సాక్షి, నిర్మల్: పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థులతో పాటు ఆయా పార్టీల నాయకుల్లో టెన్షన్ పెరుగుతోంది. ఎన్నడూ లేనంతగా జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో రోజురోజుకూ అంచనాలు మారిపోతున్నాయి. పార్టీల మధ్య బలాబలాల్లో రోజుకో తీరు హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో అభ్యర్థులు పకడ్బందీగా తమదైన సర్వేలు చేయించుకుంటున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఎక్కడెక్కడ తమ పార్టీ బలంగా ఉంది.. ఎక్కడ బలహీనంగా ఉన్నాం.. అన్న విషయాలను ఎప్పుటికప్పుడు తెలుసుకుంటున్నారు. వాటి ప్రకారం ఆయా ప్రాంతాల నుంచి తమకు వచ్చే ఓట్లను లెక్కేస్తున్నారు. మిగిలిన కొంత సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కీలక వ్యూహాలు అమలులోకి తీసుకువస్తున్నారు.
మూడింట్లో పోటాపోటీ...
జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్, ముథోల్ మూడు నియోజకవర్గాల్లో పార్టీల మధ్య పోటాపోటీ కొనసాగుతోంది. ఓటర్లు ఏ వైపు మొగ్గు చూపుతారోనన్న టెన్షన్ ఈ మూడు నియోజకవర్గాల అభ్యర్థుల్లో నెలకొంది.
⇔ముథోల్ నియోజకవర్గంలో విఠల్‌రెడ్డి(టీఆర్‌ఎస్), రామారావుపటేల్(కాంగ్రెస్)తో పాటు రమాదేవి(బీజేపీ), నారాయణరావుపటేల్(ఎన్‌సీపీ)లు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఢీ అంటే ఢీ అన్నట్లుగా నలుగురు ప్రధాన అభ్యర్థుల పోరు కొనసాగుతోంది. వీరి మధ్యలో బీఎస్పీ నుంచి సురేఖ రాథోడ్ తమదే గెలుపు అన్న ఆశతో ముందుకు సాగుతున్నారు.
⇔ఖానాపూర్ నియోజకవర్గంలో రేఖానాయక్(టీఆర్‌ఎస్), రాథోడ్ రమేష్(కాంగ్రెస్), సట్ల అశోక్(బీజేపీ)లతో పాటు కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ అజ్మీరా హరినాయక్(బీఎస్పీ) పోటీ పడుతున్నారు.
⇔ఇక ఉమ్మడి జిల్లాలో ఆసక్తికరంగా ఉన్న నిర్మల్ నియోజకవర్గంలో అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి(టీఆర్‌ఎస్), ఏలేటి మహేశ్వర్‌రెడ్డి(కాంగ్రెస్), అయిండ్ల సువర్ణారెడ్డి(బీజేపీ)తో పాటు బీఎల్‌పీ నుంచి వడ్లకొండ అలివేలు మంగ బరిలో పోరాడుతున్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య నువ్వా.. నేనా తీరులో పోటీ ఉండగా, ఈ సారి బీజేపీ సైతం బలమైన ఓటుబ్యాంకుతో కలవరపెడుతోంది. మూడు నియోజకవర్గాల్లో గెలుపు ఎవరిని వరిçస్తుందో చెప్పడం కష్టంగా మారిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఎన్ని ఓట్లు పడుతాయో...
నియోజకవర్గంలోని మండలాలు, మేజర్ గ్రామా లు, వార్డులు, వీధుల వారీగా ఎన్ని ఓట్లు తమవై పు ఉంటాయోనన్న అంచనాలను అభ్యర్థులు ఇç ³్పటి నుంచే వేసుకుంటున్నారు. ప్రతీరోజు తమ శ్రేణుల ద్వారా ప్రత్యేక సర్వే చేయించుకుంటున్నా రు. ఎక్కడ బలంగా ఉన్నాం.. ఎక్కడ బలహీనం గా కనిపిస్తున్నాం.. అనే వివరాలను సమీకరించుకుని, దానికి అనుగుణంగా ప్రచారాన్ని మార్చుకుంటున్నారు. పార్టీ పరంగా తమ అధినేతలను రంగంలోకి దింపి, ఓటర్లను తమ వైపు మరలుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బలహీనం గా ఉన్న ప్రాంతాలపైన ప్రత్యేక దృష్టి పెట్టి ఓట్ల శాతం ఎలా పెంచుకోవాలో ప్రణాళికలు వేస్తున్నారు.
ప్రాంతాన్ని బట్టి..
ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల నిర్వహణ కాస్త సులువుగానే ఉంటుంది. కొత్తగా బరిలోకి దిగిన అభ్యర్థులు మాత్రం ప్రజల నాడిని పట్టుకోవడంలో తడబడుతున్నారు. సీనియర్ నాయకులను సంప్రదిస్తూ ముందుకు సాగుతున్నా రు. నియోజకవర్గంలోని ప్రాంతాలను, అక్కడి ఓ టర్ల కులం, సమస్యలు, కోరికలను బట్టి అభ్యర్థు లు స్పందిస్తున్నారు. ఆయా ప్రాంతాలకు ఎలాం టి అవసరాలను తీరిస్తే తమ వైపు వస్తారన్న వ్యూ హాలను అమలు చేస్తున్నారు. ఇప్పటికే కుల సం ఘాలు, యువజన, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘా ల వారితో వేరువేరుగా భేటీ అవుతున్నారు. ప్రాంతాన్ని బట్టి ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. సంఘాల వారీగా వారికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా వర్గాల, సంఘాల సభ్యుల ఓట్లను మాత్రం తమకే వేయించాలని సూచిస్తున్నారు.
కీలక నేతల ద్వారా...
నియోజకవర్గంలో తమకు పట్టున్న ప్రాంతాల్లో మరిన్ని ఓట్లు పడేలా అభ్యర్థులు చూసుకుంటున్నారు. ఇక తమకు అనుకూలంగా లేని ఏరియాల లో తమకు నమ్మకస్తులైన కీలక వ్యక్తులను రంగం లోకి దించుతున్నారు. తెర వెనుక అక్కడి పరిస్థితులను ప్రభావితం చేసేలా వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. కీలక నేతలు సైతం తమకు పట్టులేని ప్రాంతాల్లో స్థానికంగా బలాన్ని పెంచుకునేందుకు సామ, దాన, బేధ, దండోపాయాలను ప్రయోగిస్తున్నారు. ప్రధానంగా పోటాపోటీగా ఉన్న నిర్మల్ నియోజకవర్గంలో ఇలాంటి నేతలు అభ్యర్థుల గెలుపు కోసం కీలకంగా మారుతున్నారు. అవసరమైతే ప్రత్యర్థి పార్టీలలోని కీలక వ్యక్తులను తమవైపు తిప్పుకునేందుకు అన్ని రకాల ఆఫర్‌లను ఇస్తున్నట్లు సమాచారం. ఓటర్లను ప్రభావితం చేసే అంశాలను, స్థానిక పరిస్థితులను అభ్యర్థులకు చేరవేస్తున్నారు. వాటిని ఆయా ప్రాంతాలలో ప్రచారం చేస్తున్న సమయంలో అభ్యర్థులు ప్రత్యే కంగా ప్రస్తావిస్తున్నారు. ఈ రకంగా స్థానిక ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ‘అన్ని రకాల’ అవకాశాలను సద్వినియోగం చేసుకునే పనిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment