
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి
సాక్షి, చింతలపాలెం (హుజూర్‌నగర్) : ఎన్నికల నిబంధనలు ఉల్లఘించినందుకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని చింతలపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. చింతలపాలెం మండలంలోని మల్లారెడ్డిగూడెం, దొండపాడు గ్రామాల్లో శనివారం రాత్రి 10 గంటలు దాటిన తర్వాత కూడా ప్రచారం నిర్వహించారని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి శివకుమార్ పోలీస్ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.