుగుతున్న టైంలో టేబుల్ కింద దాయడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్. ► జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్య పట్ల పార్లమెంట్ తీవ్ర సంఘీభావం వ్యక్తం చేసింది. -
Twitter ban: అధ్యక్షుడి ట్వీట్ తొలగింపు, నిరవధిక నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్‌కు మరో దేశంలో భారీ షాక్ తగిలింది. దేశంలో ట్విటర్ కార్యకలాపాలను నిరవధికంగా నిలుపుదల చేస్తూ నైజీరియా సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో కార్పొరేట్ ఉనికిని అణచివేసే చర్యలకు ట్విటర్‌ను వినియోగిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫెడరల్ ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు నైజీరియా సమాచార, సాంస్కృతిక మంత్రి అల్హాజి లాయ్ మొహ్మద్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. దేశాధ్యక్షుడు ముహమ్మద్ బుహారీ ట్విటర్ ఖాతా సస్పెన్షన్ జరిగిన రెండు రోజుల తరువాత శుక్రవారం (స్థానిక సమయం) తాజా పరిణామం చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం నైజీరియా అధ్యక్షుడు ముహమ్మద్ బుహారి పోస్ట్ చేసిన ట్వీట్‌ను అభ్యంతరకరమైన పోస్ట్‌గా పేర్కొన్న ట్విటర్ ఆ ట్వీట్‌ను తొలగించడంతో పాటు ఆయన ఖాతాను 12 గంటల పాటు సస్పెండ్ చేసింది. అయితే దీనిపై బుహారీ మద్దతు దారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి ప్రతి స్పందనగానే దేశంలో ట్విటర్ కార్యకలాపాలను నిరవధింగా బ్యాన్ చేస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు సోషల్ మీడియా వేదికలను నియంత్రించేలా కొత్త లైసెన్సింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్టు కూడా ప్రకటించింది. దీనిపై ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. కాగా చైనా, ఇరాన్, ఉత్తర కొరియా, క్యూబా, తుర్క్మెనిస్థాన్, యూఏఈ, సౌదీ అరేబియా, ఈజిప్ట్ తదితర దేశాలు ట్విటర్‌ను శాశ్వతంగా లేదా తాత్కాలికంగా బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి : Twitter దుందుడుకు చర్య: ఉపరాష్ట్రపతికి బ్లూటిక్ తొలగింపు -
ఐపీఎల్ నిరవధిక వాయిదా!
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్న మెంట్ నిరవధికంగా వాయిదా పడటం ఖాయమైంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా ప్రకటించకపోయినా... శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈనెలాఖరువరకు లాక్డౌన్ పొడిగింపునకు మొగ్గు చూపడంతో ఐపీఎల్ టోర్నీ జరిగే పరిస్థితి కనిపించడంలేదు. ‘పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఢిల్లీ రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పొడిగించాయి. ఫలితంగా ప్రస్తుతానికైతే ఐపీఎల్ జరిగే పరిస్థితి లేదు. దాంతో ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేయక తప్పదు. కానీ ఈ ఏడాది టోర్నీని రద్దు చేసే ఆలోచన లేదు’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. -
ఏపీ శాసన సభ నిరవధిక వాయిదా
-
హోండా ప్లాంట్ నిరవధిక మూసివేత
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) హర్యానా, మానేసర్‌లోని తన ప్లాంట్‌లో కార్యకలాపాలను నిరవధికంగా నిలిపివేసింది. ఆందోళన చేస్తున్న కార్మికులతో చర్చలు విఫలం కావడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకంది. సోమవారం నుండి ప్లాంట్ సాధారణ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు సంస్థ నోటీసు విడుదల చేసింది. యూనియన్ నాయకులు, ప్లాంట్ మేనేజ్మెంట్ మధ్య సోమవారం చర్చలు జరిగినా సఫలం కాలేదు. దీంతో శాశ్వత కార్మికులు, సంఘాలు, ఇతర కాంట్రాక్ట్ సిబ్బందిపై దుష్ప్రవర్తన ఆరోపణలు గుప్పిస్తూ ప్లాంట్ హెడ్ సైబల్ మైత్రా ఈ నోటీసులిచ్చారు. యూనియన్ నేతలు కాంట్రాక్టు కార్మికులను రెచ్చగొట్టి తమ అక్రమ సమ్మెను కొనసాగించమని పదేపదే కోరడంతోపాటు, కంపెనీ ప్రాంగణంలో చట్టవిరుద్ధంగా నిరసనలకు ప్రేరేపిస్తున్నారని పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలోఉంచుకుని, ప్లాంట్ సాధారణ కార్యకలాపాలు సాధ్యం కాదని భావించి నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. తిరిగి కార్యకలాపాలను ఎప్పుడు ప్రారంభించేదీ స్పష్టం చేయలేదు. అయితే ప్లాంట్‌లోని పరిస్థితి సాధారణమైన తర్వాత కార్యకలాపాల పునఃప్రారంభంపై వాటాదారులకు సమాచారం ఇస్తామన్నారు. కాగా ఉత్పత్తి కోత, కాంట్రాక్టు ఉద్యోగులపై భారీగా తొలగించడంపై నవంబర్ 5 నుంచి కార్మికులు సమ్మెకు దిగారు. అలాగే తమకు జీతాలు పెంచాలని కూడా పర్మినెంట్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. వీరి ఆందోళనకు రాజకీయ పార్టీలు, ఇతర యూనియన్లు మద్దతు ఇస్తున్నాయి. ప్లాంట్ కార్మిక సంఘం సెక్రటరీ జనరల్ రమేష్ ప్రధాన్ సమాచారం ప్రకారం, ప్లాంట్‌లో ఉత్పత్తి చేసే ద్విచక్ర వాహనాల సంఖ్య రోజుకు 6000 నుండి నవంబర్ నాటికి 3500 కు తగ్గింది. దీంతో 2019 ప్రారంభం నుండి మొత్తం 1,000 మంది ఉపాధి కోల్పోయారు. అలాగే నిబంధనల ప్రకారం, ప్రతి మూడు సంవత్సరాలకు పే స్కేల్ సవరించాలి. అయితే ఆగస్టు 2018 నుండి ఇది పెండింగ్‌లో ఉందని కార్మికులు వాదిస్తున్నారు. -
థాయ్‌లాండ్ బీచ్‌ను మూసేస్తున్నారు
బ్యాంకాక్: ఒకప్పుడు రద్దీగా ఉండే థాయిలాండ్‌కు చెందిన బీచ్ ఒకటి శాశ్వతంగా మూతపడనుంది. వాతావరణాన్ని సంరక్షించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. దీంతో థాయిలాండ్, ఇతర దేశాల నుంచే వచ్చే పర్యాటకులకు ఈ బీచ్ దూరం కానుంది. అండమాన్ సముద్రంలోని సిమిలాన్ నేషనల్ పార్క్ సమీపంలో కోహ్ తచాయి అనే చిన్న ద్వీపం ఉంది. ఇక్కడ అందమైన బీచ్ ఒకటి నెలవై ఉంది. ఇక్కడి పెద్ద మొత్తంలో పర్యాటకు స్వదేశీయులు వస్తుంటారు. అయితే, దీనిని ఇక పూర్తిస్థాయిలో ఈ ఏడాది అక్టోబర్ మాసం నుంచి మూసివేయాలని నిర్ణయించుకున్నట్లు ది బ్యాంకాక్ పోస్ట్ వెల్లడించింది. 'ఇన్ని రోజులపాటు మనందరకి ఆహ్లాదాన్ని ఇచ్చిన కోహ్ తచాయికి ధన్యవాదాలు చెబుతున్నాను. కుప్పలుకుప్పలుగా వచ్చిన టూరిస్టులతో కొద్దికాలంలోనే ఎంతో పాపులర్ అయింది. కానీ, మితిమీరిన జనాలు రావడం వల్ల సమీపంలోనే జాతీయ పార్క్ వాతావరణంపై దుష్ప్రభావం పడే పరిస్థితి తలెత్తింది' అని ఆ పార్క్ అధికారి ఆయన చెప్పారు. -
భారతీయ టీవీ ఛానెళ్లపై నేపాల్ నిరవధిక నిషేధం
కఠ్మాండు: నేపాల్ కేబుల్ టీవీ ఆపరేటర్లు భారతీయ టీవీ ఛానెళ్లపై నిరవధికంగా నిషేధం విధించారు. దేశంలోకి వస్తువుల దిగుమతులను బంద్ చేసినందుకు నిరసనగా భారతీయ ఛానెళ్లను బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. భారత్-నేపాల్ సరిహద్దుల్లో ట్రక్కుల ద్వారా వస్తువుల రవాణా జరుగుతోంది. నూతన రాజ్యాంగంలో పేర్కొన్న 7 ప్రాంతాల మోడల్ వివక్షకు గురిచేయడమేనంటూ మాదేశీలు తమ నిరసన తెలుపుతున్నారు. నేపాల్‌లో తాజా పరిణామాల నేపథ్యంలో భారత్‌పై వ్యతిరేకత అక్కడ తీవ్రమవుతున్నట్లు కనిపిస్తోంది. కానీ, ఇటువంటి చర్యలు ఇరుదేశాలకు మంచిదికాదని నేపాల్‌లో భారత రాయబారి రంజిత్ రే పేర్కొన్నారు. కేవలం కొన్ని ప్రాంతాలలో ఉన్న అసహనాన్ని భారత్‌కి వ్యతిరేకంగా మలుస్తున్నారని, ఈ సమస్యను పరిష్కరించాలంటే తమ వద్ద ఎటువంటి ప్రణాళికలు లేవన్నారు. రాజకీయ సమస్యల కారణంగా విద్వేషాలు పెరుగుతున్నాయని, అవి తగ్గితే పరిస్థితులు మామాలుగా ఉంటాయని తెలుస్తోంది.