కొత్త కారు దగ్ధం; రూ. లక్ష బుగ్గిపాలు | Car Met With Fire Accident Near Neradigonda Toll Gate | Sakshi
Sakshi News home page

కొత్త కారు దగ్ధం; రూ. లక్ష బుగ్గిపాలు

Published Fri, Feb 21 2020 1:18 PM | Last Updated on Fri, Feb 21 2020 1:45 PM

Car Met With Fire Accident Near Neradigonda Toll Gate - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : కొత్తగా కొన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి అగ్నికి ఆహుతి అయింది. ఈ సంఘటన ఆదిలాబాద్‌ జిల్లా నేరెడుగొండ మండలం మామడ టోల్‌ గేట్‌ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. కారులో మంటలు రావడంతో... అందులో ప్రయాణిస్తున్నవారు అప్రమత్తమై కారులో నుంచి దిగి దూరంగా వెళ్లిపోయారు. అయితే కారులో ఉన్న లక్ష రూపాయలు బుగ్గిపాలయ్యాయి. అయితే ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిసింది. కాగా ప్రమాద సమయంలో కారులో ఉన్న నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement