
సాక్షి, చిత్తూరు: ప్రతి జిల్లాలో, ప్రతి బార్‌లో టీడీపీ నాయకులు గోల్ మాల్ చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ డిప్యూటి సీఎం నారాయణ స్వామి మండిపడ్డారు. కరోనా వైరస్ నియంత్రణ పై మాట్లాడకుండా చంద్రబాబు తన స్వ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎక్సైజ్ శాఖ అధికారులతో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్‌లో నారాయణ స్వామి ధ్వజమెత్తారు. ఎక్సైజ్ శాఖలో ఎవరు తప్పు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాఖ పరమైన విచారణ చేసి ఉద్యోగం కూడా తొలగిస్తామని హెచ్చరించారు. రెండు రోజులగా చిత్తూరు జిల్లాలో నాటు సారా విక్రయం జరుగుతోందని తమ దృష్టికి వచ్చిందని, అలా చేసేది ఎవరైనా పిడి యాక్ట్ పెడతామమన్నారు. రెండు సార్లు దొరికితే ప్రభుత్వం ఇచ్చే రాయితీలు రద్దు చేస్తామని హెచ్చరించారు.
ఆయన మాట్లాడుతూ... టీడీపీ నేతలు చంద్రబాబు పాలసీలను అమలు చెయ్యాలని చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు. దుర్యోధనుడు ప్రాణాలు కాపాడుకోవడానికి నీటిలో దాక్కున్నట్లు చంద్రబాబు కూడా హైదరాబాదులో దాక్కున్నారని ఎద్దేవా చేశారు. ఖజానాలో డబ్బు లేకపోయినా కమిట్‌మెంట్‌తో పనిచేస్తున్న వ్యక్తి సీఎం జగన్‌మోహన్ రెడ్డి అని కొనియాడారు. దీంతో పాటు ప్రజలకు ఆయన కొన్ని విషయాలు విజ్ఞప్తి చేశారు. డాక్టర్లు,నర్సులు చాలా కష్టపడుతున్నారని, కరోనా పాజిటివ్ వస్తే డాక్టర్‌లకు సహకరించాలని కోరారు. మైనారిటీలు కూడా ఇంట్లో ఉంటూ ప్రార్ధనలు చేసుకోవాలని సూచించారు. ఇక రాష్ట్ర మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ని తొలగించడంలో వివాదం లేదన్న ఆయన ... గతంలో చంద్రబాబు ఆయనకు కావలసిన వారిని అధికారులుగా నియమించారని ఇప్పుడు వారు గురు భక్తి చాటుకున్నారన్నారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం అందరికి ఆమోదయోగ్యమన్నారు. జగన్ మంచి నిర్ణయాలు తీసుకుంటుంటే ప్రతిపక్షం కావాలనే కోర్టు వెళ్లి అడ్డుకుంటుందని మండిపడ్డారు. చంద్రబాబు క్యారెక్టర్ లేని నాయకుడని ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారన్నారు. కానీ జగన్ ప్రజల మన్ననలు పొంది తన బలం నిరూపించుకున్నారన్నారు. చంద్రబాబుని ముంచేసింది ఆయన అనుకూల మీడియానే అని... సార వ్యాపారం ప్రారంభించింది చంద్రబాబే అని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment