Cantonment Board
-
Bolarum Cantonment Hospital: బోర్డుదే బాధ్యత
రసూల్‌పురా: బొల్లారం కంటోన్మెంట్ జనరల్ ఆసుపత్రిలో ఆవరణలో చెట్టు కూలి మృతి చెందిన తూంకుంట నివాసి రవీందర్ కుటుంబానికి కంటోన్మెంట్ బోర్డు అధికారులు న్యాయం చేయాలని కోరుతూ బంధువులు, కుటుంబ సభ్యులు బుధవారం ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. ఎండిన చెట్టు తొలగించడంలో బోర్డు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నిండు ప్రాణం బలైందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయ పడిన రవీందర్ సతీమణి సరళాదేవి ఆస్పత్రి ఆవరణలో అంబులెన్స్‌లోనే ఉండి ఈ ఆందోళనలో పాల్గొన్నారు. వీరికి ఉపాధ్యాయ సంఘాల నాయకులు, తిరుమలగిరి మండల పరిధిలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మద్దతు పలికి ఆందోళనలో పాల్గొన్నారు. దీనిపై సమాచారం అందుకున్న బోర్డు సీఈవో మధుకర్ నాయక్ తమ తరపున ప్రతినిధులుగా వాటర్‌వర్క్స్ సూపరిటెండెంట్ రాజ్‌కుమార్, నర్సింగ్ రావు, యాని, రమణ, రాములును ఆస్పత్రికి పంపించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ బోర్డు అధికారులు ఘటనకు బాధ్యత వహించి రవీందర్ ఇద్దరు కుమార్తెలకు న్యాయం చేయాలని కోరారు. అధికారుల నిర్లక్ష్యంవల్లే రవీందర్ మృతి చెందాడని ఆరోపించారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని ఆస్పత్రి ముందు, మీటింగ్ హాల్లో, సూపరింటెండెంట్ రామకృష్ణ వద్ద నాలుగు గంటల పాటు నిరసనకు దిగారు. ఒక దశలో ఉపాధ్యాయులు అధికారి రాజ్‌కుమార్‌తో వాగ్వాదానికి దిగారు. అధికారుల హామీతో ఆందోళన విరమణ ఈ విషయంలో నిర్ణయం తీసుకునే వీలు తమకు లేదని, బోర్డు పాలకమండలి సమావేశంలో చర్చించి రవీందర్ కుటుంబానికి, వారి ఇద్దరు కుమార్తెలకు న్యాయం చేసేందుకు తగిన నిర్ణయం తీసుకుంటామని వాటర్‌వర్క్స్ అధికారి రాజ్‌కుమార్ హామీచ్చారు. అదే విధంగా తీవ్రంగా గాయపడిన సరళాదేవికి కిమ్స్ హాస్పిటల్లో మెరుగైన చికిత్స అందజేస్తామని, ఆ ఖర్చు మొత్తం బోర్డు భరిస్తుందని, బొల్లారం హస్పిటల్ నుంచి ఓ డాక్టర్‌ను కిమ్స్ ఆసుపత్రికి సరళాదేవితో పంపిస్తామని అధికారులు హామీచ్చారు. దీంతో ఆందోళన విరమించారు. -
కంటోన్మెంట్ బోర్డుల ఎన్నికల తేదీ ప్రకటించిన రక్షణశాఖ
-
మనసులో ఏదో పెట్టుకుని రాజకీయం చేయొద్దు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్/రసూల్‌పురా: కంటో న్మెంట్ అభివృద్ధికి సహకరించాల్సిందిగా రాష్ట్రం వచ్చినప్పటినుంచి కోరుతున్నా కేంద్రం మనసులో ఏదోపెట్టుకుని రాజకీయం చే\స్తోందని మున్సిపల్ మంత్రి కె.తారకరామా రావు విమర్శించారు. సనత్‌నగర్, కంటో న్మెంట్, కూకట్పల్లి నియోజకవర్గాల పరిధి లో రూ.61 కోట్ల అంచనా వ్యయంతో పలు ప్రాంతాల్లో నాలా అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేంద్రం సహకరించక పోయినా కంటోన్మెంట్ బోర్డు సభ్యుల కోరిక మేరకు 20 వేల లీటర్ల తాగునీరు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించారని తెలిపారు. డిఫెన్స్ భూమిలో 20 వేల మందికి నివాస స్థలాలు పంపిణీ చేయాలని నిర్ణయించినప్పటికీ కేంద్రం ఇవ్వడం లేదని, ఇచ్చిన భూమికి బదులు మరోచోట భూమి ఇస్తామన్నా పేదలకు పట్టాలివ్వకుండా అడ్డుపడుతోందని ఆరోపించారు. కంటో న్మెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని మరో సారి కోరుతున్నామని, రాజకీయ దురు ద్దేశంతో అభివృద్ధికి ఆటంకం కలిగించొద్దని విన్నవించారు. రహదారుల విస్తరణకు సహకరించాలని కోరినా ముందుకు రాలేదని, అయినా తమ పోరాటం ఆగదని, ప్రయత్నం కొనసాగిస్తామని కేటీఆర్ స్పష్టంచేశారు. కొత్తగా రోడ్లు వేయాలని, కొత్త నాలాలను కట్టాలని, పేదలకు పట్టా లివ్వాలని తాము ప్రయత్నాలు చేస్తుంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బోర్డు పరిధిలో రోడ్లు మూసివేస్తోందని మండిపడ్డారు. -
సికింద్రాబాద్ క్లబ్లో అగ్ని ప్రమాదం.. కంటోన్మెంట్ బోర్డులో కదలిక
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక సికింద్రాబాద్ క్లబ్లో జరిగిన అగ్ని ప్రమాదంతో కంటోన్మెంట్ బోర్డులో కదలిక మొదలైంది. బోర్డు పరిధిలోని నివాసాల భద్రత చర్చనీయాంశమైంది. కంటోన్మెంట్ చట్టంలో ఫైర్ సేఫ్టీ పాటించాలని ప్రత్యేక నిబంధనలున్నాయి. అయితే దశాబ్దాలుగా ఏ ఒక్క నిర్మాణానికీ ఫైర్ ఎన్ఓసీ ఇచ్చిన దాఖలాల్లేవు. అలాగని జీహెచ్ఎంసీని ఆశ్రయిస్తే తమ పరిధి కాదంటూ వెనక్కి పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కంటోన్మెంట్లో ఫైర్ సేఫ్టీపై బోర్డు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రైవేటు నివాసాల సంగతి అటుంచితే.. పక్కా వ్యాపారాలు నిర్వహిస్తున్న ప్రాంగణాల్లో తనిఖీలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా ట్రేడ్ లైసెన్సు లేకుండానే ఓల్డ్ గ్రాంట్ (పురాతన) బంగళాల్లో కొనసాగుతున్న వ్యాపారాల కట్టడికి చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సోమవారం సీఈఓ బి.అజిత్‌రెడ్డి ఆదేశాలతో బోర్డు అధికారులు ఫైర్ సేఫ్టీపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. 15 మీటర్ల ఎత్తుకు లోబడే నిర్మాణాలు ► 10 వేల ఎకరాల విస్తీర్ణంలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్లో 6,500 ఎకరాలకుపైగా స్థలం మిలటరీ అధీనంలోనే ఉంది. 2,800 ఎకరాల ప్రైవేటు స్థలంలోనే 400పైగా కాలనీలు, 50కిపైగా బస్తీలున్నాయి. మొత్తం భవనాల్లో కమర్షియల్ నిర్మాణాలు 5 శాతానికి మించిలేవు. ఫైర్ సేఫ్టీ నిబంధనల మేరకు 15 మీటర్లు.. అంతకంటే ఎత్తులో ఉండే భవనాలు, బహుళ అంతస్తులకు మాత్రమే ఎన్ఓసీ తీసుకోవాలి. కాగా, కంటోన్మెంట్లో 15 మీటర్లకు మించి నిర్మాణాలకు అనుమతులిచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో బీ–2 (ప్రైవేటు) స్థలాల్లో వెలిసిన నిర్మాణాలకు ఫైర్ ఎన్ఓసీ తీసుకోవాల్సిన అవసరం లేదు. (చదవండి: మెంబర్ షిప్ కోసం 20 ఏళ్లు వెయిటింగ్) ► అయితే ఆరు మీటర్లకంటే ఎత్తులో నిర్మించిన ఫంక్షన్ హాల్స్, సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లకు ఎన్ఓసీలు తప్పనిసరి. అయితే, ఈ కేటగిరీలోకి వచ్చే అధికారిక భవనాలు కొన్నే ఉన్నాయి. ► బీ–2 (ప్రైవేటు) స్థలాల్లో చేపట్టే నిర్మాణాలకు, వ్యాపారాలకు బోర్డు నుంచి అనుమతులతో పాటు ట్రేడ్‌లైసెన్సులు జారీ చేస్తారు. ఓజీబీలే టార్గెట్.. ► కంటోన్మెంట్లో బీ–3 కేటగిరీ స్థలాలుగా పరిగ ణించే ఓల్డ్ గ్రాంట్ బంగళా(ఓజీబీ)లు 117 ఉన్నాయి. ► బ్రిటిష్ జమానాలో అప్పటి మిలటరీ ఉన్నతాధికారులు, వ్యాపారులు, భూస్వాములకు నివాస అవసరాలకు వీటిని కేటాయించారు. ► స్థలం యాజమాన్య హక్కులు ఎప్పటికీ రక్షణ శాఖ అధీనంలో ఉండేలా, కేవలం భవనాలను మాత్రమే ఆయా వ్యక్తులకు అప్పగించారు. ► ఈ మేరకు హోల్డర్ ఆఫ్ ఆక్యుపెన్సీ రైట్ (హెచ్ఓఆర్) కింద బంగళాలను దక్కించుకున్న వ్యక్తులు నివాస అవసరాలకే వీటిని వాడాలి. ► బంగళా రూపురేఖల్లో మార్పులు చేయడం, నూతన నిర్మాణాలు చేపట్టడం, కమర్షియల్ కార్యకలాపాలు నిర్వహించడం పూర్తిగా నిషేధం. ► ఈ బంగళాలను ఇతరులకు విక్రయించరాదు. హెచ్ఓఆర్ కలిగిన వ్యక్తుల వారసుల పేరిట మార్చుకునే వెసులు బాటు కల్పించారు. ► ఓల్డ్ గ్రాంట్ బంగళాల నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే ఆయా బంగళాలను రక్షణ శాఖ ఎప్పుడైనా తిరిగి స్వాధీనం చేసుకుంటుంది. ► సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని ఇలాంటి 117 బంగళాల్లో సగానికిపైగా భవనాలు మిలటరీ అధీనంలోనే ఉన్నాయి. కాగా, మిగిలిన వాటిలో పలు బంగళాలు నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయి. ► కంటోన్మెంట్ పరిధిలో 42 బంగళాలకు సంబంధించి నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించిన బోర్డు అధికారులు 2007లో నోటీసులు జారీ చేశారు. ఐదేళ్ల క్రితం సుమారు 20 బంగళాల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ► అయితే ఇప్పటికీ 40కి పైగా ఓల్డ్ గ్రాంట్ బంగళాల్లో 13 ఫంక్షన్ హాళ్లు సహా పూర్తిస్థాయిలో కమర్షియల్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. వీటిలో ఏ ఒక్కదానికీ బోర్డు నుంచి ట్రేడ్ లైసెన్సు లేదు. ► బోర్డు అనుమతి, ట్రేడ్‌లైసెన్సు లేకుండా కొనసాగుతున్న వ్యాపారాలకు ఫైర్ ఎన్ఓసీలు తీసుకునే అవకాశమే లేదు. ► సికింద్రాబాద్ క్లబ్ కూడా ఈ తరహా బంగళా (బంగళా నంబర్ 220) కావడం విశేషం. క్లబ్లో ప్రమాదం నేపథ్యంలో మిగతా ఓల్డ్ గ్రాంట్ బంగళాలే టార్గెట్‌గా అధికారులు ప్రత్యేక చర్యలకు సిద్ధమవుతున్నారు. (చదవండి: హైదరాబాద్‌లో ఊపందుకున్న రియల్టీ జోరు) -
కేంద్రం తీరువల్లే సమస్యలు
సాక్షి, హైదరాబాద్: వివిధ అంశాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో కేంద్ర రక్షణ శాఖ అవలంబిస్తున్న వైఖరివల్లే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో సుదీర్ఘ కాలంగా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించినా.. బోర్డు, రక్షణ శాఖ ఆంక్షలతో పనులు ముందుకు సాగడం లేదన్నారు. ఎమ్మెల్యే సాయన్నతో పాటు, కంటోన్మెంట్ బోర్డులో టీఆర్ఎస్ సభ్యులతో తెలంగాణ భవన్ లో బుధవారం కేటీఆర్ సమావేశమయ్యారు. జంటనగరాల పరిధిలో స్కైవేల నిర్మాణానికి కేం ద్రం నుంచి అనుమతులు రాకపోవడంతో కంటోన్మెంట్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తీరడం లేదన్నారు. స్కైవేల నిర్మాణ అనుమతుల కోసం రాష్ట్ర మంత్రులు, ఎంపీలు పలు మార్లు కేంద్రానికి వినతులు సమర్పించినా స్పందన లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు కంటోన్మెంట్ బోర్డు నుంచి సహకారం లభించడం లేదని, బోర్డు లోని టీఆర్ఎస్ సభ్యులు కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. రామన్నకుంట చెరువులోకి మురికినీరు చేరకుండా రూ. రెండున్నర కోట్లతో రాష్ట్ర పురపాలక శాఖ సిద్ధం చేసిన ప్రతిపాదనలకు ఒకట్రెండు రోజుల్లో అనుమతులు వచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. బోర్డు ఎన్నికల్లో టీఆర్ఎస్దే విజయం కంటోన్మెంట్ బోర్డుకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధిస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బోర్డు పాలక మండలి ఎన్నికలను పార్టీ చిహ్నాలతో నిర్వహించేలా కేంద్రానికి లేఖ రాయాలని ఎమ్మెల్యే సాయన్న కేటీఆర్‌ను కోరారు. సమావేశంలో టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ చిరుమిల్ల రాకేశ్, టీఆర్ఎస్ నేత మర్రి రాజశేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
కంటోన్మెంట్ బోర్డు త్వరలో రద్దు!
సాక్షి, హైదరాబాద్: త్వరలోనే కంటోన్మెంట్ బోర్డులు రద్దు కానున్నాయి. దేశవ్యాప్తంగా మిలటరీ స్టేషన్లలో అంతర్భాగంగా కొనసాగుతున్న జననివాస ప్రాంతాలను తప్పించనున్నారు. అనంతరం ఆయా కంటోన్మెంట్లు ప్రత్యేక మిలటరీ స్టేషన్లుగా కొనసాగనున్నాయి. సంబంధిత ప్రక్రియపై అధ్యయనం చేసేందుకు గతేడాది ఆగస్టులోనే నియమించిన ఉన్నతస్థాయి కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా రక్షణ శాఖ సహాయమంత్రి డాక్టర్ సుభాష్ బమ్రే స్పష్టం చేశారు. కంటోన్మెంట్లను ప్రత్యేక మిలటరీ స్టేషన్లుగా మార్చనున్నామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 62 కంటోన్మెంట్ల పరిధిలో 1,86,730.39 ఎకరాల భూమి ఉన్నట్లు చెప్పారు. కంటోన్మెంట్ల పనితీరుపై అధ్యయనం కోసం 2018 ఆగస్టు 31న ఏర్పాటైన నిపుణుల కమిటీ ప్రత్యేక నివేదికను సమర్పించనుందని తెలిపారు. జీహెచ్ఎంసీలో కలిసే అవకాశం కంటోన్మెంట్లను ప్రత్యేక మిలటరీ స్టేషన్లుగా మారిస్తే ప్రస్తుతం సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కొనసాగుతున్న జన నివాస ప్రాంతాలు జీహెచ్ఎంసీలో విలీనమయ్యే అవకాశముంది. 9,926 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఆరు వేల ఎకరాలు పూర్తిగా మిలటరీ అధీనంలో ఉన్నాయి. 5 వందల ఎకరాలు విమానయాన, రైల్వే మంత్రిత్వ శాఖల అధీనంలో ఉన్నాయి. డిఫెన్స్ ఎస్టేట్స్ యాజమాన్య పరిధిలోని మరో 450 ఎకరాలు గ్రాంటుల రూపంలో (ఓల్డ్ గ్రాంట్ బంగళాలు) ఉన్నాయి. మిగిలిన 3,500 ఎకరాల్లో 700 ఎకరాలు (బైసన్ పోలో, జింఖానా సహా) కంటోన్మెంట్ బోర్డు యాజమాన్య పరిధిలో ఉన్నాయి. మిగిలిన 2,800 ఎకరాల్లోనే సాధారణ పౌరులకు సంబంధించిన 350 కాలనీలు, బస్తీలు ఉన్నాయి. సెక్రటేరియట్‌కు మార్గం సుగమం! కంటోన్మెంట్ బోర్డులను ప్రత్యేక మిలటరీ స్టేషన్లుగా మారిస్తే బైసన్ పోలో, జింఖానా సహా ప్రతిపాదిత స్కైవేల నిర్మాణానికి అవసర మయ్యే భూబదలాయింపు ప్రక్రియ ప్రభుత్వానికి మరింత సర ళతరం కానుంది. ప్రస్తుతం భూబదలాయింపునకు ప్రధాన అడ్డంకిగా ఉన్న సర్వీసు చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించే 156 ఎకరాల్లో సుమారు 120 ఎకరాలు కంటోన్మెంట్ బోర్డుకు సంబంధిం చినవే. ఈ స్థలాలను అప్పగించడం వల్ల కోల్పోయే ఆదాయానికి బదులుగా కంటోన్మెంట్ బోర్డు సర్వీసు చార్జీలు చెల్లించాలని ప్రతిపాదించింది. కంటోన్మెం ట్ బోర్డు పరిధిలోని ప్రాంతాలు జీహెచ్ఎంసీలో కలిస్తే కేవలం 30 ఎకరాల మిలటరీ స్థలం మాత్రమే బదలాయింపు పరిధిలోకి వస్తుం ది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సర్వీసు చార్జీలు చెల్లించకుండానే బైసన్‌పోలో, జింఖా నా మైదానాలు సహా, ప్యాట్నీ– హకీంపేట, ప్యారడైజ్– సుచిత్ర మార్గాల్లోని స్కైవేలకు భూములను సేకరించే వెసులుబాటు కలుగుతుంది. -
28వేల ఓట్ల తొలగింపు.. హైకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని కంటోన్మెంట్ బోర్డు పరిధిలో 28వేల ఓట్లను తొలగించడంపై ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశాడు. మురళి వేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. అంతేకాక దీనిపై కంటోన్మెంట్ బోర్డుకు హైకోర్టు నోటిసులు జారీ చేసింది. రెండు వారాల్లో వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. -
రేపే జాబ్‌మేళా.. వెంటనే నియామకాలు!
కంటోన్మెంట్: హైదరాబాద్ లోని నిరుద్యోగులకు శుభవార్త. ఐటీ, టెక్నికల్, నాన్ టెక్నికల్, ఫార్మా, సేల్స్, మార్కెటింగ్ రంగాల్లో అర్హులైన వారికి ఉద్యోగులు కల్పించేందుకు మంగళవారం సికింద్రాబాద్‌లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా), సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు (ఎస్సీబీ) ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా జరుగనుంది. సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు సాగే ఈ కార్యక్రమాన్ని మెప్మా పీడీ, జలమండలి ఎండీ దానకిశోర్ ప్రారంభించనున్నారు. ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, టెక్నికల్, నాన్‌టెక్నికల్, ఫార్మా, సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగాల్లో మొత్తం 27 విభాగాల ఉద్యోగాల్లో నియామకాలు చేపట్టనున్నట్లు మెప్మా కంటోన్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ ప్రకాశ్ తెలిపారు. కేటగిరీలవారీగా అర్హులైన అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో మేళాకు రావాల్సిందిగా సూచించారు. ఈ మేళాలో సర్టిఫికెట్ల పరిశీలన, ఇంటర్వ్యూలను అక్కడికక్కడే నిర్వహించి ఉద్యోగ నియామకాలు చేపడతారని పేర్కొన్నారు. -
ముగిసిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు
-
ఓటు వేసిన ఎంపీ మల్లారెడ్డి
-
ప్రారంభమైన కంటోన్మెంట్ పాలక మండలి ఎన్నికలు
హైదరాబాద్: కంటోన్మెంట్ బోర్డు పాలక మండలి ఎన్నికలు ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యాయి. కంటోన్మెంట్ బోర్డుకు 16 మంది సభ్యులు ఉండగా, వీరిలో 8 మంది సైనికాధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి, పలువురు అధికారులు ఉన్నారు. మిగతా 8 మంది కోసం నేడు పోలింగ్ జరుపనున్నారు. బోర్డు అధికారిగా సైనికాధికారితోపాటు ఉపాధ్యక్షుడిగా ప్రజలతో ఎన్నికైన బోర్డు సభ్యుడు ఒకరు నియమించబడ్డారు. 8 వార్డులలో లక్షా 67వేల మంది ఓటర్లు ఉండగా, ఈ 8 వార్డులకు సంబంధించి113 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు జరగనున్నట్టు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. అయితే మొదటిసారిగా ఈవీఎంలను ఎన్నికల అధికారులు ఉపయోగిస్తున్నట్టు చెప్పారు. కాగా, ఈ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే 40 సమస్యాత్మక ప్రాంతాలను పోలీసు శాఖ గుర్తించింది. అందులో భాగంగానే పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు. కంటోన్మెంట్ పరిధిలో144 సెక్షన్ విధించినట్టు పోలీసులు తెలిపారు. -
జనవరి 11న కంటోన్మెంట్ ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల నిర్వహణపై నిర్ణయం వెలువడింది. దేశవ్యాప్తంగా 58 కంటోన్మెంట్ల ఎన్నికలు వచ్చే ఏడాది జనవరి 11న జరుగనున్నాయి. ఈ మేరకు డెరైక్టర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్స్ (డీజీడీఈ) తరఫున ఎస్ఆర్వో 09 (ఈ) ఈ నెల 3న నోటిఫికేషన్ జారీ చేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. -
సికింద్రాబాద్ అభివృద్ధికి రూ.300 కోట్లు
మంత్రి పద్మారావు సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్, కంటోన్మెంట్ బోర్డు పరిధిలో రూ.300 కోట్ల అంచనా వ్యయంతో మంచినీటి పైప్లైన్ల విస్తరణ, స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణం, డ్రైనేజీ వంటి వసతులు కల్పిస్తామని ఆబ్కారీశాఖమంత్రి పద్మారావు తెలిపారు. గురువారం సచివాలయంలోని తన ఛాంబర్లో జలమండలి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గతంలో ఈప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకు ఉద్దేశించి సిద్ధంచేసిన మాస్టర్‌ప్లాన్‌ను సమగ్రంగా అమలు చేస్తామన్నారు. ముఖ్యంగా మారేడ్‌పల్లి, తార్నాక, లాలాపేట్ ప్రాంతాల్లో భారీ మంచినీటి స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణానికి అంచనాలు సిద్ధంచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సీతాఫల్మండి ప్రాంతంలో స్టోరేజి రిజర్వాయర్‌కు మరమ్మతులు చేపట్టాలని సూచించారు. కంటోన్మెంట్ పరిధిలో తాగునీరు, డ్రైనేజి వసతుల కల్పనపై నెలకొన్న వివాదాలను త్వరితంగా పరిష్కరించాలన్నారు. సికింద్రాబాద్ పరిధిలో మురుగునీటి పారుదల వ్యవస్థను ఆధునికీకరించేందుకు భారీ ట్రంక్‌మెయిన్స్, లేటరల్స్ నిర్మించాలని సూచించారు. అడ్డగుట్ట, మారేడ్‌పల్లి, లాలాపేట్, తార్నాక పరిధిలోని అన్ని కాలనీలు, బస్తీల్లో మంచినీరు, డ్రైనేజీ వసతులు కల్పించాలన్నారు. మూడోదశపై సమీక్ష కృష్ణా మూడోదశ ప్రాజెక్టును త్వరితంగా పూర్తిచేసి, నగరానికి అదనంగా 90 మిలియన్ గ్యాలన్ల కృష్ణాజలాలను తరలించి నగరం నలుమూలలకు సరఫరా చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో జలమండలి ఆపరేషన్స్ విభాగం డెరైక్టర్ రామేశ్వర్రావు, జీఎం ఆనంద్‌స్వరూప్, డీజీఎం హర్నాకర్ తదితరులు పాల్గొన్నారు. -
కిరాయిదారులకు సర్వే కష్టాలు
వివరాలు ఇవ్వొదంటూ అడ్డుకున్న యజమానులు పలు చోట్ల ఇళ్లను ఖాళీ చేయించిన వైనం సాక్షి,సిటీబ్యూరో: అద్దె ఇళ్లల్లో ఉండేవారికి కుటుంబ సర్వే చుక్కలు చూపించింది. తమ ఇంటి చిరునామా పైన వివరాలు ఇవ్వరాదంటూ కొందరు ఇంటి యజమానులు అడ్డుకొన్నారు. మరి కొన్ని చోట్ల సర్వే అయిపోయే వరకు ఇళ్లల్లో ఉండొద్దంటూ ఒత్తిడి తెచ్చారు. దీంతో మంగళవారం చేట్టిన సమగ్ర సర్వేలో సొంత ఇళ్లు లేని కుటుంబాలుగా గుర్తింపు పొందాలనుకున్న వాళ్లకు నిరాశే మిగిలింది. నగరంలోని రసూల్‌పురా, బేగంపేట్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. బన్సీలాల్‌పేట్ చాచా నెహ్రూనగర్‌లో ఒక ఇంటి యజమాని తన ఇంట్లో కిరాయికి ఉండే నాలుగు కుటుంబాలకు ఇలాగే బయటకు పంపినట్లు సమాచారం. సర్వేలో తమకు ఎక్కువ ఆస్తి ఉన్నట్లుగా నమోదు కావద్దనే ఉద్దేశంతో కి రాయికి ఉన్నవాళ్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. మరి కొన్ని చోట్ల సర్వే సందర్భంగా ఇంటి నెంబర్, కరెంట్ మీటర్ నెంబర్లు సర్వేలో చెప్పొద్దంటూ అడ్డుకున్నారు. చందానగర్ రాజీవ్ గృహకల్ప సముదాయంలోని ఇంటి యజమానులు, కిరాయిదారుల మధ్య వాగ్వాదం నెలకొంది. సర్వేలో తాము ఆయా నివాసాల్లో లేమని తేలితే తమ ఇంటిపై హక్కును కోల్పోతామని ఆందోళన చెందారు. ఇంటిని కిరాయికి ఇచ్చిన వారినిపేర్లు చెప్పొద్దని తమ పేర్లే రాయాలని డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో 2,3 వార్డుల్లో సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభం కాగా, 2వవార్డులో కొంత మంది ఇంటి యజమానులు తమ ఇళ్లల్లో కిరాయికి ఉంటున్న వారి వివరాలు ఇవ్వకుండా అడ్డుకున్నారు. మరికొందరు ఎన్యుమరేటర్లు ఇళ్లలోకి రాకుండా బయటినుంచే పంపించేశారు. కొన్ని బస్తీల్లో అనుబంధ ఎన్యుమరేటర్లు తమకు పది ఇళ్లను మాత్రమే కేటాయించారని.. మరికొందరు స్టిక్కరింగ్ చేయని ఇళ్లను సర్వే చేసేది లేదని తేల్చేశారు. 2వ వార్డు పరిధిలోని కృష్ణనగర్, ఇందిరమ్మ నగర్, అర్జున్ నగర్ బస్తీల్లోని కొందరు ఇంటి యజమానులుతమ ఇళ్లల్లో కిరాయిదారుల వివరాలు ఇవ్వరాదని, తక్షణమే ఇళ్లను ఖాళీ చేయాలని ఆదేశించారు.