మంచిర్యాలటౌన్ (ఆదిలాబాద్): ఎక్సైజ్ పోలీసులు శనివారం మద్యం తయారీ కేంద్రాలపై దాడి చేయగా, భారీగా నిల్వలు పట్టుబడ్డాయి. ఈ సందర్భంగా మద్యం తయారు చేస్తున్న సర్పంచిపై కేసు నమోదు చేసి, అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు.. జిల్లాలోని జైపూర్ మండలం బూరుగుపల్లి, భీమారం గ్రామాల్లోని మద్యం తయారీ కేంద్రాలపై దాడులు చేశారు.
2,600 లీటర్ల బెల్లం పానకం, 2,800 కిలోల నల్లబెల్లం, 194 కిలోల పటిక, జీపు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో బూరుగుపల్లి గ్రామ సర్పంచి తిరుపతితో సహా మరో ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. మద్యం తయారు చేయటంతోపాటు ప్రోత్సహిస్తున్న నేరాలపై సర్పంచి తిరుపతిని 24 గంటల్లో అరెస్టు చేయనున్నట్లు ఎక్సైజ్ ఇన్‌చార్జి సూపరింటెండెంట్ కరంచంద్ తెలిపారు.
ఎక్సైజ్ దాడులు: సర్పంచిపై కేసు నమోదు
Published Sat, Sep 5 2015 8:38 PM | Last Updated on Thu, Jul 11 2019 8:43 PM
Advertisement
Advertisement