సాక్షి, పెద్దఅడిశర్లపల్లి : మారిన నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేల అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను అతిక్రమించి ప్రచార ఆర్భాటాలు నిర్వహించాలని చూసే వారిపై అధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు. అభ్యర్థులు జాగ్రత్తగా ప్రచారం చేసుకోవాలి. లేకుంటే ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్వవహరించాలని ఎన్నికల సంఘం అధికారులకు ఆదేశాలు జారి చేసింది.
రంగంలోకి ప్రత్యేక బృందాలు..
నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ప్రచారం వేడి పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల కోడ్ అమలుకు వీఎస్‌టి–1, వీవీటి–1, ఎస్‌ఎస్‌టి–3, పీఎస్‌టి–3 ప్రత్యేక బృందా లు రంగంలోకి దిగాయి. వివిధ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ, ఎన్నికల ప్రచారాలు, పార్టీల కార్యకర్తల సమావేశాలు, వివి ధ సంఘాలతో భేటి ..నాయకుల ర్యాలీలు, బ్యా నర్లు, కరపత్రాలు ఇలా అభ్యర్థులకు సంబంధించిన ప్రతి కదలికలపై డేగ కన్నుతో ప్రత్యేక బృందాలు పరిశీలించనున్నాయి. అనుమతుల మేరకు ర్యాలీలో వాహనాలు ఉపయోగిస్తున్నారా, సమావేశాలు కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారా, పార్టీ కార్యాలయాలకు సంబంధింత అధికారుల నుంచి అనుమతులు పొందుతున్నారా అనే కోణంలో పర్యవేక్షిస్తున్నారు. ఇక అభ్యర్థుల ఎన్నికల ప్రచా రం ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటలలోపే ముగిం చాల్సి ఉంటుంది. రాత్రి 10 గంటలు దాటి న త ర్వాత ప్రచారాలు, సమావేశాలు నిర్వహిస్తే ఎన్ని కల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుంది. ఈ మేరకు అధికారులు కేసులు నమోదు చేస్తారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో ప్రత్యేక బృందాల పరిశీలన అభ్యర్థులకు తలనొప్పిగా మారిం ది.
ప్రత్యేక బృందాలు ఇవే..
వీడియో వ్యూవింగ్ టీం(వీవీటీ)..
వీవీటీ ప్రతి రోజు అభ్యర్థుల కార్యక్రమాలపై చిత్రీకరించిన ఫుటేజీని వీవీటీకి అప్పగిస్తుంది. అనంతరం వీవీటీ ఫుటేజీని నిశితంగా పరిశీలి స్తుంది. కోడ్ ఉల్లంఘనలు, అభ్యంతరకర, వివా దాస్పాద వ్యాఖ్యలు తదితర అంశాలు ఉంటే ఎన్ని కల రిటర్నింగ్ అధికారికి ఆ ఫుటేజీని అందిస్తుంది. సదరు అభ్యర్థిపై చర్యల కోసం ఆర్‌ఓ ఎన్నికల ముఖ్య అధికారికి సిఫారసు చేస్తారు.
స్టాటిస్టికల్ సర్వేలెన్స్ టీం(ఎస్‌ఎస్ టీ)..
ఈ టీం నియోజకవర్గంలో వివిధ ప్రాంతాలలో ఆకస్మికంగా పర్యటనలు చేస్తూ అభ్యర్థుల, నాయకుల కార్యక్రమాలను పరిశీలిస్తుంది. చెక్ పోస్టుల వద్ద తనిఖీలు జరుగుతున్నాయో లేదో కూడా ఈ టీం పరిశీలిస్తుంది. లోటుపాట్లపై ఎన్నికల అధి కారికి సమాచారం ఇస్తుంది. అభ్యర్థుల ఎన్నికల వ్యయాలను కూడా సేకరిస్తుంది.
వీడియో సర్వేలెన్స్ టీం(వీఎస్‌టీ)..
ప్రతి రోజు ఉదయం అభ్యర్థులను వెంబడిస్తూ వారి ప్రతి అంశాన్ని వీడియో చిత్రీకరణ చేస్తుంది. సమావేశాలు, కార్యక్రమాలు, ఓటర్లతో భేటి, ప్రచారాలు ఇలా రాత్రి 10 గంటల వరకు అభ్యర్థుల కదలికను నిశితంగా పరిశీలిస్తూ ప్రతి అంశాన్ని వీడియో చిత్రీకరణ చేస్తుందీ బృందం.
ప్లయింగ్ స్క్వాడ్ తనిఖీ(పీఎస్‌టీ)..
ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఈ బృందం ప్రత్యేక దృష్టి సారిస్తుంది. నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల వారిగా పీఎస్‌టీ తనిఖీలు చేస్తూ ఉన్నికల ప్రచారంలో కోడ్ అమలు ఎలా జరుగుతుంది. త దితర అంశాలను పరిశీలిస్తుంది. ఎక్కడైనా డబ్బులు, కానుకల పంపిణీ వ్యవహారాలు జరుగుతున్నాయా..? లేదా అనేది ఈ టీం తనిఖీ చేస్తుంది.
అభ్యర్థుల ప్రచారంపై నిఘా
Published Mon, Nov 26 2018 11:07 AM | Last Updated on Mon, Nov 26 2018 11:07 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment