వెల్పుగొండలో రైతులతో కలిసి వరికొడుతున్న టీఆర్‌ఎస్ అభ్యర్థి క్రాంతికిరణ్
సాక్షి,టెక్మాల్(మెదక్) : ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నారు. మంగళవారం టేక్మాల్ మండలంలోని వెల్పుగొండ శివారులో వరికొడుతున్న రైతుల వద్దకు వెళ్లి ఆందోల్ ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతికిరణ్ వారితోపాటు వరిని కొట్టారు. వరి కొట్టడంతో కార్యకర్తలు, నాయకులంతా ఉత్సాహంగా చప్పట్లు కొట్టారు. అనంతరం ఎల్లుపేటలో వరి కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లి హమాలీలతో మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు.
Comments
Please login to add a commentAdd a comment