Flying squads
-
‘కోడ్’ కట్టుదిట్టంగా అమలు చేయాలి
ఆదిలాబాద్: ఎన్నికల కోడ్ కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై హైదరాబాద్ నుంచి సోమవారం ఆయన ఆయా జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, షెడ్యూల్ విడుదలతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందన్నారు. 24 గంటల వ్యవధిలో ప్రభుత్వ భవనాల్లో వివిధ రాజకీయ పార్టీలు, నాయకులకు సంబంధించిన హోర్డింగులు, ఫొటోలు, వాల్‌రైటింగ్ తొలగించాలన్నారు. అలాగే 48 గంటల వ్యవధిలో పబ్లిక్ ప్రాపర్టీస్ వద్ద, 72 గంటల్లోగా ప్రైవేట్ స్థలాల్లో హోర్డింగులు, ఫ్లెక్సీలను తొలగించాలని ఆదేశించారు. నవంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని, అప్పటి వరకు ఫ్లయింగ్ స్క్వాడ్లు, కంట్రోల్ రూమ్, మీడియా సెంటర్ ఏర్పాటు, ఎన్నికల విధుల నిర్వహణకు సిబ్బంది శిక్షణ, తదితర కార్యక్రమాలు పూర్తి చేయాలని సూచించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ వివరాలు సమర్పించాలన్నారు. శాంతిభద్రతలు కట్టుదిట్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, లైటింగ్, ర్యాంపు వంటి సదుపాయాలు కల్పించాలన్నారు. అలాగే ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి మోడల్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. నామినేషన్లు స్వీకరించే సమయంలో రిటర్నింగ్ అధికారులకు భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందులో కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ డి. ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ కుష్బూ గుప్తా, శ్యామలాదేవి, ఆర్డీవో స్రవంతి, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలందప్రియా, తదితరులు పాల్గొన్నారు. -
ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌పై కొరడా
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఎరువుల ధరలు ఎగబాకడం, రైతుల నుండి పెరిగిన డిమాండ్, తగ్గిన సరఫరా కారణంగా దేశంలో ఎక్కువైన ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌పై కేంద్రం దృష్టిసారించింది. రానున్న ఖరీఫ్ సీజన్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలకు దిగింది. బ్లాక్‌మార్కెటింగ్ అరికట్టేందుకు కేంద్ర ఎరువులు, రసాయన మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని 370 ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. తెలంగాణలో నాలుగు యూరియా డైవర్షన్ యూనిట్లలో, ఆంధ్రప్రదేశ్‌లో ఒక మిశ్రమ యూనిట్లో తనిఖీలు చేశాయి. మరో వారం పాటు ఈ ఆకస్మిక తనిఖీలు కొనసాగనున్నాయి. తనిఖీల సందర్భంగా గుజరాత్, కేరళ, హరియాణా, రాజస్తాన్, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఏకంగా 70,000 బస్తాల నకిలీ యూరియాను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీనికి సంబంధించి ఇప్పటిదాకా 30 ఎఫ్ఐఆర్లు నమోదుకాగా, 112 మిశ్రమ తయారీదారులను డీఆథరైజ్ చేసినట్లు వెల్లడించింది. దాదాపు రూ. 2,500 ఖరీదు చేసే 45 కిలోల యూరియా బస్తాను రైతులకు వ్యవసాయ అవసరాలకు రాయితీపై రూ.266కే కేంద్రం అందిస్తోంది. అయితే డిమాండ్‌కు సరిపడా యూరియా సరఫరా లేకపోవడంతో సబ్సిడీ ధరకు యూరియాను పొందలేకపోతున్న రైతన్నలు మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. -
విశాఖలోని ఆస్పత్రిపై కేసు నమోదు
ఆరిలోవ (విశాఖ తూర్పు): విశాఖ హెల్త్‌సిటీలోని గొలగాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (జిమ్స్)లో అక్రమాల బాగోతం బట్టబయలైంది. కరోనా రోగుల నుండి ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రి యాజమాన్యంపై కేసు నమోదైంది. ఆరిలోవ సీఐ ఇమాన్యుయేల్ రాజ్ తెలిపిన వివరాలు ప్రకారం.. హెల్త్‌సిటీలోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో కరోనా రోగుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై విచారించేందుకు విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ ముగ్గురు సభ్యులతో కూడిన ‘డిస్ట్రిక్ట్ లెవెల్ ఫ్లైయింగ్ స్క్వాడ్’ను ఏర్పాటు చేశారు. జిమ్స్‌లో ‘కుమార్స్ హాస్పిటల్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో నిర్వహిస్తున్న ఆస్పత్రిపై ఈ బృందం దర్యాప్తు చేపట్టింది. నేరుగా పలువురు కోవిడ్ పేషెంట్ల కుటుంబసభ్యులను సంప్రదించి వివరాలు సేకరించింది. వారిలో ఓ రోగి నుంచి సుమారు రూ.7 లక్షలు వసూలు చేసి, రూ.1.20 లక్షలకు మాత్రమే బిల్లు ఇచ్చినట్లుగా గుర్తించారు. డబ్బులు లేకపోవడంతో రూ.3 లక్షలకు షూరిటీగా చెక్కు తీసుకుని మృతదేహాన్ని అప్పగించారని మరో కుటుంబం ఆధారాలతో సహా వివరించింది. ఆ ఆధారాలతో ఈ నెల 6, 7 తేదీలలో జిమ్స్ ఆస్పత్రిని సందర్శించి రికార్డులు, బిల్లులు పరిశీలించారు. ఈ పరిశీలనలో బాధితులు చెప్పినవన్నీ నిజమేనని తేలింది. అంతేకాకుండా రెమ్‌డెసివర్ ఇంజక్షన్ల దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ అక్రమాలన్నింటిపై ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ‘డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్’ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ ఇమాన్యుయేల్‌రాజ్ తెలిపారు. ఇదిలా ఉండగా, హెల్త్‌సిటీలో చాలా ఆస్పత్రుల్లో ఇదే విధంగా దోపిడీ సాగుతోందని, వాటిపై కూడా కలెక్టర్ దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు. -
స్టాలిన్ అతిథిగృహంలో సోదాలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ఎన్నికల ప్రచార నిమిత్తం డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ బస చేయనున్న ప్రైవేటు అతిథిగృహంలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. తమిళనాడులో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరుగుతుండగా, వాటిల్లో ఒకటైన ఒట్టబిడారంలో ప్రచారంకోసం ఉదయం స్టాలిన్ అక్కడికి చేరుకోవాలి. తెల్లవారుజాము 5 గంటలకు అతిథిగృహంలోకి ప్రవేశించిన ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. స్టాలిన్ ప్రచార వాహనం, బందోబస్తుగా అనుసరించే పైలట్, బ్లాక్ కమాండోస్, అనుచరుల వాహనాలను సోదా చేశారు. అక్కడి కార్యకర్తల వాహనాలనూ తనిఖీ చేశారు. 23 తర్వాతే ఫ్రంట్‌పై స్పష్టత: స్టాలిన్ ఈనెల 23వ తేదీ ఓట్ల లెక్కింపు తర్వాత మాత్రమే మూడో ఫ్రంట్‌పై స్పష్టత వస్తుందని స్టాలిన్ మీడియాతో చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మూడో ఫ్రంట్ ఏర్పాటు నిమిత్తం రాలేదని, తమిళనాడులో ఆలయాల సందర్శనకు వచ్చి మర్యాదపూర్వకంగా మాత్రమే తనను కలిశారని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు అసాధ్యమని అన్నారు. -
యడ్యూరప్ప హెలికాఫ్టర్‌లో ఎన్నికల సింబ్బంది తనిఖీలు
-
పట్టుబడుతున్న కట్టలు.. కట్టలు!
సాక్షి, అమరావతి బ్యూరో/ఆగిరిపల్లి : ఇంకొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభమవుతుందనగా.. ఓటమి భయం పట్టుకున్న టీడీపీ శ్రేణులు.. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కాలనే దుస్సంకల్పంతో ఓటర్లకు పంచేందుకు పెద్ద ఎత్తున నగదు తరలిస్తూ పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రహస్యంగా సిమెంటు లారీలో తరలిస్తున్న రూ. 1.92,90,500ను విజయవాడ నగర పటమట పోలీసులు.. అదేజిల్లా ఆగిరిపల్లిలో రూ.7,79,750ను ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట నుంచి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వెళ్తున్న ఏపీ16 టీసీ 3308 నంబరు గల సిమెంట్ లారీని కామినేని ఆస్పత్రి సమీపంలో ఉన్న చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఆపి తనిఖీ చేశారు. అందులో సిమెంట్ బస్తాల మధ్య రెండు బాక్స్‌లు ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. దాన్ని తెరచి చూడగా.. అందులో భారీ నగదు కనిపించింది. పోలీసులు తనిఖీ చేస్తుండగానే లారీలో ప్రయాణిస్తున్న ఓ యువకుడు పరారయ్యాడు. డ్రైవర్ కోగంటి సతీష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తనకేమీ తెలియదని.. ఆ డబ్బు ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి కోసం తీసుకెళుతున్నానని తనతోపాటు లారీలో వచ్చిన యువకుడు చెప్పాడని పోలీసులకు వివరించినట్లు తెలుస్తోంది. పట్టుబడిన రూ. 1.92,90,500కు సంబంధించి ఎలాంటి బిల్లులు లేకపోవడంతో పోలీసులు సీజ్ చేశారు. ఆగిరిపల్లిలో.. ఆగిరిపల్లిలోని హనుమాన్‌జంక్షన్ రోడ్డులో ఉన్న బాలాజీ రైస్ అండ్ ఆయిల్ మిల్లో ఓటర్లకు పంపిణీ చేసేందుకు పెద్ద మొత్తంలో నగదు ఉన్నట్లు జిల్లా కలెక్టర్‌కు సమాచారం అందడంతో ఆయన ఆదేశాల మేరకు ఫ్లైయింగ్ స్క్వాడ్, అధికారులు మిల్లులో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఓటర్ లిస్టులు, రూ.7,79,750ను స్వాధీనం చేసుకున్నారు.. దీంతో తనిఖీల్లో పట్టుబడిన నగదును, ఓటర్ లిస్టును, టీడీపీకి చెందిన మిల్లు యజమాని మడుపల్లి గోపాలకృష్ణ కుమార్, అతని సోదరుడు చంద్రమోహన్, మైనార్టీ నేత షేక్ భాషాను పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. పట్టుబడిన నగదు మిల్లుకు సంబంధించినదని మిల్లు యజమాని గోపాలకృష్ణ కుమార్ ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులకు తెలిపారు. స్క్వాడ్ అధికారులు మాట్లాడుతూ మిల్లులో నగదుతో పాటు, ఓటరు లిస్టు, టీడీపీ మైనార్టీ నాయకులు ఉన్నట్లు గుర్తించామని, నగదును సీజ్ చేస్తున్నామని తెలిపారు. -
ఫ్లయింగ్ స్క్వాడ్‌తో నమిత వాగ్వాదం
పెరంబూరు: ఫ్లయింగ్ స్క్వాడ్‌తో నటి నమిత వాగ్వాదానికి దిగింది. దీంతో ఆ ప్రాంతంలో కలకలం చెలరేగింది. వివరాల్లోకి వెళితే పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయ నాయకులు ఓట్లకు నోట్లు విరజిమ్మడానికి సిద్ధం అవుతున్నారు. అయితే ఎన్నికల అధికారులు అలాంటి వాటిని అరికట్టడానికి చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను దింపారు. వారు 24 గంటలు అనుమానం కలిగిన వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. రూ. 50 వేల కంటే ఎక్కువ డబ్బు, నగలను కలిగిన వారి నుంచి తగిన ఆధారాలు లేకుంటే ఆ డబ్బును స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటికే అలా కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. కాగా సేలం జిల్లాలో 33 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను, మరో 33 ప్రత్యేక పోలీస్ బృందాలను ఎన్నికల బృందం తనిఖీలకు నియమించింది. వారు ఆ జిల్లా వ్యాప్తంగా జల్లెడ పట్టి తనిఖీలు చేపట్టారు. వారు ఇప్పటి వరకూ రూ.50 కోట్ల విలువైన నగదు, నగలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం సేలం, కొండాలాంపట్టి సమీపంలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి ఆనంద్ విజయ్ నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన నటి నమిత కారును నిలిపి తనిఖీ చేయాలని చెప్పగా నమితతో పాటు ఆమె కారులో ఉన్న మరి కొందరు అందుకు అడ్డు చెప్పారు. దీంతో అక్కడ నమితకు ఫ్లయింగ్‌స్క్వాడ్ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. కాగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తాము తనిఖీలు చేస్తున్నామని, అందుకు సహకరించాలని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి చెప్పడంతో నటి నమిత వర్గం అంగీకరించారు. అయితే తనిఖీల్లో నమిత కారులో నగదు, ఇతర విలువైనవి లభించలేదు. దీంతో ఫ్లయింగ్‌స్క్వాడ్ ఆమె కారుని పంపేశారు. -
ఫ్లయింగ్ స్క్వాడ్‌తో నమిత వాగ్వాదం..
పెరంబూరు: ఫ్లయింగ్ స్క్వాడ్‌తో నటి నమిత వాగ్వాదానికి దిగింది. దీంతో ఆ ప్రాంతంలో కలకలం చెలరేగింది. వివరాల్లోకి వెళితే పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయ నాయకులు ఓట్లకు నోట్లు విరజిమ్మడానికి సిద్ధం అవుతున్నారు. అయితే ఎన్నికల అధికారులు అలాంటి వాటిని అరికట్టడానికి చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను దింపారు. వారు 24 గంటలు అనుమానం కలిగిన వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. రూ. 50 వేల కంటే ఎక్కువ డబ్బు, నగలను కలిగిన వారి నుంచి తగిన ఆధారాలు లేకుంటే ఆ డబ్బును స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటికే అలా కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. కాగా సేలం జిల్లాలో 33 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను, మరో 33 ప్రత్యేక పోలీస్ బృందాలను ఎన్నికల బృందం తనిఖీలకు నియమించింది. వారు ఆ జిల్లా వ్యాప్తంగా జల్లెడ పట్టి తనిఖీలు చేపట్టారు. వారు ఇప్పటి వరకూ రూ.50 కోట్ల విలువైన నగదు, నగలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం సేలం, కొండాలాంపట్టి సమీపంలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి ఆనంద్ విజయ్ నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన నటి నమిత కారును నిలిపి తనిఖీ చేయాలని చెప్పగా నమితతో పాటు ఆమె కారులో ఉన్న మరి కొందరు అందుకు అడ్డు చెప్పారు. దీంతో అక్కడ నమితకు ఫ్లయింగ్‌స్క్వాడ్ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. కాగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తాము తనిఖీలు చేస్తున్నామని, అందుకు సహకరించాలని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి చెప్పడంతో నటి నమిత వర్గం అంగీకరించారు. అయితే తనిఖీల్లో నమిత కారులో నగదు, ఇతర విలువైనవి లభించలేదు. దీంతో ఫ్లయింగ్‌స్క్వాడ్ ఆమె కారుని పంపేశారు. -
దుస్తుల్లో రూ.1.36 కోట్లు తరలింపు
సాక్షి ప్రతినిధి, చెన్నై: దుస్తుల్లో దాచి రహస్యంగా రూ. 1.36 కోట్లు తీసుకెళుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు వ్యక్తులను చెన్నై ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ సమీపంలోని వాల్టాక్స్ రోడ్లో సోమవారం ఉదయం అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురిని అధికారులు చూశారు. వారిని దగ్గర్లోని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ప్రశ్నించారు. తనిఖీ చేయగా వారు ధరించిన దుస్తుల నుంచి కట్టలు కట్టలుగా రూ. 1.36 కోట్ల నగదు బయటపడింది. వీరిని విజయవాడకు చెందిన బాషా, శ్రీనివాసులు, ఆంజనేయులు, షేక్ సలీంగా గుర్తించారు. నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలూ లేకపోవడంతో ఎన్నికల్లో పంచేందుకు తరలిస్తున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు. -
జెడ్పీటీసీ ఇంట్లో ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు
జమ్మికుంటరూరల్: జమ్మికుంట జెడ్పీటీసీ ఇంట్లో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం..పోలీసుల సహకారంతో తనిఖీలు నిర్వహించడం నియోజకవర్గంలో సంచలనం సృష్టించింది. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం గురువారం మండలంలోని కొత్తపల్లిలో జెడ్పీటీసీ అరుకాల వీరేశలింగం ఇంట్లో తనిఖీలు నిర్వహించి రూ.4.5లక్షలను పంచనామా నిర్వహించి సీజ్ చేశారు. తనిఖీల్లో ఫ్లయింగ్ స్వాడ్ అధికారి(ఎంపీడీవో) జయశ్రీతో పాటు బృందం సభ్యులు పాల్గొన్నారు. పోలీసులతో కాంగ్రెస్ నాయకుల వాగ్వివాదం.. జెడ్పీటీసీ అరుకాల వీరేశలింగం ఇంట్లో తనిఖీలు జరుతున్నాయన్న వార్త దావానంలా వ్యాపించటంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున వీరేశలింగం ఇంటికి చేరుకున్నారు. అయితే ఇంటి ముందు ఉన్న రెండు గేట్లను మూసివేసి తనిఖీలు నిర్వహిస్తుండటంతో కాంగ్రెస్ నాయకులు, కార్యక్తలు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఇంతలోనే కాంగ్రెస్ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి చేరుకోవడంతో కార్యక్తలు ఒక్కసారిగా గేటును తోసుకొని వీరేశలింగం ఇంట్లోకి చొచ్చుకువెళ్లారు. ఈ క్రమంలో కౌశిక్‌రెడ్డికి, స్థానిక సీఐ సృజన్కుమార్ల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఈ సందర్భంగా కౌశిక్‌రెడ్డి మాట్లాడారు. ఎన్నికల యంత్రాంగం, పోలీసులు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాగా ప్రభుత్వానికి, ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. అయితే వీరేశలింగం ఇంటి చుట్టూ అదనపు బలగాలను కాపలాగా ఉంచి తనిఖీలు నిర్వహిస్తుండటంతో ప్రధాన రహదారిన వెళ్లే వాళ్లందరూ గుమిగూడారు. పోలీసులు పెద్దెత్తున మోహరించడంతో ఏం జరిగిందోనని పలువురు ఆసక్తికరంగా చూశారు. డప్పులతో నిరసన.. వీరేశలింగం గతంలో టీఆర్ఎస్ ఉండి ఆ పార్టీ తరఫుపున జెడ్పీటీసీగా గెలుపొందారు. అయితే 2014 లో అప్పటి ఎన్నికల నేపథ్యంలో ఆపద్ధర్మ మంత్రి ఈటల రాజేందర్‌కు చెందిన డప్పులు ఇప్పటికీ వీరేశలింగం ఇంట్లో దర్శనమిచ్చాయి. అయితే ఆ డప్పులను కూడా అధికారులు తీసుకెళ్లాలని కాంగ్రెస్ నాయకులు ఫ్లయింగ్ స్క్వాడ్ అ« దికారులతో గొడవకు దిగారు. అయితే అధికారు లు డప్పులను తీసుకెళ్లేందుకు నిరాకరించడం తో కాంగ్రెస్ నాయకులు డప్పులతో నిరసన వ్య క్తం చేశారు. చివరకు అధికారులు డప్పులను తమ వెంట తీసుకెళ్లడంతో గొడవ సద్దుమనిగింది. -
అభ్యర్థుల ప్రచారంపై నిఘా
సాక్షి, పెద్దఅడిశర్లపల్లి : మారిన నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేల అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను అతిక్రమించి ప్రచార ఆర్భాటాలు నిర్వహించాలని చూసే వారిపై అధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు. అభ్యర్థులు జాగ్రత్తగా ప్రచారం చేసుకోవాలి. లేకుంటే ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్వవహరించాలని ఎన్నికల సంఘం అధికారులకు ఆదేశాలు జారి చేసింది. రంగంలోకి ప్రత్యేక బృందాలు.. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ప్రచారం వేడి పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల కోడ్ అమలుకు వీఎస్టి–1, వీవీటి–1, ఎస్ఎస్టి–3, పీఎస్టి–3 ప్రత్యేక బృందా లు రంగంలోకి దిగాయి. వివిధ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ, ఎన్నికల ప్రచారాలు, పార్టీల కార్యకర్తల సమావేశాలు, వివి ధ సంఘాలతో భేటి ..నాయకుల ర్యాలీలు, బ్యా నర్లు, కరపత్రాలు ఇలా అభ్యర్థులకు సంబంధించిన ప్రతి కదలికలపై డేగ కన్నుతో ప్రత్యేక బృందాలు పరిశీలించనున్నాయి. అనుమతుల మేరకు ర్యాలీలో వాహనాలు ఉపయోగిస్తున్నారా, సమావేశాలు కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారా, పార్టీ కార్యాలయాలకు సంబంధింత అధికారుల నుంచి అనుమతులు పొందుతున్నారా అనే కోణంలో పర్యవేక్షిస్తున్నారు. ఇక అభ్యర్థుల ఎన్నికల ప్రచా రం ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటలలోపే ముగిం చాల్సి ఉంటుంది. రాత్రి 10 గంటలు దాటి న త ర్వాత ప్రచారాలు, సమావేశాలు నిర్వహిస్తే ఎన్ని కల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుంది. ఈ మేరకు అధికారులు కేసులు నమోదు చేస్తారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో ప్రత్యేక బృందాల పరిశీలన అభ్యర్థులకు తలనొప్పిగా మారిం ది. ప్రత్యేక బృందాలు ఇవే.. వీడియో వ్యూవింగ్ టీం(వీవీటీ).. వీవీటీ ప్రతి రోజు అభ్యర్థుల కార్యక్రమాలపై చిత్రీకరించిన ఫుటేజీని వీవీటీకి అప్పగిస్తుంది. అనంతరం వీవీటీ ఫుటేజీని నిశితంగా పరిశీలి స్తుంది. కోడ్ ఉల్లంఘనలు, అభ్యంతరకర, వివా దాస్పాద వ్యాఖ్యలు తదితర అంశాలు ఉంటే ఎన్ని కల రిటర్నింగ్ అధికారికి ఆ ఫుటేజీని అందిస్తుంది. సదరు అభ్యర్థిపై చర్యల కోసం ఆర్ఓ ఎన్నికల ముఖ్య అధికారికి సిఫారసు చేస్తారు. స్టాటిస్టికల్ సర్వేలెన్స్ టీం(ఎస్ఎస్ టీ).. ఈ టీం నియోజకవర్గంలో వివిధ ప్రాంతాలలో ఆకస్మికంగా పర్యటనలు చేస్తూ అభ్యర్థుల, నాయకుల కార్యక్రమాలను పరిశీలిస్తుంది. చెక్ పోస్టుల వద్ద తనిఖీలు జరుగుతున్నాయో లేదో కూడా ఈ టీం పరిశీలిస్తుంది. లోటుపాట్లపై ఎన్నికల అధి కారికి సమాచారం ఇస్తుంది. అభ్యర్థుల ఎన్నికల వ్యయాలను కూడా సేకరిస్తుంది. వీడియో సర్వేలెన్స్ టీం(వీఎస్టీ).. ప్రతి రోజు ఉదయం అభ్యర్థులను వెంబడిస్తూ వారి ప్రతి అంశాన్ని వీడియో చిత్రీకరణ చేస్తుంది. సమావేశాలు, కార్యక్రమాలు, ఓటర్లతో భేటి, ప్రచారాలు ఇలా రాత్రి 10 గంటల వరకు అభ్యర్థుల కదలికను నిశితంగా పరిశీలిస్తూ ప్రతి అంశాన్ని వీడియో చిత్రీకరణ చేస్తుందీ బృందం. ప్లయింగ్ స్క్వాడ్ తనిఖీ(పీఎస్టీ).. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఈ బృందం ప్రత్యేక దృష్టి సారిస్తుంది. నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల వారిగా పీఎస్టీ తనిఖీలు చేస్తూ ఉన్నికల ప్రచారంలో కోడ్ అమలు ఎలా జరుగుతుంది. త దితర అంశాలను పరిశీలిస్తుంది. ఎక్కడైనా డబ్బులు, కానుకల పంపిణీ వ్యవహారాలు జరుగుతున్నాయా..? లేదా అనేది ఈ టీం తనిఖీ చేస్తుంది. -
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌పై కేసు నమోదు
సాక్షి, చింతలపాలెం (హుజూర్నగర్) : ఎన్నికల నిబంధనలు ఉల్లఘించినందుకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలోని చింతలపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. చింతలపాలెం మండలంలోని మల్లారెడ్డిగూడెం, దొండపాడు గ్రామాల్లో శనివారం రాత్రి 10 గంటలు దాటిన తర్వాత కూడా ప్రచారం నిర్వహించారని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి శివకుమార్ పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.3 కోట్ల నగదు స్వాధీనం
పరిగి: ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం తనిఖీల్లో పెద్ద మొత్తంలో నగదు లభ్యమైంది. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం లోని చిట్టెంపల్లిగేట్ సమీపంలో హైదరాబాద్–వికారాబాద్ రోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం హైదరాబాద్ నుంచి వికారాబాద్ వైపు వెళ్తున్న (ఏపీ 09 సీటీ6957) ఐ10 కారును తనిఖీ చేశారు. కారులో రూ.3 కోట్ల నగదు ఉన్నట్లు గుర్తించారు. తర్వాత కారుతో సహా కారులోని వారిని పరిగి అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి తరలించారు. ఈ డబ్బును హైదరాబాద్ జీడిమెట్ల షాపూర్‌లోని ఆదర్శ్ బ్యాంకు నుంచి వికారాబాద్, తాండూరులోని ఆదర్శ్ బ్యాంకులకు తరలిస్తున్నట్లు కారులోని వ్యక్తులు టి.వెంకటేశ్, అరుణ్‌కుమార్, రామనాగేశ్ తెలిపారు. వాటికి సంబంధించి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు నగదు సీజ్ చేశారు. ఈ నగదు రంగారెడ్డి జిల్లా ట్రెజరీకి తరలించారు. పలు అనుమానాలు: ఎన్నికల నేపథ్యంలో భారీ మొత్తంలో నగదు లభ్యమవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాహనానికి ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే రూ.3 కోట్లు తరలిస్తుండటం, ఈ నగదుకు సంబంధించి ఆధారాలు లేకపోవటం అనుమానాలకు తావిచ్చినట్లైంది. బ్యాంకులకైనా పెద్దమొత్తంలో నగదును తరలించేటప్పుడు సెక్యూరిటీ ఉండాల్సిందేనని నిబంధనలు స్పష్టంగా ఉన్న నేపథ్యంలో ఆ డబ్బులు ఎక్కడివన్న కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఓటు... దీని రూటే వేరు గురూ...
తమిళనాడులో ప్రస్తుతం 700 ఫ్లయింగ్ స్క్వాడ్స్ తిరుగుతున్నాయి.ఎందుకో తెలుసా? ఓటర్లను ప్రలోభపెట్టేవారినీ అందుకై కానుకలు ఇచ్చేవాళ్లనీ పట్టుకోవడానికి! పాత ‘వేటగాడు’ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. ‘పుట్టింటోళ్లు తరిమేశారు’... పాటలో విలన్ సత్యనారాయణ ఒకే రంగు డ్రస్సు ఆ రంగులోనే ఉన్న బూట్లు తొడుక్కుని వస్తాడు. కాసేపటికి రౌడీ సిలోన్ మనోహర్ వచ్చి అతని టేబుల్ దగ్గరే కూచుంటాడు. పాట మంచి రసపట్టులో ఉండగా ఇద్దరూ కన్ను గీటుకుంటారు. మరు నిమిషంలో ఇతని షూస్ అతని వైపు అతని షూస్ ఇతని వైపు నెట్టుకుంటారు. అంటే ఆ షూ సోల్లో డైమండ్స్ ఉన్నాయన్నమాట. అక్కడ స్మగ్లింగ్ జరుగుతోందన్న మాట. ప్రస్తుతం తమిళనాడులో ఓటర్లను లోబరుచుకోవడానికి ఇంతకు తక్కువ కాని కొత్త కొత్త రీతులను కనిపెట్టడానికీ కనిపెట్టి వాటిని అమలు పరచడానికి పార్టీలు, లీడర్లు, వారి లెవల్ 3, లెవల్ 4 లీడర్లు వెనుకాడటం లేదు. ఒక్క ఓటే... కాని వేయి లంచాలు. అఫీషియల్... ఒక అధికారి చెప్పినట్టుగా ఓటరును కరప్ట్ చేయడంలో దేశంలో తమిళనాడుకు మించిన రాష్ట్రం లేదు. అక్కడ ఓటరును రెండు విధాలుగా ఆకర్షిస్తారు. ఒకటి అధికారికంగా- అంటే ఎన్నికల మేనిఫెస్టో రూపంలో. రెండు అనధికారికంగా- అంటే డబ్బు దస్కం వగైరా వగైరా. 2006 ఎన్నికలలో డి.ఎం.కె అధినేత కరుణానిధి దీనిని మొదలెట్టారు. రెండు రూపాయలకు కిలోబియ్యం పథకాన్ని ప్రకటించారు. అది చూసి ఏ.ఐ.డి.ఎం.కె. పార్టీ అధినేత్రి జయలలిత ఏకంగా అర్హులకు పది కిలోల ఉచిత బియ్యం ప్రకటించింది. అది చూసి విజయకాంత్ పార్టీ పదిహేను కిలోల ఉచిత బియ్యాన్ని వాగ్దానాన్ని చేసింది. అయితే మొదట మొదలెట్టిన డి.ఎం.కె విజయాన్ని తన్నుకుపోయింది. 2011 ఎన్నికల నాటికి జయలలిత పుంజుకుని ఈ గిఫ్ట్ ప్యాక్ రేంజ్‌ను పెంచేసింది. కలర్ టి.వి, ఫ్రిజ్, సీలింగ్ ఫ్యాన్... వీటిని ఉచితంగా అర్హులకు ప్రకటించింది. పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, పేద మహిళలకు నాలుగు గ్రాముల గోల్డు, పేదింటి పిల్ల పెళ్లికి 25,000 రూపాయల నగదు... ఇక ఆ లిస్టు కొనసాగింది. ప్రస్తుత ఎన్నికలలో ఈ ఊపును డి.ఎం.డి.కె అధినేత విజయకాంత్ కొనసాగిస్తున్నారు. ఆయన ఏకంగా తాను గనక అధికారంలోకి వస్తే పెట్రోలు 45 రూపాయలకి, డీజెల్ 35 రూపాయలకి అందిస్తానని అంటున్నాడు. రాష్ట్ర పరిధిలో ఉన్న పన్నులను ఎంత మినహాయించినా పెట్రోల్ కంపెనీలు, కేంద్ర ప్రభుత్వ విధానాలకు లోబడిన పెట్రోల్ ధర 45 రూపాయలకు దిగదని పండితులు చెబుతున్నారు. అయినా విజయకాంత్ లెక్క చేయడం లేదు. మరొకటి... ప్రతి ఏటా కనీసం ఐదు వేల మంది రైతులను విదేశాలకు పంపి వ్యవసాయంలో మెలకువలు నేర్చుకుని వచ్చేలా చేస్తానని విజయకాంత్ అంటున్నాడు. పల్లెల్లోని ప్రతి కుటుంబం నెలసరి ఆదాయం 25,000 రూపాయలకు పెంచుతానని, అందుకు కావాలంటే ప్రతి ఇంటిలోని ఒకరికి క్లర్క్ ఉద్యోగం ఇస్తానని చెబుతున్నాడు. ఇక తమిళనాడుకు చెందిన టాప్ బ్రాండ్స్, వ్యాపార సంస్థల వాళ్లు ఏ రాష్ర్టంలో అయినా ఏ దేశంలో అయినా తమ వ్యాపారాలు చేసుకోవచ్చని, అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మాట మాత్రం చెప్పాల్సిన పని లేదని అంటున్నాడు. ఈ ఆకర్షణలు ఎవరిని అందలం ఎక్కిస్తాయో చూడాలి. అన్ అఫీషియల్‌గా... తమిళనాడులో ప్రస్తుతం 700 ఫ్లయింగ్ స్క్వాడ్స్ తిరుగుతున్నాయి. ఎందుకో తెలుసా? ఓటర్లను ప్రలోభ పెట్టేవారినీ అందుకై కానుకలు ఇచ్చేవాళ్లనీ పట్టుకోవడానికి. ఇలా అక్రమంగా పంచడానికి తరలిస్తున్న డబ్బును ఇప్పటికే దాదాపు 25 కోట్లు అక్కడ అధికారులు పట్టుకున్నారు. అందుకోసం అత్యాధునిక జి.పి.ఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) ద్వారా ఎక్కడినుంచి ఫిర్యాదుదారుని ఫోన్ వస్తుందో అక్కడికి చేరుకునేందుకు నెట్‌వర్క్‌నూ స్థాపించుకున్నారు. అంటే చెన్నై టి.నగర్ నుంచి ఒక వ్యక్తి ‘మా ఏరియాలో డబ్బు పంచుతున్నారు’ అని ఫోన్ చేయగానే మూడు నుంచి ముప్పై నిమిషాల్లో అక్కడకు స్క్వాడ్ చేరుకునేలాగా ఏర్పాట్లు చేసుకున్నారు. అయినా సరే నాయకులు కొత్త కొత్త మార్గాలను కనిపెట్టడంలో ఐన్స్టీన్లను మించిపోతున్నారు. మొబైల్ రీచార్జ్‌లు.... ఓటర్లకు డబ్బు కావాలి- అని నాయకులు అనుకుంటారు. డబ్బు పంచితే పట్టుకుంటారు కనుక రూ.100, రూ.200, రూ.500కు మొబైల్ రీచార్జ్ చేయిస్తారు. అంటే పరోక్షంగా డబ్బు ఇస్తారు. కొన్ని చోట్ల చిల్లర దుకాణాల కూపన్లు ఇస్తున్నారు. ఆ కూపన్లు పట్టుకొని వెళ్లి ఎంపిక చేసిన షాపుల్లో ఆ కూపన్ మొత్తానికి సరిపడా సరుకు కొనుక్కోవచ్చు. కొన్నిచోట్ల పెట్రోల్ కూపన్లు కూడా చలామణి అవుతున్నాయి. గతంలో వంద నోటు, క్వార్టర్ బాటిల్ మద్యం ఓటరును ఆకర్షించడానికి సరిపోతుందని భావించేవారు. కాని ఇప్పుడు కానుకలు శృతి మించి గంజాయి, డ్రగ్స్ వరకూ వెళుతున్నాయి. పశ్చిమ బెంగాల్ డ్రగ్స్ విషయంలో మొదటి స్థానంలో ఉంటే కేరళ చివరిస్థానంలో ఉంది. ఈసారి ఓటర్ల కోసం సెల్ఫోన్లు, గ్యాస్ సిలిండర్లు, బియ్యం బస్తాలు, సిఎఫ్ఎల్ బల్బులు, వంట పాత్రలు... ఇంకా అనేకం తయారవుతున్నాయి. నిత్యం నిఘా ఉన్నప్పటికీ పాల ప్యాకెట్ల పంపిణీని, న్యూస్పేపర్ల పంపిణీని నాయకులు లక్ష్యం చేసుకునే అవకాశాలున్నాయి. అంటే నేరుగా డబ్బు పంచే వీలు లేకపోతే గనక తెల్లారేసరికి పాల ప్యాకెట్‌తో పాటు దానికి గుచ్చిన ఐదు వందల నోటు లేదంటే వెయ్యి నోటు కనిపించే అవకాశం ఉంది. లేదంటే ముంగిట్లో పడే న్యూస్పేపర్లో పాంప్లెట్‌కు బదులు కరెన్సీ కనిపించవచ్చు కూడా. అందుకే పోలీసులు ఇప్పటి నుంచి పేపర్, మిల్క్ బాయ్‌లను సమావేశ పరిచి ఇలాంటి పనులు చేయవద్దని సూచిస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా... ఓటర్లను ప్రలోభపెట్టే ఏ పనినీ అంగీకరించని ఎలక్షన్ కమిషన్ తను కూడా ఓటర్లను ప్రలోభ పెడుతోందా? సరదాగా అయినా అవుననే చెప్పాలి. ఎందుకంటే ఓటు వేసేందుకు యువ ఓటర్లను ఆకర్షించడానికి ఎలక్షన్ కమిషన్ ‘సెల్ఫీల కాంపిటీషన్’ పెట్టింది. ఓటు వేసిన యువతీ లేదా యువకుడు తమ ఎలక్షన్ బూత్ కనిపించేలా సెల్ఫీ తీసుకుని జిల్లా పరిపాలనకు సంబంధించిన పేజీలో పోస్ట్ చేస్తే ఉత్తమ సెల్ఫీకి బహుమతి ఇస్తానని చెబుతోంది. అది ఒక ఆకర్షణ ఇది ఒక ఆకర్షణ... పవిత్ర భారతావనిలో ఓట్ల పండగ ఒక చిత్ర విచిత్రాల కార్ఖానా. -
సిబ్బంది లేక ఇబ్బంది!
జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగంలో... ఉన్నవారి పైనే మోయలేని భారం ఔట్సోర్సింగ్ వారికి వేతనాల్లేవు పని లేని విభాగాల్లో అదనపు సిబ్బంది సాక్షి, సిటీబ్యూరో : హైదరాబాద్ జిల్లా ఎన్నికల బాధ్యతలు నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీలోని ఎన్నికల విభాగంలో తగినంతమంది సిబ్బంది లేక ఇబ్బందవుతోంది. ఉన్నవారిపైనే అదనపు భారం పడుతోంది. ఎన్నికల నిర్వహణ కోసం వివిధ విభాగాలు.. ఆయా విభాగాలకు తగినంతమంది సిబ్బంది.. ఆయా పనుల నిర్వహణకు నోడల్ ఆఫీసర్లు.. వివిధ కార్యక్రమాల నిర్వహణకు ఆయా విభాగాల అధికారులు.. నియమావళి ఉల్లంఘనలను పరిశీలించేందుకకు ఫ్లయింగ్ స్క్వాడ్స్ వంటి ఏర్పాట్లున్నాయి. కానీ ఎన్నికలకు సంబంధించిన కార్యాలయ విధులను నిర్వహించేందుకు తగినంతమంది సిబ్బంది లేరు. జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగమే జన గణన తదితర విధులు నిర్వహిస్తోంది. స్పెషల్ కమిషనర్, అడిషనల్ కమిషనర్ వంటి ఉన్నత పోస్టులు పోను కార్యాలయ పనులకు సంబంధించిన విధుల నిర్వహణలో ఒక సూపరింటెండెంట్, ఒక సీనియర్ అసిస్టెంట్, ముగ్గురు ఎల్డీసీలు మాత్రం ఉన్నారు. వీరికి సహాయకులుగా ముగ్గురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఓటర్ల జాబితా లో పేర్ల నమోదుకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తుల పరిశీలన నుంచి అర్హులను జాబితాలో చేర్చడం వరకు.. నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలు.. ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నికల పనుల క్రోడీకరణ తదితర బాధ్యతలన్నీ ఈ విభాగంపై ఉన్నాయి. ఓటరు జాబితాలో పేరు నమోదుకు ఎప్పటికప్పుడు గడువు పెంచుతూ పోతుండటంతో, ఆ మేరకు వీరికి పనిభారం పెరుగుతోంది. పెరిగిన దరఖాస్తులకు అనుగుణంగా కొత్తగా పెరిగిన ఓటర్లు.. పురుషు లు, మహిళల నిష్పత్తి.. కొత్త ఓటర్లు.. వయస్సుల వారీగా ఓటర్ల విభజన, డూప్లికేట్లను గుర్తించ డం తదితర బాధ్యతలన్నీ వీరిపైనే ఉంటున్నాయి. ఎన్నికలకు సంబంధించిన ఇలాంటి పనులన్నింటినీ నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాల్సి ఉండటంతో, ఉన్న సిబ్బందిపైనే మోయలేని భారం పడుతోంది. ఉన్నతాధికారులు తరచూ నిర్వహిస్తున్న సమీక్షలకు అవసరమైన సమాచారాన్ని క్రోడీకరించడం ఇతరత్రా బాధ్యతలూ వీరిపైనే ఉన్నాయి. దీంతో, ఈ విభాగంలోని ఉద్యోగులు పని ఒత్తిడితో తరచూ ఆస్పత్రుల పాలవుతున్నారు. ఓవైపు ఎన్నికల సమయం కావడంతో సెలవులు తీసుకోలేకపోవడం.. మరోవైపు ఆరోగ్య సమస్యలతో వారు సతమతమవుతున్నారు. కార్యాలయంలోని విధులతోపాటు ఎన్నికలకు సంబంధించి ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు కోరే సమస్త సమాచారాన్ని ఆగమేఘాల మీద అందజేయలేక తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని జీహెచ్ఎంసీ వర్గాలు చెబుతున్నాయి. ఓటర్ల నమోదు సందర్భంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు తదితర పనుల్లోనూ వీరిని భాగస్వాములను చేస్తున్నారు. ఎంసీహెచ్‌గా ఉన్నప్పుడు ఉన్న సిబ్బందితోనే జీహెచ్ఎంసీగా మారాక కూడా నెట్టుకొస్తున్నారు. స్టాఫింగ్ ప్యాట్రన్‌పై సిఫార్సు చేసిన ప్రసాదరావు కమిటీ సైతం జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగంలో అవసరమైనంతమంది సిబ్బంది లేక లోపభూయిష్టంగా ఉందని పేర్కొంది. పనితీరు మెరుగుపడాలంటే కొత్తగా తీసుకోవాల్సిన 145 మంది అసిస్టెంట్ కమిషనర్లలో కొందరిని ఎన్నికల విభాగంలో నియమించాలని కూడా సూచించింది. వారితో పాటు అదనపు సిబ్బంది అవసరమని పేర్కొంది. ఆ నియామకాల ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ఎన్నికల సమయంలో తాత్కాలికంగానైనా అదనపు సిబ్బంది అవసరం ఉంది. ఎన్నికల విభాగంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు గత ఐదునెలలుగా వేతనాలు అందకపోయినా పట్టించుకున్నవారు లేరు. ఓవైపు వేతనాల్లేక, మరోవైపు అద నపు భారం మోయలేక వారు సతమతమవుతున్నారు. పనుల్లేని చోట అదనపు సిబ్బంది ఎన్నికల సమయంలో.. జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగంలో తగినంతమంది సిబ్బంది లేకపోవడం ఒకవైపు దృశ్యం కాగా.. మరోవైపు పనులు పెద్దగా లేని పలు విభాగాల్లో భారీ సిబ్బంది ఉన్నారు. అవసరమున్నా, లేకపోయినా వివిధ కారణాలతో పలువురిని ఆయా విభాగాల్లో తీసుకున్నారు. రెగ్యులర్ ఉద్యోగులే కాక.. ఔట్సోర్సింగ్ సిబ్బంది నియామకాల్లోనూ ఇదే వరుస. పైరవీలతో.. పై వారి ఆదేశాలతో ఇబ్బడి ముబ్బడిగా తీసుకున్న వారిని ఖాళీగా కూర్చోబెట్టి వేతనాలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మేయర్, కమిషనర్ కార్యాలయాల్లో సైతం లేనంతమంది సిబ్బంది కొందరు హెచ్ఓడీల అజమాయిషీలో పనిచేస్తున్నారు. ఔట్‌సోర్సింగ్‌పై తీసుకున్న వారిలోనూ కొందరు హెచ్ఓడీలకు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ) వంటి వారు కూడా ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. వారు చేసే పనులేమిటో ఎవరికీ తెలియదు. కారుణ్య నియామకాల కింద తీసుకున్నవారితో పాటు ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో తీసుకున్న పలువురికి పని చూపించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో అత్యవసర పనులున్న సమయంలో సైతం ఎన్నికల విభాగంలో అవసరమైనంతమంది సిబ్బంది లేకపోవడమే విచిత్రం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ అంశాల్ని పరిశీలించి, అదనపు సిబ్బంది ఉన్న విభాగాల్లోని వారిని సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్న విభాగాల్లో నియమించాలని పలువురు జీహెచ్ఎంసీ ఉద్యోగులు కోరుతున్నారు. సమస్యలివీ... జీహెచ్ఎంసీకి ఎన్నికల విభాగానికి 2 సూపరింటెండెంట్ల పోస్టులు మంజూరు కాగా, ఒక్కరే పనిచేస్తున్నారు. యూసీడీ పోస్టులు మంజూరైనవి 17. పనిచేస్తున్నది ఇద్దరు. ఎల్డీసీ పోస్టులు 24 మంజూరైనా, ఆరుగురు మాత్రమే ఉన్నారు. గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ఎన్నికల విభాగంలో 24 మంది కంప్యూటర్ ఆపరేటర్లను ఔట్‌సోర్సింగ్‌పై తీసుకున్నారు. వారికి గత ఐదునెలలుగా వేతనాల్లేవు. -
లోక్‌సభ ఎన్నికల ఖర్చు పరిమితి పెంపు
కోల్‌కతా: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చు పరిమితి పెరిగింది. ఈ సారి రూ. 40 లక్షల వరకూ అనుమతినిచ్చారు. గత ఎన్నికల్లో రూ. 25 లక్షల పరిమితిని 2011 ఉప ఎన్నికల నుంచి పెంచారని, ఇపుడు ఆ ప్రకారమే ఖర్చు చేయవచ్చని పశ్చిమబెంగాల్ జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సైబల్ బర్మన్ గురువారం చెప్పారు. అయితే పార్టీలు అసంతృప్తిగా ఉన్నాయని, పరిమితిని మరింత పెంచాలంటూ పలు పార్టీలు కోరుతున్నాయని తెలిపారు. అభ్యర్థుల ఖర్చుపై గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని, ఖర్చు పర్యవేక్షకుల ఆధ్వర్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్థిర నిఘా బృందాలు, వీడియో బృందాలు పనిచేస్తాయని వెల్లడించారు. ఆ ఖర్చు పక్కదారి పట్టకుండా పర్యవేక్షకులు చైతన్యం తీసుకొస్తారని, మీడియా ద్వారా కూడా ప్రచారం చేస్తామని బర్మన్ చెప్పారు.