హైదరాబాద్: కంటోన్మెంట్ బోర్డు పాలక మండలి ఎన్నికలు ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యాయి. కంటోన్మెంట్ బోర్డుకు 16 మంది సభ్యులు ఉండగా, వీరిలో 8 మంది సైనికాధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి, పలువురు అధికారులు ఉన్నారు. మిగతా 8 మంది కోసం నేడు పోలింగ్ జరుపనున్నారు. బోర్డు అధికారిగా సైనికాధికారితోపాటు ఉపాధ్యక్షుడిగా ప్రజలతో ఎన్నికైన బోర్డు సభ్యుడు ఒకరు నియమించబడ్డారు.
8 వార్డులలో లక్షా 67వేల మంది ఓటర్లు ఉండగా, ఈ 8 వార్డులకు సంబంధించి113 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు జరగనున్నట్టు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. అయితే మొదటిసారిగా ఈవీఎంలను ఎన్నికల అధికారులు ఉపయోగిస్తున్నట్టు చెప్పారు. కాగా, ఈ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే 40 సమస్యాత్మక ప్రాంతాలను పోలీసు శాఖ గుర్తించింది. అందులో భాగంగానే పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు. కంటోన్మెంట్ పరిధిలో144 సెక్షన్ విధించినట్టు పోలీసులు తెలిపారు.
ప్రారంభమైన కంటోన్మెంట్ పాలక మండలి ఎన్నికలు
Published Sun, Jan 11 2015 7:24 AM | Last Updated on Sat, Sep 2 2017 7:34 PM
Advertisement
Advertisement